S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/05/2019 - 00:00

విజయవాడ, జనవరి 4: రాష్ట్రంలోని తీర ప్రాంత రక్షణ కీలకమని, వివిధ విభాగాలు సమన్వయంతో రక్షణ బాధ్యతలు నిర్వహించాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్‌చంద్ర పుణేఠా ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో తీర రక్షణకు సంబంధించి తూర్పు నౌకాదళం (విశాఖ) నేతృత్వంలో 4వ రాష్ట్ర స్థాయి అపెక్స్ కమిటీ సమావేశం సీఎస్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది.

01/05/2019 - 00:00

విజయవాడ, జనవరి 4: కాకినాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును బీజేపీ నేతలు అడ్డుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఖండించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కనుసైగ చేస్తే, టీడీపీ కార్యకర్తలు తలుచుకుంటే బీజేపీ నేతలు రోడ్ల మీద కూడా తిరగలేరని హెచ్చరించారు. వీరు ఎంత.. వీరి ఉనికి ఎంత..

01/04/2019 - 23:59

విశాఖపట్నం, జనవరి 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న శే్వతపత్రాలన్నీ బూటకమేనని, ప్రభుత్వ ప్రకటనల్లో వాస్తవం ఉంటే అధికారులతో చర్చకు సిద్ధపడాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సవాలు విసిరారు.

01/04/2019 - 23:31

రాజమహేంద్రవరం, జనవరి 4: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కోడి కత్తి పార్టీగా మారిపోయిందని, ఆ పార్టీ మెడపై ప్రధాని మోదీ సీబీఐ కత్తి పెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎద్దేవాచేశారు. అందుకే మోదీ అంటే జగన్ వణికిపోతూ ఊడిగం చేస్తున్నారని, రాష్ట్రానికి అటువంటి ప్రతిపక్షం దాపురించిందన్నారు.

01/04/2019 - 22:52

గుంటూరు, జనవరి 4: ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పొగాకు పంట సాగు చేసినట్లయితే ఎగుమతులకు మార్గం సుగమమై పొగాకు రైతులకు మేలు జరుగుతుందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) డైరెక్టర్ జనరల్ జి జయలక్ష్మి పేర్కొన్నారు.

01/04/2019 - 22:50

హైదరాబాద్, జనవరి 4: ఖాతాదారులకు విభిన్న మార్గాల్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చేరువ అవుతోందని ఈ క్రమంలో రోజురోజుకూ బ్యాంకింగ్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ మణి పల్వేసన్ చెప్పారు. ఎస్‌బీఐ అమరావతి స్థానిక హెడ్ ఆఫీసు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన వార్షిక పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకు కార్యకలాపాలను వివరించారు.

01/04/2019 - 22:49

రాజమహేంద్రవరం, జనవరి 4: ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను రెండు రోజుల్లోనే పరిష్కరించాలని, మొత్తం దరఖాస్తులు జన్మభూమి కార్యక్రమం ముగిసేలోగానే పరిష్కరించాలని అధికారులను ఆదేశించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు.

01/04/2019 - 22:44

అమరావతి, జనవరి 4: వ్యవసాయ రంగాన్ని సుసంపన్నం చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వం తీసుకున్న చర్యలు గత నాలుగున్నరేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపయ్యేందుకు దోహదపడ్డాయి.

01/04/2019 - 22:44

హైదరాబాద్, జనవరి 4: తాము అధికారంలోకి రాగానే అగ్రి గోల్డ్ బాధితులను ఆదుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భరోసా ఇచ్చారు. అగ్రి గోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల చొప్పున ఇవ్వాలని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి రాగానే ఆదుకుంటామని ప్రకటించడంతోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు చొప్పున ఇవ్వాలని భావిస్తున్నదన్నారు.

01/04/2019 - 22:43

హైదరాబాద్, జనవరి 4: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిన ఘటనపై విచారణకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కు హైకోర్టు అప్పగించినందున, అసలైన కుట్రదారులు బయట పడతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. కత్తితో దాడి చేసిన కేసును కేంద్రం ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని హైకోర్టు థృవీకరించిందని మిథున్ రెడ్డి శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు.

Pages