S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/06/2019 - 04:38

అమరావతి, జనవరి 5: ఆర్థికలోటు ఉన్నప్పటికీ సమర్థతతో పనిచేసి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సాధించిన ప్రగతికి గుర్తింపుగా అవార్డు సాధించ గలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. జలవనరుల నిర్వహణలో జాతీయ స్థాయిలో ఢిల్లీలో అందుకున్న సీబీఐపీ అవార్డును నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శనివారం సాయంత్రం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు.

01/06/2019 - 03:52

విజయవాడ, జనవరి 5: అవదూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యాన కృష్ణానది తీరంలో విజయవాడ పద్మావతి ఘాట్‌లో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం మార్మోగిం ది. సుమారు 2లక్షల మంది పైగా భక్తులు హాజరయ్యారు.

01/06/2019 - 03:47

విజయవాడ, జనవరి 5: భారతదేశం ప్రాచీన కాలంలోనే విద్యకు నిలయంగా విలసిల్లిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆ కాలంలో నలంద, తక్షశిల, పుష్పగిరి మంచి విద్యాలయాలుగా వెలుగొందాయన్నారు. వాటిలో విద్యను అభ్యసించడానికి చైనా లాంటి దేశాల నుంచి కూడా విద్యార్థులు వచ్చేవారన్నారు.

01/06/2019 - 03:44

విజయవాడ(సిటీ), జనవరి 5: ప్రత్యేక హోదా...రాష్ట్ర హక్కుల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నిలదీయడం తప్పా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. ఎదురు తిరిగితే అణచి వేస్తాం అనే మోదీ ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువంటిదని శనివారం ట్విట్టర్‌లో లోకేష్ విమర్శించారు.

01/06/2019 - 03:38

విజయవాడ, జనవరి 5: కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే తొలిసారిగా ఈ నెల 6, 7 తేదీల్లో స్థానిక పీబీ సిద్ధార్థ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల ప్రథమ మహాసభలు భారీ ఎత్తున జరగబోతున్నాయి. సభా ప్రాంగణానికి యద్దనపూడి సులోచనారాణి పేరును, సాహితీ వేదికకు కళా ప్రపూర్ణ తెనే్నటి హేమలత పేరును నామకరణం చేశారు.

01/06/2019 - 03:37

నెల్లూరు, జనవరి 5 : రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పనుల సాధనలో భాగంగా ఎన్నో ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయింపులపై కేంద్రంపై టీడీపీ చేస్తున్న పోరాటానికి వైసీపీ, జనసేనతో పాటు ఇతర పార్టీలు కలిసి రావాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలో అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా శనివారం ఆయన కొండలపూడిలోని ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను పరిశీలించారు.

01/06/2019 - 03:37

గుంటూరు, జనవరి 5: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆయన రహస్య స్నేహితులదే హత్యా రాజకీయాల చరిత్ర అని, తెలుగుదేశం పార్టీకి ఆ చరిత్ర లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శనివారం టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాష్టప్రతి పాలన తీసుకు వచ్చేందుకే కన్నా లక్ష్మీనారాయణ యత్నిస్తున్నారని ఆరోపించారు.

01/06/2019 - 03:36

భీమవరం, జనవరి 5: కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో మేరా బూత్ - సబ్ సే మజ్‌బూత్ పేరుతో నిర్వహించిన బీజేపీ వీడియో కాన్ఫరెన్స్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కాక పుట్టిస్తోంది. ఐదు పార్లమెంటు పరిధుల్లోని బూత్ కార్యకర్తలతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ కార్యకర్తలు సత్యమే మాట్లాడాలి.. ఎవరైనా తప్పుచేస్తే ప్రశ్నించండి.. అంటూ పిలుపునిచ్చారు.

01/06/2019 - 03:35

గుంటూరు, జనవరి 5: దేశంలో పలు మతాలకు చెందిన ప్రజలు కలిసి మెలిసి జీవిస్తున్నారని, వారి మతవిశ్వాసాలు దెబ్బతీసేలా కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని, అయితే మత విశ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత పాలకులదేనని అయ్యప్ప సేవా సమాఖ్య అధ్యక్షుడు సిరిపురపు శ్రీ్ధర్ పేర్కొన్నారు.

01/06/2019 - 02:46

అమరావతి, జనవరి 5: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరా సంస్థ (ఏపీ ట్రాన్స్‌కో)కు మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది. అత్యల్ప నష్టాలు, అత్యధిక సమర్థవంతమైన ట్రాన్స్‌మిషన్ నిర్వహణతో దేశం మొత్తంలోనే అత్యధిక పనితీరు కనబరచిన సరఫరా సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సాగునీరు, విద్యుత్ కేంద్రీయ మండలి (సీబీఐపీ) ఈ అవార్డును అందజేసింది.

Pages