S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/19/2017 - 01:03

విజయవాడ, డిసెంబర్ 18: గ్రామ పంచాయతీ కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మె తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. సమస్యలపై పంచాయితీ రాజ్ కమిషనర్ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో జరిగిన చర్చలు కొంత మేరకు ఫలించటంతో సమ్మె వాయిదా పడింది.

12/19/2017 - 01:02

విజయవాడ, డిసెంబర్ 18: రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.ఎ.శోభను పురపాలక శాఖ సేవల నుంచి ఉపసంహరించి, ఆయుష్ విభాగం కమిషనర్‌గా నియమించారు. కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ కమిషనర్ సుజాతా శర్మను కళాశాల విద్య స్పెషల్ కమిషనర్‌గా నియమించారు.

12/19/2017 - 01:01

విజయవాడ, డిసెంబర్ 18: రబీ సీజన్ పంట రుణాలు వెంటనే పంపిణీ చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్‌కుమార్ ఆదేశించారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై ఆయన వెలగపూడి సచివాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు, విజయనగరం, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో పంట రుణాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు.

12/19/2017 - 01:01

విజయవాడ (క్రైం), డిసెంబర్ 18: రాష్ట్ర పోలీసుల ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘పోలీసు భద్రత’ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని డీజీపీ నండూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనే సందేశానిచ్చారు. మరోవైపు పోలీసు సంక్షేమానికి సంబంధించి బ్యాంకులు మరో అడుగు ముందుకేశాయి. పోలీసులు తీసుకునే రుణాలకు వడ్డీ రేట్లు తగ్గించాయి.

12/19/2017 - 01:00

విజయవాడ, డిసెంబర్ 18: రాష్ట్రంలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య కాస్తంత తగ్గుముఖం పడుతున్నట్లు కన్పిస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యంతో ఓవర్‌లోడ్‌తో నడిచే ఆటోలు రానురాను మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి.

12/18/2017 - 04:50

తిరుపతి, డిసెంబర్ 17: సర్వదర్శనం భక్తులకు నిర్దేశిత సమయంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు తిరుమలలో అమలుచేయనున్న ప్రయోగాత్మక సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానానికి ఏర్పాట్లు పూర్తయినట్లు టీటీడీ ఈ ఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం కౌంటర్లలోని టోకెన్లు జారీ చేస్తామని, భక్తులు ఆధార్ కార్డు చూపి టోకెన్లు పొందాలని కోరారు.

12/18/2017 - 04:49

విజయవాడ, డిసెంబర్ 17: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు టీఆర్‌ఎస్ రాజకీయ సభల్లా గోచరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి, మాజీ శాసనసభ్యుడు కె రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. అసలివి ప్రపంచ తెలుగు మహాసభలా, లేక రాజకీయ సభలా అర్థం కాని స్థితి నెలకొందన్నారు.

12/18/2017 - 04:49

విజయవాడ, డిసెంబర్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాల్దీవుల పర్యటనకు ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఈ నెల 22 వరకూ ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఇది ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటన అని అధికార వర్గాలు తెలిపాయి.

12/18/2017 - 04:49

ఖాజీపేట, డిసెంబర్ 17: కడప జిల్లాలో ఆదివారం అటవీ సిబ్బంది రూ. కోటి విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు స్క్వాడ్ డీఎఫ్‌ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. వివరాలు.. అందిన సమాచారం మేరకు అటవీ సిబ్బంది దాడులు చేసి సిద్దవటం మండల పరిధిలోని కనుమలోవలపల్లె వద్ద ఆయిల్ ట్యాంకర్‌లో అక్రమంగా తరలిస్తున్న 86 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

12/18/2017 - 04:48

ముదినేపల్లి, డిసెంబర్ 17: రాష్ట్ర ప్రభుత్వ కోటా కింద 3వేల ఎంబీబీఎస్ సీట్లు ఉండగా అందులో నుండి 100 సీట్లను ఫాతిమా కళాశాల విద్యార్థులకు కేటాయించేందుకు యత్నించామని, నిబంధనలు అడ్డురావడంతో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి సుప్రీం కోర్టులో స్పెషల్ లివ్ పిటిషన్ వేసేందుకు ఈ నెల 20, 21 తేదీల్లో ఢిల్లీ వెళ్లనున్నట్లు రాష్ట్ర వైద్యవిద్యా శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.

Pages