S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/20/2017 - 02:13

తిరుపతి, డిసెంబర్ 19: పక్షుల కిలకిల రావాలంటే జనం అనందపడతారు. జనాన్ని భయపెట్టే విధంగా కొన్ని వింత పక్షులు చేస్తున్న వికృత, వింత శబ్దాలతో నిద్రలేని రాత్రులు గడిపుతున్నారు తిరుపతిలోని కెసిఆర్ అపార్టుమెంట్ వాసులు. ఇదేమిటనుకుంటున్నారా! తిరుపతి బాలాజీ కాలనీలోని కెసిఆర్ అపార్ట్‌మెంట్ వాసులు గత 10 రోజులుగా పడుతున్న కర్ణ శోష ఇది. ఐదంస్థుల కెసిఆర్ అపార్ట్‌మెంట్‌లో సుమారు 40 ఇళ్లున్నాయి.

12/20/2017 - 02:12

హైదరాబాద్, డిసెంబర్ 19: ఏపి కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలను పక్కనపెట్టి గుంటూరునగర పాలక సంస్థ పరిధిలో పశువుల వధ శాలను అక్రమంగా కార్పోరేషన్ నిర్వహించడం, ఈ విషయాన్ని దాచిపెట్టడంపై హైకోర్టు గుంటూరు మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. జంతు పరిరక్షణకు చెందిన సంస్థ దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది.

12/20/2017 - 00:41

విజయవాడ, డిసెంబర్ 19: రాష్ట్ర కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్ సహా సభ్యులను మంగళవారం ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. వివిధ వర్గాల ప్రతినిధులను సభ్యులుగా నియమించింది. ఈ కౌన్సిల్‌కు చైర్మన్‌గా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి వ్యవహరిస్తారు.

12/20/2017 - 00:40

విజయవాడ, డిసెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ (బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్)కు నిధుల కొరత లేదని ఆ సంస్థ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య చెప్పారు. సచివాలయం పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు.

12/20/2017 - 00:40

విజయవాడ, డిసెంబర్ 19: సుబాబుల్, యూకలిప్టస్ గిట్టుబాటు ధరలపై చర్చించడానికి మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం వెలగపూడి సచివాలయంలోని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ కార్యాలయంలో సమావేశమైంది. మంత్రులు శిద్దా రాఘవరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డిలతో కూడిన మంత్రివర్గం సమావేశమై గిట్టుబాటు ధరపై చర్చించారు.

12/20/2017 - 00:40

విజయవాడ, డిసెంబర్ 19: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హజ్ యాత్రికులు 2019 నుంచి నేరుగా విజయవాడ నుంచే హజ్‌యాత్రకు వెళ్లే అవకాశం లభించనుంది.

12/20/2017 - 00:39

విజయవాడ, డిసెంబర్ 19: జాతీయ విద్యుత్ సంరక్షణ వారోత్సవాలు-2017 ముగింపు వేడుకలను డిసెంబర్ 20వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ సంరక్షణ సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వారోత్సవాల ముగింపు సందర్భంగా కార్యశాల నిర్వహిస్తామన్నారు.

12/20/2017 - 00:39

విజయవాడ, డిసెంబర్ 19: చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకల కొనుగోళ్లపై విమర్శలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బుధవారం నుంచి కానుకల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. మార్కెట్ ధరల కన్నా ఎక్కువ ధరకు కొని సరఫరా చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని 1.42 కోట్ల తెల్ల రేషన్ కార్డులున్న వారికి క్రిస్మస్, సంక్రాంతి కానులను అందచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

12/20/2017 - 00:38

విజయవాడ, డిసెంబర్ 19: వివిధ పద్దుల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు చేరుతుండటం, అలాగే రాష్ట్రంలో వివిధ శాఖల నుంచి జమ పడుతున్న మొండి బకాయిలు వంటి కారణాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్తంత మెరుగుపడుతోంది. తాత్కాలిక ఆర్థిక సంక్షోభం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం గత నవంబర్ 16వ తేదీ నుంచి జీతాలు, పెన్షన్‌లు మినహా అన్ని రకాల బిల్లుల చెల్లింపులను నిలిపివేసింది.

12/20/2017 - 00:37

విజయవాడ, డిసెంబర్ 19: అగ్రిగోల్డ్ సంస్థ మోసాలకు నష్టపోయి ఆత్మహత్యలు, అసహజ మరణాలకు బలైన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు విడుదల చేసిన జీవో నెంబరు 80ను సవరించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు.

Pages