S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/16/2017 - 00:43

విజయవాడ (క్రైం), జూలై 15: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుని కేసులో దర్యాప్తు పురోగతిని అధికారులు ఆయనకు వివరించారు. వచ్చే వారం చార్జిషీట్ దాఖలు చేస్తామని వారు సిఎంకు తెలిపారు. ఈ నెల 26న ముద్రగడ పాదయాత్ర సందర్భంగా నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

07/16/2017 - 00:42

గుంటూరు, జూలై 15: ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవ సభకు హాజరైన మంత్రి అయ్యన్నపాత్రుడికి చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆయన అలక వహించారు. రాజధాని అమరావతి సమీపంలో నీరుకొండ గ్రామం వద్ద శనివారం వర్శిటీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు వేదికపై ఆశీనులయ్యారు.

07/16/2017 - 00:42

విజయవాడ (కార్పొరేషన్), జూలై 15: ప్రజా రాజధాని అమరావతిలో ప్రతి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని రాష్ట్ర పులపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. రాజధానిలో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై శనివారం మంత్రి కేదారేశ్వరపేటలోని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడిసి) ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

07/16/2017 - 00:41

హైదరాబాద్, జూలై 15: ప్రస్తుతం టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంపై దర్శకుడు పూరి జగన్నాథ్ నోరు విప్పారు. ఈ వ్యవహారంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఆయనదే కావడం విశేషం. తన ట్విట్టర్ ఖాతా ద్వారా శనివారం ఆయన తన స్పందన తెలియజేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై తాను ఇంతవరకూ ఎవరికీ ఎలాంటి వివరణ ఇవ్వలేదని, ఎటువంటి వ్యాఖ్యలు, ప్రకటనలు చేయలేదని పేర్కొన్నారు.

07/16/2017 - 00:41

అమరావతి, జూలై 15: వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకుంటామని జగన్, ఆయన పార్టీ నేతలు కలలు కంటున్నారని, అవి చివరికి పగటి కలలుగా మిగిలిపోతాయని రాష్ట్ర పర్యావరణ, అడవులు, శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు.

07/16/2017 - 00:40

విజయవాడ, జూలై 15: రెండు రోజుల పాటు జరిగే ఎపిపిఎస్సీ గ్రూప్-2 మెయిన్ పరీక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని 171 కేంద్రాల్లో ఎంతో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు పరీక్ష ప్రారంభించగా మొత్తం 49,106 మంది అభ్యర్థులకు గాను 45,287 మంది (92.22 శాతం) హాజరయ్యారు. మొత్తం 982 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు జరుగుతున్నాయి.

07/16/2017 - 00:39

విజయవాడ, జూలై 15: క్షేత్రస్థాయిలో కనీసం ఒక్కరోజైనా సందర్శనలు జరపకుండా నాలుగు గోడల మధ్యనే చదువులకు పరిమితమైతే తాము నిర్వహించబోయే కీలకమైన విధుల పట్ల కొత్త ఇంజనీర్లకు ఎలాంటి అవగాహన ఉంటుందో సుప్రసిద్ధ ఇంజనీర్, దివంగత మాజీ కేంద్ర మంత్రి పద్మభూషణ్ డాక్టర్ కెఎల్ రావు 115వ జయంతి వేదికగా తేటతెల్లమైంది. ఎపిపిఎస్‌సి ద్వారా జలవనరుల శాఖలో 518 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టులు ఇటీవలే భర్తీ అయ్యాయి.

07/16/2017 - 00:39

అమరావతి, జూలై 15: తెలుగుదేశం పార్టీ బిజెపిని విడిచిపెడితే తాము బిజెపితో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. గుంటూరు ప్లీనరీ విజయవంతంతో ఉత్సాహంగా ఉన్న శ్రేణులు, నేతలను బొత్స వ్యాఖ్యలు నిరాశపరిచినట్లు పార్టీ నాయకుల అంతర్గత చర్చలు తెలియజెపుతున్నాయి. ‘టిడిపి-బిజెపి భార్యాభర్తల్లా కలిసి ఉన్నాయి.

07/15/2017 - 02:57

విజయవాడ, జూలై 14: ‘గత ఏడాదితో పోలిస్తే, ఈ సంవత్సరం ఆరోగ్య సూచికలో స్వల్ప స్థాయిలో వెనక్కు వెళ్లడానికి గల కారణాలు అనే్వషించాలి. వెంటనే తగిన చర్యలు తీసుకుని మళ్లీ పూర్వస్థితికంటే మెరుగ్గా ఆరోగ్య సూచికలో వృద్ధి సాధించాలి’ అని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అనేక రకాల కారణాలతో అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయని, కారణం ఏదైనా, ఎంత వేగంగా స్పందించామనేది ముఖ్యమన్నారు.

07/15/2017 - 02:55

అమరావతి, జూలై 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకపరంగా అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ వెల్లడించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో టూరిజం-కల్చర్, హెరిటేజ్ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.

Pages