S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/06/2016 - 01:50

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష వెనుక వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి హస్తం ఉందని తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు నాయకులు మండిపడ్డారు. ముద్రగడ ఆమరణ నిరాహార దీక్షను తిప్పికొట్టేందుకు తెలుగుదేశం వ్యూహ రచన చేస్తోంది.

02/06/2016 - 01:50

గుంటూరు, ఫిబ్రవరి 5: హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థి వేముల రోహిత్‌కు బోగస్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం జారీచేసిన సంబంధిత మండల తహశీల్దార్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ జాయింట్ కలెక్టర్‌కు జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సభ్యులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.

02/06/2016 - 01:49

తిరుమల, ఫిబ్రవరి 5: ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని, ఈ క్రమంలో ఇక్కడ పాకశాస్త్ర వర్శిటీ (కల్నరి ఇనిస్టిట్యూట్)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని కేంద్ర ప్రభుత్వ పర్యాటక కార్యదర్శి వినోదాజోషి తెలిపారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

02/06/2016 - 01:49

విజయవాడ, ఫిబ్రవరి 5: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంతటి దగాకోరు, మోసకారి మరొకరు లేరంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట కమిటీ వ్యవస్థాపకులు మంద కృష్ణమాదిగ ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణపై గత ఎన్నికల్లో మరోమారు స్పష్టమైన హామీ ఇవ్వటమేగాక వర్గీకరణ చేసి చూపించి పెద్దమాదిగగా నిలుస్తానని చెప్పారు గాని కాపుల విషయంలో పెదకాపుగా నిలుస్తానని ఏనాడూ చెప్పలేదనే విషయాన్ని అమాయక కాపులు గుర్తించాలని ఆయనన్నారు.

02/06/2016 - 01:48

కుప్పం, ఫిబ్రవరి 5: బెంగళూరునుంచి కన్యాకుమారికి వెళ్లే హైల్యాండ్ ఎక్స్‌ప్రెస్ కుప్పంకు సుమారు 40కిలోమీటరు దూరంలో తమిళనాడులోని పచ్చూరు వద్ద శుక్రవారం వేకువ జామున పట్టాలు తప్పింది. ఈ సంఘటనలో సుమారు 30మందికి గాయాలైయ్యాయి. బెంగళూరుకు వస్తున్న రైలు సోమనాయకన్‌పట్టి గ్రామ సమీపంలో పట్టాలు తప్పింది. రెండు రిజర్వేషన్ బోగిలు బోల్తాపడ్డాయి.

02/06/2016 - 01:48

రైల్వేకోడూరు, ఫిబ్రవరి 5:కడప జిల్లా రైల్వేకోడూరు మండలం శేషాచలం అటవీప్రాంతంలో రూ.3 కోట్ల విలువచేసే ఎర్రచందనాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

02/06/2016 - 01:47

గుంటూరు, ఫిబ్రవరి 5: రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు రాక సమాచారాన్ని అందుకున్న వందలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదంటూ శుక్రవారం తుళ్లూరు సిఆర్‌డిఎ కార్యాలయానికి చేరుకున్నారు. పత్రాలను పరిశీలించి న్యాయం చేస్తామంటూ ఉపాధ్యక్షుడు కుటుంబరావు పేర్కొన్నారు. అయితే రుణమాఫీ ఎందుకు జరగలేదనే విషయంపై సమాచారం కావాలంటూ రైతులు ప్రశ్నించారు.

02/05/2016 - 11:58

విజయనగరం: కొత్తవలస మండలం తుమ్మికాపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం వేగంగా వస్తున్న ఆటో లారీని ఢీకొనడంతో ఓ వ్యక్తి మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

02/05/2016 - 11:57

విశాఖ: అంతర్జాతీయ నౌకా సమీక్ష సందర్భంగా విశాఖలో వివిధ దేశాల నౌకాదళ అధికారుల కోసం ఆతిథ్య కేంద్రాన్ని ఎ.పి. సి.ఎం. చంద్రబాబు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఆధునిక వసతులతో స్టార్ హోటల్ తరహాలో ఏర్పాటుచేసిన ఈ కేంద్రంలో అధునాతన సౌకర్యాలను చూసి సి.ఎం. నేవీ అధికారులను ప్రశంసించారు. ఈ ఆతిథ్య కేంద్రంలో నుంచి విదేశీ నౌకాదళ అధికారులు సముద్రం అందాలను వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.

02/05/2016 - 11:56

అనంతపురం: ఆత్మకూరు సమీపంలోని పంటపొలాల్లో శుక్రవారం ఉదయం టిడిపి కార్యకర్త మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. గురువారం రాత్రి ప్రత్యర్థులు ఇతడిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడిని కళ్యాణదుర్గం మండలం ముసికొట్టాల తండాకు చెందిన రమణగా గుర్తించారు.

Pages