S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/02/2017 - 04:32

విజయవాడ, ఆగస్టు 1: తట్టు, రూబెల్లా వ్యాధుల నిర్మూలనకు చేపట్టిన ఒకే టీకా విధానం మేలైనదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసం వద్ద వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తట్టు, రూబెల్లా టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆయన మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవి అంటువ్యాధులని, ప్రాణాంతక వ్యాధులన్నారు.

08/02/2017 - 04:30

నంద్యాల, ఆగస్టు 1: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి తగ్గించే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి కెయి.కృష్ణమూర్తి స్పష్టం చేశారు. అదంతా వైకాపా తమ సొంత పత్రిక సాక్షి, ఛానల్‌లో చేసిన దుష్ప్రచారమేనన్నారు. అవాస్తవాన్ని పట్టుకుని ఉద్యోగస్తుల్లో ఆందోళన కలిగించేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

08/02/2017 - 04:29

కాకినాడ, ఆగస్టు1: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే అబద్ధాలు నమ్మవద్దు... ఆయనతో కలసి ప్రయాణం చేసి మీ పరపతిని తగ్గించుకోకండి’ అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌కు సూచించారు. ఈమేరకు పవన్‌కళ్యాణ్‌కు మంగళవారం ఒక బహిరంగ లేఖ రాశారు. లేఖ ప్రతులను ఆయన మీడియాకు విడుదల చేశారు.

08/02/2017 - 04:21

అమరావతి, ఆగస్టు 1: తెలుగుదేశం-జనసేన బంధం బలపడుతోందా.. రాష్ట్ర, కేంద్ర స్థాయిలో సమస్యల సుడిగుండంలో ఉన్న అధికారపార్టీకి జనసేన మరోసారి దన్నుగా నిలబడనుందా.. టిడిపిపై జనసేనాధిపతి పవన్ కల్యాణ్ సానుకూల వైఖరి కాపుల ఓట్లపై గంపెడాశలు పెట్టుకున్న వైసీపీని నిరాశకు గురిచేస్తోందా.. తాజాగా జరిగిన పరిణామాలు పరిశీలిస్తే ఇది నిజమనిపిస్తోంది.

08/02/2017 - 04:18

విజయవాడ, ఆగస్టు 1: కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు.

08/02/2017 - 04:18

విజయవాడ, ఆగస్టు 1: రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని, వాటికి పూర్తిస్థాయిలో ఏ కొరత లేకుండా నీటి సౌకర్యాన్ని కల్పించాలని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో వౌలిక వసతులపై మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.

08/02/2017 - 04:17

అమరావతి, ఆగస్టు 1: మూడేళ్ల నుంచి ఉద్యోగులతో సఖ్యతగా మెలిగి, వారికి కోరినన్ని వరాలిచ్చి మెప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కష్టం కేవలం మూడు రోజుల నుంచి జరుగుతున్న దుష్ప్రచారం వల్ల నష్టపోయే పరిస్థితి వచ్చిందన్న ఆవేదన టిడిపి వర్గాల్లో వ్యక్తమవుతోంది.

08/02/2017 - 04:17

విజయవాడ, ఆగస్టు 1: చిత్తూరు జిల్లా రేణిగుంటలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్-2కు నెల రోజుల్లో భూమి కేటాయిస్తామని రాష్ట్ర ఐటిశాఖ మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి లోకేష్‌ను రేణిగుంట ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్-2 ప్రతినిధులు మంగళవారం కలిశారు. క్లస్టర్-2లో వౌలిక సదుపాయాలు, భూమి కేటాయింపులు త్వరగా చేపట్టాలని కోరారు.

08/02/2017 - 04:16

విజయవాడ, ఆగస్టు 1: సగర్వంగా రెపరెపలాడే మన జాతీయ జెండాను చూసినంతనే త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య స్ఫురణకు వస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. దేశభక్తుడు అనే మాటలకు పింగళి నిజమైన నిర్వచనమని కొనియాడారు. బుధవారం పింగళి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు నివాళి అర్పించారు. పింగళి 1876 ఆగస్టు 2న కృష్ణాజిల్లా భట్లపెనుమర్రులో జన్మించారన్నారు.

08/02/2017 - 04:16

విజయవాడ, ఆగస్టు 1: రాష్ట్రంలో 24 వేల పైచిలుకు ఆవాసాల్లో మంచినీటిని సరఫరా చేసేందుకు వీలుగా ఎపి తాగునీటి సరఫరా కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ 23,480 ఆవాస ప్రాంతాల్లో రోజుకు తలసరి 55 లీటర్లను సరఫరా చేస్తున్నారు. ఇంకా 24,405 ప్రాంతాల్లో అరకొరగా మంచినీరు సరఫరా చేస్తున్నారు.

Pages