S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/19/2016 - 17:10

హైదరాబాద్: చట్టసభలో స్పీకర్ తీసుకునే నిర్ణయాలను న్యాయస్థానాలే కాదు, ఎవరూ ప్రశ్నించలేమని టిడిపి ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు శనివారం విలేఖరులతో అన్నారు. స్పీకర్‌కు చట్టపరంగా విశేష అధికారాలున్నాయన్నారు. దళిత ఎమ్మెల్యే అనితపై రోజా దుర్భాషలాడినపుడు వైకాపా సభ్యులు ఎందుకు నిరసన తెలియజేయ లేదని ఆయన ప్రశ్నించారు.

03/19/2016 - 17:10

హైదరాబాద్: ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి హాజరుకావాలంటూ ఒకరోజు ముందు లేఖ ఇస్తే తాను ఎలా హాజరుకావాలని వైకాపా ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. శనివారం తాను అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరడం వల్ల ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి హాజరుకాలేక పోయానని ఆమె చెప్పారు. కోర్టు ఆదేశాలున్నప్పటికీ తనను రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలకు రానీయకుండా అడ్డుకున్నారని ఆమె తెలిపారు.

03/19/2016 - 17:09

హైదరాబాద్: అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై విచారించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రివిలేజ్ కమిటీ శనివారం మధ్యాహ్నం సమావేశమైంది. ఈ రోజు విచారణకు హాజరుకావాల్సిందిగా అయిదుగురు వైకాపా ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వగా రోజా, జ్యోతుల నెహ్రూ హాజరుకాలేదు. అస్వస్థతకు లోనై నిమ్స్‌లో చేరడంతో రోజా ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి హాజరుకాలేదు.

03/19/2016 - 17:08

హైదరాబాద్: అస్వస్థతకు గురైన వైకాపా ఎమ్మెల్యే, సినీనటి రోజాకు శనివారం నిమ్స్‌లో వైద్యులు ఆరోగ్యపరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, సుగర్, బీపీ స్థాయి సాధారణంగానే ఉందని డాక్టర్లు తెలిపారు. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్చి చేస్తామని వైద్యులు చెప్పారు.

03/19/2016 - 17:08

గుంటూరు: నగరంలోని ఏటీ అగ్రహారంలో రామకృష్ణ అనే డిగ్రీ విద్యార్థి శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతుడు మాచర్లకు చెందిన వాడని, ఏటీ అగ్రహారంలో అద్దెకు ఉంటున్నట్లు తెలిసింది.

03/19/2016 - 15:03

నెల్లూరు: తమ కుమార్తె వౌనిక మృతికి భర్త, అత్త కారకులని ఆరోపిస్తూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు అత్తింటివారిపై దాడికి దిగి బీభత్సం సృష్టించారు. నెల్లూరు జిల్లా టి.గూడూరు మండలం పాపిరెడ్డిపాలెంలో వౌనిక అనే వివాహిత ఈ నెల 15న అత్తవారింట్లో మరణించింది. భర్త అశోక్, అత్త సుబ్బమ్మ దారుణంగా కొట్టడం వల్లే వౌనిక మరణించిందని మృతురాలి బంధువులు శనివారం ఉదయం దాడికి దిగారు.

03/19/2016 - 13:56

నెల్లూరు: రెండు వైన్‌షాప్ యాజమాన్యాల ఘర్షణ ఫలితంగా ఓ కానిస్టేబుల్ గాయపడిన సంఘటన ఆత్మకూరులో శనివారం జరిగింది. రెండు వైన్‌షాప్‌ల యజమానులు ఘర్షణ పడుతుండగా చక్కదిద్దేందుకు ఓ కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నారు. ఓ వైన్‌షాప్ యజమాని కానిస్టేబుల్‌పై దౌర్జన్యం చేయడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి చేసిన వైన్‌షాప్ యజమానిని అరెస్టు చేశారు.

03/19/2016 - 13:56

గుంటూరు: వినుకొండలో శనివారం ఉదయం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అయిదు నెలల క్రితం వివాహం చేసుకున్న ఆమె ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా సంచలనం సృష్టించింది. కాగా, అత్తింటి వేధింపుల కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

03/19/2016 - 13:55

హైదరాబాద్: స్వల్ప అస్వస్థతకు గురికావడంతో వైకాపా ఎమ్మెల్యేను 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తుండగా ఆమె ఒక్కసారి అస్వస్థతకు లోనయ్యారు. అయినప్పటికీ ఆమె ఫుట్‌పాత్‌పై పడుకుని నిరసన కొనసాగించారు. బిపి, సుగర్ స్థాయిలు తగ్గడంతో ఆమె నీరసించి పోవడంతో వెంటనే నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.

03/19/2016 - 13:55

హైదరాబాద్: ఎపి అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తర్వాత శనివారం మధ్యాహ్నం వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విపక్ష నేత వైఎస్ జగన్ నాయకత్వంలో అసెంబ్లీ నుంచి ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వరకూ పాదయాత్ర జరిపారు. తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ సమావేశాలకు అనుమతించాలని కోరుతూ వారు నినాదాలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తూ స్పీకర్ వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.

Pages