S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/17/2017 - 01:50

విజయవాడ, జూలై 16: ఇటీవల కురుస్తున్న వర్షాలు, కృష్ణాడెల్టాకు ముందుగానే నీటి విడుదల రాష్ట్ర రైతుల్లో ఆశలు నింపుతున్నాయి. ఖరీప్ ఈసారైనా ఆశాజనకంగా ఉంటుందని రైతన్నలు ఆశిస్తున్నారు. ఖరీఫ్‌లో ఆశించిన మేర దిగుబడులు ఉంటే తెలంగాణ రాష్ట్రం నుంచి బియ్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండదని వ్యాపారులు భావిస్తున్నారు. గత రెండేళ్లుగా ఖరీఫ్‌లో ఆశించిన మేర వరి సాగు చేయలేని పరిస్థితి నెలకొంది.

07/17/2017 - 01:49

భీమవరం, జూలై 16: అఖండ గోదావరి నదీ ప్రవాహంలో అనూహ్య రీతిలో హెచ్చు తగ్గులు కన్పిస్తోంది.. అప్పటికపుడే పెరుగుతోంది.. అప్పటికపుడే తగ్గుముఖం పడుతోంది. స్థానికంగా వర్షాలు లేకపోయినా పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల భారీగా గోదావరి ప్రవాహం పెరుగుతుంటుంది. అఖండ గోదావరి నది ఎగువ ప్రాంతంలోని కొండ కోనల్లో కురిసిన భారీ వర్షాలు, ఉప నదుల నుండి వచ్చిచేరే నీటితో గోదావరి నదిలో వరద ఉద్ధృతి పెరుగుతుంటుంది.

07/17/2017 - 00:43

అమరావతి, జూలై 16: ‘సరిగ్గా పదిహేనురోజుల్లో నేను ఒక కుంభకోణం బయటపెట్టబోతున్నా. మీ విజయవాడలో జరిగిన అతిపెద్ద భూకుంభకోణం కూడా బయటపెడతా!’- ఇది భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్‌రాజు గత జూన్ 20న విజయవాడలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చేసిన భీషణ ప్రకటన.

07/17/2017 - 00:42

విశాఖపట్నం, జూలై 16: విశాఖలో గ్రూప్-2 మెయిన్స్ తొలిరోజు పరీక్ష సందర్భంగా ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల పరీక్ష రాయలేకపోయిన వారి విషయమై ఎపిపిఎస్సీ కమిటీ విచారించి, తుది నిర్ణయం తీసుకుంటుందని చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. విశాఖలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. విశాఖ, చిలకలూరిపేట ప్రాంతాల్లో మెయిన్స్ పేపర్ 1 పరీక్ష సందర్భంగా కంప్యూటర్లలో సాఫ్ట్‌వేర్ ఇబ్బందుల వల్ల పరీక్షకు అంతరాయం ఏర్పడిందన్నారు.

07/17/2017 - 00:41

అమరావతి, జూలై 16: రాష్ట్రంలోని గ్రామాలకూ కొత్త కాంతులు రానున్నాయి. ఇప్పటిదాకా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకే పరిమితమైన ఎల్‌ఇడి వీధిదీపాల ధవళ కాంతులు ఇప్పుడు గ్రామాలకూ విస్తరిస్తున్నాయి. విశాఖ హుదూద్ తుఫాన్ ప్రభావంతో అతలాకుతలమైన విద్యుత్ వ్యవస్థను వారం రోజుల్లోనే గాడిలో పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీధిదీపాల అమరిక విషయంలో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు.

07/17/2017 - 00:39

విజయవాడ (కార్పొరేషన్), జూలై 16: ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, వైసిపి అధినేత, విపక్ష నేత జగన్ కలిసి రాష్టప్రతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌ను బలపర్చడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం జరుగుతుందని ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.

07/17/2017 - 00:39

మచిలీపట్నం, జూలై 16: కృష్ణా జిల్లా పెడన శివారు కొంకేపూడి వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి మార్నింగ్ వాకర్స్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పెడనకు చెందిన పండ్ల వ్యాపారి వడ్డి రామకృష్ణ(59) అక్కడిక్కడే మృతి చెందాడు. 3వ వార్డు కౌన్సిలర్ బూసం ఆనందరావు, సిటీకేబుల్ నిర్వాహకుడు మలిరెడ్డి రామకృష్ణారెడ్డి, బొడ్డు ఆనందరావు అనే ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

07/17/2017 - 00:38

తిరుపతి/ విజయవాడ, జూలై 16: ఎపిపిఎస్‌సి ఆధ్వర్యంలో తిరుపతిలో ఆదివారం జరిగిన గ్రూప్-2 పరీక్షల్లో 7వ నెంబర్ సెంటర్‌లో అరగంట పాటు కంప్యూటర్లు పనిచేయలేదు. దీంతో అరగంట పరీక్ష సమయం పెంచారు. తిరుపతి, రేణిగుంటలో రెండోరోజు గ్రూప్-2 పరీక్షలు ఏడు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. తిరుపతిలోని జూపార్క్ సమీపంలో వున్న ఐయాన్ డిజిటల్ జోన్ ఎడ్జ్ సెంటర్‌లో ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరిగాయి.

07/16/2017 - 04:12

విశాఖపట్నం, జూలై 15: విశాఖ భూ కుంభకోణంపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ పరిధిని పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జిఓలో కేవలం మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల రికార్డుల ట్యాంపరింగ్ అంశాలపై మాత్రమే విచారణ చేస్తుందని పేర్కొన్నారు.

07/16/2017 - 04:10

అమరావతి, జూలై 15: ఇ-గేమింగ్ విధానాల ద్వారా చిన్నారులకు సులభంగా విద్యను బోధించేలా వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. దీనిపై యునెస్కో, తదితర సంస్థల సహకారం తీసుకోవాలని విద్యాశాఖను ఆదేశించారు. రాష్ట్రాన్ని ఇ-లెర్నింగ్ గేమింగ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని, యునెస్కో సహకారం అందించడానికి ముందుకు రావడం శుభసూచకమని అన్నారు.

Pages