S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/04/2016 - 07:15

విజయవాడ, జూలై 3: ప్రతి నెలా మొదటి ఆదివారం హ్యాపీ సండే పేరుతో నగరంలో నిర్వహిస్తున్న హ్యాపీ సండే కార్యక్రమాలకు మంచి స్పందన రావడంతోపాటు నగర ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని ఆనందంగా గడుపుతున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ, పోలీస్ శాఖ, శాప్‌తో పాటు డీప్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హ్యపీ సండే కార్యక్రమం పెద్దసంఖ్యలో ఆదరణ లభించడంతో పాటు నగర ప్రజలు ఆదివారాన్ని ఆనందమయంగా గడుపుతున్నారు.

07/04/2016 - 07:12

మడకశిర, జూలై 3 : విదేశీయుల మాటలు విని విజయవాడలోని దేవాలయాలను కూల్చివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టడం హిందూ మతాన్ని కించపరచడమే అని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

07/04/2016 - 07:07

విజయవాడ, జూలై 3: నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి తానెంతో సుదీర్ఘంగా ఆలోచించి అందరి మనోభావాలు గుర్తెరిగి ప్రపంచంలోనే త్వరితగతిన గుర్తింపు లభించేలా అమరావతి పేరును నామకరణం చేసానంటూ తెల్లవారుఝామున నిద్దుర లేచినప్పటి నుంచి అర్ధరాత్రి నిద్దురపోయేవరకు.. ప్రధానంగా కేవలం పెట్టుబడుల కోసం దేశ విదేశాల్లో నిరంతరం పర్యటించే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో గొప్పగా గర్వంగా ప్రచారం చేసుకుంటున్నారు.

07/04/2016 - 07:04

గోరంట్ల, జూలై 3: గుర్తుతెలియని వ్యక్తులు జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి గోనెసంచెతో ముసుగు వేసి అవమానపరచిన సంఘటన శనివారం రాత్రి అనంతపురం జిల్లా గోరంట్లలో చోటుచేసుకుంది. దీంతో మండల కేంద్రమైన గోరంట్లలో ఉద్రిక్తత నెలకొంది. ఓ వర్గానికి చెందిన ఆకతాయిలు ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు తెలిపిన వివరాలు..

07/04/2016 - 06:59

శ్రీకాకుళం, జూలై 3: తమ వద్ద ఉన్న నాణేనికి మహిమలున్నాయని ప్రజలను మోసం చేస్తున్న ఓ దొంగల ముఠా పోలీసులకు దొరికిపోయింది. ఆదివారం ఇక్కడి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి వివరాలు తెలిపారు.

07/04/2016 - 06:58

విశాఖపట్నం, జూలై 3: ఉత్తర ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం తెలిపారు. పశ్చిమ దిశగా గాలులు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.

07/04/2016 - 06:58

విశాఖపట్నం, జూలై 3: హైకోర్టు విభజన అంశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చోటుచేసుకుంటున్న వివాదాలను పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు జోక్యం అవసరమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అభిప్రాయపడ్డారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

07/04/2016 - 06:56

నగరి, జూలై 3: చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ చైర్మన్ శాంతాకుమారిని రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించకుండా నిర్వహించడంపై వైకాపా, టిడిపి నేతల మధ్య ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో టిడిపి నాయకులు ఏకంగా చైర్మన్ శాంతాకుమారి, కౌన్సిలర్లపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. దీంతో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకెళితే..

07/04/2016 - 06:56

తిరుపతి, జూలై 3: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈనెలలో రాష్టవ్య్రాప్తంగా ఏడు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నారు.

07/04/2016 - 06:55

విశాఖపట్నం, జూలై 3: పట్టణీకరణ, ఎదుర్కొంటున్న సవాళ్లపై బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) సదస్సును విశాఖలో నిర్వహించనున్నారు. వచ్చే సెప్టెంబర్‌లో ఈ సదస్సు జరిగే అవకాశం ఉంది. ఐదు బ్రిక్స్ దేశాల్లో జరుగుతున్న పట్టణీకరణపై సెప్టెంబర్ 14 నుంచి 16 వరకూ మూడు రోజుల పాటు కీలక చర్చ జరపనున్నారు. ప్రపంచ జనాభాలో 40 శాతం ప్రజానీకం బ్రిక్స్ దేశాల్లోనే ఉన్నారు.

Pages