S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/05/2019 - 16:23

కాకినాడ: విద్యావిధానంలో సమూల మార్పులు తేవాలని కేంద్రం భావిస్తుందని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన రంగరాయల వైద్య కళాశాల 60వ వార్షికోత్సవంతో పాటు పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్ మోదీ కోసం కాదని భారతదేశం కోసమని అన్నారు.

01/05/2019 - 12:38

గుంటూరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు టీడీపీ శ్రేణులు ధర్నా చేశారు. నిన్న కాకినాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకున్నందుకు నిరసనగా నేడు టీడీపీ కార్యకర్తలు, నేతలు కన్నా ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఇరుపార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. పోలీసులు రావటంతో పరిస్థితి సద్దుమణిగింది.

01/05/2019 - 12:38

గుంటూరు: టీడీపీ కార్యకర్తలు తన ఇంటి ముందు ఆందోళన చేయటంపై బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆదేశాల మేరకు తనను చంపటానికి టీడీపీ కార్యకర్తలు వచ్చారని ఆరోపించారు. తనపై హత్యాయత్నానికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు.

01/05/2019 - 12:36

అమరావతి: హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఆయన కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్లు లేని ప్రతి ఉద్యోగికి ఇల్లు నిర్మించి ఇస్తామని, అపార్ట్‌మెంట్‌లు నిర్మించి అందులో ఫ్లాట్స్‌లో ఉద్యోగులకు కేటాయించాలని సూచించారు. చుక్కల భూమికి సత్వరమే పరిష్కారం చూపించాలని సూచించారు.

01/05/2019 - 12:35

విజయవాడ: బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై దాడి జరగటం గర్హనీయమని బీజేపీ నేత విజయ్‌బాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కాకినాడ పర్యటన సందర్భంగా ఆయనను ప్రశ్నించిన మహిళను ఫినిష్ చేస్తామనటం సిగ్గుచేటు అని అన్నారు. ఇలా ప్రశ్నించినవారిపై దాడులకు పాల్పడటం టీడీపీకి అలవాటేనని అన్నారు.

01/05/2019 - 00:12

విజయవాడ(సిటీ), జనవరి 4: పేరు ప్రఖ్యాతులు, డబ్బు, హోదా ఉన్నంత మాత్రాన పార్టీలు స్థాపించి వాటిని విజయవంతంగా నడిపించలేమని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. బాధ్యత, సేవ చేయాలనే తపన, ఓపిక, సహనం, ఇవన్నీ ఉన్నప్పుడే రాజకీయాల్లో రాణించగలమన్నారు. ఒకటి రెండు కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయాల్లో విజయం సాధించలేమన్నారు. కులాల ప్రభావం అధికంగా ఉండే రాష్ట్రాల్లో ఇది స్పష్టమయిందన్నారు.

01/05/2019 - 00:02

విజయవాడ, జనవరి 4: వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెలాఖరులోగా మరో 14 నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ పీ ఉదయ భాస్కర్ వెల్లడించారు. ఏపీపీఎస్సీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 14 నోటిఫికేషన్ల ద్వారా 1521 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. సర్వీస్ నిబంధనలు, అర్హతలు, ఖాళీల వివరాలు, తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి వివరాలు రావాల్సి ఉందన్నారు.

01/05/2019 - 00:02

రామచంద్రపురం, జనవరి 4: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో ఖాయిలాపడి, మూతపడిన ఆర్థోస్ బ్రూవరీస్ సంస్థ రెండు, మూడు నెలల్లో తిరిగి ప్రారంభం కానుంది. ఆర్థోస్ కోస్తాంధ్రలో తొలి బీరు ఫ్యాక్టరీగా గణితికెక్కింది. ప్రముఖ పారిశ్రామికవేత్త స్వర్గీయ అడ్డూరి పద్మనాభరాజు కృషితో రామచంద్రపురం పట్టణంలో బీరు ఫ్యాక్టరీ స్థాపన జరిగింది.

01/05/2019 - 00:01

గుంటూరు, జనవరి 4: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల శాతాన్ని 34 నుండి 22 శాతానికి తగ్గించడం ఆక్షేపణీయమని, ఇది బీసీల వ్యతిరేక చర్యగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు స్పష్టంచేశారు.

01/05/2019 - 00:01

విజయవాడ, జనవరి 4: రాష్ట్ర విభజన అనంతరం అన్ని విధాలుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షిస్తూ అవధూత దత్తపీఠాధీశ్వరులు గణపతి సచ్చిదానంద సన్నిధిలో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విజయవాడలో కృష్ణానదీ తీరాన పద్మావతి ఘాట్‌లో రెండు లక్షల మంది భక్తులచే శ్రీహనుమాన్ చాలీసా పారాయణ, విశ్వశాంతి మహాయజ్ఞం జరుగుతున్నది.

Pages