S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/04/2019 - 22:34

అమరావతి, జనవరి 4: బ్రాహ్మణులలో పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. బ్రాహ్మణ యువత స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా రవాణా రంగంలో సుమారు రూ. 60 లక్షల సబ్సిడీపై 30 మందికి మారుతీ డిజైర్ టూర్ వాహనాలను లబ్ధిదారులకు శుక్రవారం ముఖ్యమంత్రి పంపిణీ చేశారు.

01/04/2019 - 16:38

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద సీఎం కాన్వాయ్‌ను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. సీఎం, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సీఎం చంద్రబాబు ‘జన్మభూమి-మావూరు కార్యక్రమానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహాం వ్యక్తంచేశారు. మోదీ రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు.

01/04/2019 - 12:45

అమరావతి: బీజేపీ నేతలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని, రెండు రోజుల్లోనే పార్లమెంటు నుంచి 45మంది ఎంపీలను సస్పెండ్ చేయటం ఏమిటని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శుక్రవారంనాడు టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం 14మంది టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. కేంద్రం నిరంకుశత్వంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.

01/04/2019 - 12:43

విజయవాడ: వైకాపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకి అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాస్ అనే వ్యక్తి గత ఏడాది అక్టోబర్ 25న కోడికత్తితో దాడి చేసిన విషయం విదితమే. ఎన్‌ఐఏ యాక్ట్ ప్రకారం కేసును బదిలీ చేయాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

01/04/2019 - 04:35

పోలవరం, జనవరి 3: ఇప్పటికే జాతీయ అవార్డు సహా పలు ఘనతలను సాధించిన పోలవరం జాతీయ ప్రాజెక్టు తాజాగా గిన్నీస్ బుక్‌లో చోటు కోసం సిద్ధమవుతోంది. 24 గంటల్లో 28 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేయడం ద్వారా రికార్డు సాధనకు కాంట్రాక్టు సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 6వ తేదీ ఉదయం 9గంటల నుంచి 7వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఈ మహాక్రతువు సాగనుంది.

01/04/2019 - 04:34

విశాఖపట్నం, జనవరి 3: ప్రతి ఏడాది విద్యకు రూ.25 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందని మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సావిత్రిబాయి పూలే మహిళా ఉపాధ్యాయ దినోత్సవం రాష్టస్థ్రాయి పురస్కార ప్రదానోత్సవం సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం ఏయూ కాన్వొకేషన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

01/04/2019 - 04:33

శ్రీకాకుళం, జనవరి 3: రాజధాని నిర్మాణ ఒప్పందాన్ని పబ్లిక్ డొమైన్‌లో ప్రభుత్వం పెట్టగలదా అని వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. గురువారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త రాజధాని నిర్మాణానికి జరిగిన ఒప్పందంలో ఫలానా పద్ధతిలో రాజధాని నిర్మాణం జరుగుతుందని ప్రజలకు చెప్పే ధైర్యం చేయగలరా అని ధర్మాన ముఖ్యమంత్రికి సవాల్ చేశారు.

01/04/2019 - 04:30

విజయవాడ, జనవరి 3: జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో ప్రజలను ఆన్‌లైన్‌లో భాగస్వాములను చేసేందుకు, వివిధ అంశాలపై వారి అభిప్రాయాలను వీడియోల ద్వారా పంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. దీని కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించి, ప్రజలు తమ అభిప్రాయాలను వీడియో ద్వారా పంచుకునేందుకు వేదికను ఆర్టీజీఎస్ రూపొందించింది.

01/04/2019 - 04:29

కడప, జనవరి 3: రాష్ట్ర బీజేపీ నేతలు ముఖ్యమంత్రిపై సంస్కారహీనమైన వ్యాఖ్యలు చేస్తుంటే ప్రధాని మోదీ పైశాచిక ఆనందం పొందుతున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా అన్నట్లు మోదీ ఇతరులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నందున అదే దారిలో పార్టీ రాష్ట్ర నేతలు తయారయ్యారన్నారు.

01/04/2019 - 04:29

విజయవాడ, జనవరి 3: దేశ ప్రజలను కన్న బిడ్డల్లాగా చూడాల్సిన ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలపట్ల మాత్రం కళ్లుండి చూడలేని కబోదిలా వ్యవహరిస్తున్నారంటూ శాసన మండలిలో ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. గురువారం నాడిక్కడ ఆయన కళ్లకు గంతలు కట్టుకుని మీడియాతో మాట్లాడుతూ మోదీ ఉద్దేశ్యపూర్వకంగా రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే కాకుండా వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని అన్నారు.

Pages