S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/17/2016 - 16:58

న్యూదిల్లి:ఒబిసి రిజర్వేషన్ల జాబితాలో తమకూ అవకాశం కల్పించాలన్న డిమాండ్‌తో గత నెలలో తీవ్రస్థాయిలో అందోళనకు దిగిన జాట్లు మరోసారి ఆందోళనబాట పట్టనున్నారు. ప్రభుత్వ హామీతో అప్పుడు వెనక్కుతగ్గిన వారు ఇవాళ రాత్రి సమావేశమై భవిష్యత్ కార్యక్రమాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

03/17/2016 - 16:57

విజయవాడ:ఏపీలో ఈనెల 21నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి తెలిపారు. 6.5 లక్షలమంది విద్యార్థుల ఈ పరీక్షలకు హాజరుకానుండగా వారికోసం రాష్టవ్య్రాప్తంగా 3028 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

03/17/2016 - 16:56

హైదరాబాద్:ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసిన తీర్పునకు సంబంధించిన ప్రతిని అసెంబ్లీ కార్యదర్శికి వైకాపా శాసనసభ్యురాలు రోజా అందచేశారు. కోర్టు తీర్పు అనంతరం ఆమె శాసనసభకు వచ్చి కార్యదర్శిని కలిసి కోర్టు తీర్పు ప్రతులు అందజేశారు. కాగా రోజాకు శాసనసభలో వైకాపా శాసనసభ్యులు స్వాగతం పలికి అభినందనలు చెప్పారు.

03/17/2016 - 16:55

హైదరాబాద్:వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌జడ్జి ఇచ్చిన మధ్యంతర తీర్పుపై హైకోర్టు ధర్మాసనానికి అప్పీలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభ నిర్ణయంపై విచారణ జరిపే హక్కు హైకోర్టుకు లేదని, 212 నిబంధనను ఉటంకిస్తూ శాసనసభ కార్యదర్శితో అప్పీలు చేయించాలని నిర్ణయించింది.

03/17/2016 - 16:55

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలలో పాల్గొనకుండా వైకాపా శాసనసభ్యురాలు రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉమ్మడి హైకోర్టు సింగిల్‌జడ్జి కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఏపీ శాసనసభ తనను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వైకాపా ఎమ్మెల్యే రోజా మొదట హైకోర్టులోనూ ఆ తరువాత సుప్రీంకోర్టులోనూ సవాల్ చేసిన విషయం తెలిసిందే.

03/17/2016 - 08:12

రాజమహేంద్రవరం: ఆర్థికంగా వెనుకబడిన కాపు విద్యార్థులకు కూడా వచ్చే విద్యాసంవత్సరం నుండి ఉపకారవేతనాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ చెప్పారు. బుధవారం రాజమహేంద్రవరంలో విలేఖర్లతో మాట్లాడుతూ కాపు విద్యార్ధులను బిసి హాస్టళ్లలో చేర్చుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు.

03/17/2016 - 04:40

హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. శాసనసభలో బుధవారం రూల్ 77 కింద 17 అంశాలతో కూడిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది.

03/16/2016 - 21:54

నాయుడుపేట: అప్పుల బాధ తాళలేక చిన్నంబేటి మల్లికార్జున్(56) అనే రైతు తన సొంత పొలంలోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని అన్నమేడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకొంది. పోలీసుల కథనం మేరకు అన్నమేడు గ్రామంలో మల్లికార్జున్ అనేరైతుకు ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.

03/16/2016 - 21:53

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోపభూయిష్టంగా ఉందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై శానసమండలిలో మంగళవారం చర్చ ప్రారంభమైంది. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బడ్జెట్‌లో 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్ లెక్కలు ఇవ్వలేదని అన్నారు.

03/16/2016 - 21:52

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ప్రధాన ప్రతిపక్షం ఇచ్చిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా మంగళవారం శాసనసభా వ్యవహారాల మంత్రి రామకృష్ణుడు, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మధ్య గంభీరమైన చర్చ జరిగింది. మంగళవారం మధ్యాహ్నం శాసనసభ సమావేశం కాగానే స్పీకర్ కోడెల మాట్లాడుతూ, స్పీకర్‌ను తొలగించాలంటూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన వైకాపా ఎమ్మెల్యేలు కె.

Pages