S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/19/2017 - 03:14

విజయనగరం, డిసెంబర్ 18: దక్షిణ భారత్‌లోనే అతి ప్రాచీనమైన విజయనగరం మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలకు విద్యార్థులు కరవయ్యారు. గత ఐదేళ్లుగా ఈ కళాశాలలో ఒక్క అడ్మిషన్ కూడా జరగకపోవడంతో కళాశాల మనుగడే ప్రశ్నార్థకమైంది. 1860లో విజయనగర గజపతులు ఈ పాఠశాలను స్థాపించారు. 1957 నుంచి ప్రభుత్వ ఆధీనంలో దీనిని నిర్వహిస్తున్నారు.

12/19/2017 - 02:11

పాల్వంచ, డిసెంబర్ 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో నూతనంగా చేపట్టిన కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రూ.5.290కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌లో ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలని మొదట షెడ్యూల్ ఖరారైంది, ఈ నేపధ్యంలో డిసెంబర్ 25నాటికైనా లైటప్ చేసేందుకు అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు.

12/19/2017 - 01:07

విజయవాడ, డిసెంబర్ 18: ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు జీతాల చెల్లింపుకు రూ.82.44 కోట్లు విడుదలయ్యాయని పీఆర్‌టీయు సంఘ నేత, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధుల విడుదలతో వారికి వచ్చే మార్చి నెల వరకు జీతాల చెల్లింపుకు మార్గం సుగమమైందన్నారు.

12/19/2017 - 01:06

విజయవాడ, డిసెంబర్ 18: ‘శ్రీశ్రీశ్రీ రామానుజాచార్య’పై అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవం ఎంట్రీల గడువును ఫిబ్రవరి 5వ తేదీ వరకు పొడిగించారు.

12/19/2017 - 01:06

విజయవాడ, డిసెంబర్ 18: రాష్ట్రంలో దివ్యాంగులైన (వికలాంగులు) దాదాపు 7వేల మందికి వర్తించే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల్లో 3శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2011 అక్టోబర్ 19 నుండే అమల్లోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవోఎంఎస్ నెం.188 ఉత్తర్వులు జారీచేసింది.

12/19/2017 - 01:05

విజయవాడ (క్రైం), డిసెంబర్ 18: రాష్ట్రంలో తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిఐడి ఎస్పీగా పని చేస్తున్న ఎస్ శ్యామ్ సుందర్‌కు లీగల్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పోస్టింగ్ ఇచ్చారు. వెయిటింగ్‌లో ఉన్న ఉదయ భాస్కర బిల్లాను సిఐడి ఎస్పీగా నియమించారు.

12/19/2017 - 01:05

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 18: గుజరాత్ ఎన్నికలలో బీజేపీ గెలుపొంది అధికారం చేపట్టినప్పటికీ నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని ఏపీసీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

12/19/2017 - 01:04

విజయవాడ, డిసెంబర్ 18: గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం ముదావహమని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీని విజయపథంలో నిలిపిన ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు ఆయన అభినందనలు తెలిపారు.

12/19/2017 - 01:04

విజయవాడ, డిసెంబర్ 18: ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబుని ఆహ్వానించకపోవడం విచారకరమని విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. తెలుగు జాతిని ఆంధ్ర, తెలంగాణగా కేసీఆర్ విడదీసేశారని, సభలో ఎన్టీఆర్‌ను విస్మరించడం తెలుగుజాతిని అవమానించడమేనన్నారు.

12/19/2017 - 01:03

విజయవాడ, డిసెంబర్ 18: రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులు సోమవారం నుండి నిరవధిక సమ్మె సైరన్ మోగించారు. మొత్తం 110కి గాను 98 మున్సిపాలిటీల్లో తొలిరోజు సమ్మె జయప్రదంగా జరిగింది. తొలుత అన్ని సంఘాలు కల్సి సమ్మె తలపెట్టినప్పటికీ సోమవారం సీఐటీయు, ఐఎఫ్‌టీయుసీ, గుంటూరు కార్పొరేషన్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మిక సంఘం, గుంటూరు నగర మున్సిపల్ కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె చేశారు.

Pages