S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/15/2017 - 02:36

విశాఖపట్నం, జూలై 14: విశాఖ భూ కుంభకోణంపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్న పాత్రుడు శుక్రవారం హాజరయ్యారు.

07/15/2017 - 02:34

కర్నూలు, జూలై 14: రాష్ట్రంలో స్వచ్చ పంచాయితీ కార్యక్రమం కింద పారిశుద్ధ్య కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసే గ్రామాలకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు పంచాయితీరాజ్, ఐటిశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పంచాయితీరాజ్‌శాఖ అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు.

07/15/2017 - 02:33

పాడేరు, జూలై 14: విశాఖ మన్యంలో నిక్షిప్తమైన విలువైన బాక్సైట్ ఖనిజ సంపదను దోచుకునేందుకు ముఖ్యమంత్రి దత్తత నాటకం ఆడుతున్నారని ఎపిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆరోపించారు.

07/15/2017 - 02:31

కాకినాడ, జూలై 14: రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లన్నీ పార్టీ మార్పిడి కేంద్రాలుగా మారాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు విమర్శించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి, రౌడీషీట్లు తెరిచి, భయంతో వారిని అధికార పార్టీ సభ్యులుగా మార్చే కేంద్రాలుగా రాష్ట్రంలో పోలీసు స్టేషన్లు పనిచేస్తున్నాయన్నారు.

07/15/2017 - 01:36

విజయవాడ, జూలై 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా చేపట్టిన ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం అమలు నత్తనడకన సాగుతోంది. ఈ పథకానికి సంబంధించి ఉపాధి నిధుల విడుదలలో జాప్యం కారణంగా గృహ నిర్మాణంలో ఆశించిన వేగం నమోదు కావడం లేదు. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణం కింద రెండు లక్షల గృహాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2,492 కోట్ల రూపాయలతో అం చనాలు తయారు చేశారు.

07/15/2017 - 01:36

విజయవాడ, జూలై 14: లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఈ మూడేళ్లలో 90 శాతానికి పైగా నెరవేర్చిందని రాష్ట్ర మంత్రి నక్కా ఆనంద్‌బాబు తెలిపారు. వైఎస్ హయాంలో మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ హామీల అమలులో ఘోరంగా విఫలమయ్యారని, 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతులకు రూ.24,500 కోట్ల రుణమాఫీ చేశామన్నారు.

07/15/2017 - 01:35

విజయవాడ (క్రైం), జూలై 14: బిజెపి, తెలుగుదేశం పార్టీలను విడదీయలేరని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టిడిపి ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు.

07/15/2017 - 01:34

విజయవాడ, జూలై 14: గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల్లో రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపరచటానికి ప్రతిపాదించిన ‘ఆదివాసి ఆరోగ్యం’ కార్యక్రమం అమలు చేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.పి.సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రక్తహీనత ఉన్నట్లు గుర్తించిన విద్యార్థులకు ప్రత్యేక ఆహారం, అవసరమైన మందులు ఏర్పాటు చేస్తారు.

07/15/2017 - 01:34

గుంతకల్లు, జూలై 14 : పాఠశాల గేటు దిమ్మె మీదపడి నర్సరీ విద్యార్థి మృతి చెంది న సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో శుక్రవారం జరిగింది. కర్నూ లు జిల్లా చిప్పగిరికి చెందిన తిమ్మయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు రవి(4) గుంతకల్లులోని రవీంద్ర ఇంగ్లీషు మీడియం స్కూలులో నర్సరీ చదువుతున్నాడు. శుక్రవారం బడికి వెళ్లిన రవి విరామం సమయంలో గేటును పట్టుకుని ఊగుతుండగా అకస్మాత్తుగా దిమ్మె విరిగి మీద పడింది.

07/15/2017 - 01:33

విజయవాడ, జూలై 14: నిర్దేశించిన గడువులోగా జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ స్పష్టం చేశారు. నిధుల కొరత లేదని, పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం చోటుచేసుకోకూడదని సూచించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం ఆయన వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Pages