S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/04/2019 - 04:27

విజయనగరం, జనవరి 3: ఆర్టీసీ విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పిన్నమనేని వెంకట రామారావుగురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ ఆర్టీసీ రీజనల్ మేనేజర్‌గా మూడేళ్లు పనిచేసి ఇటీవల పదోన్నతిపై ఇక్కడ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత, ప్రయాణికులకు కనీస సదుపాయాల కల్పన, ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు.

01/04/2019 - 04:14

గుంటూరు, జనవరి 3: రాష్టవ్య్రాప్తంగా చుక్కల భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలోనే ముగింపు పలికి, శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చుక్కల భూములపై అవసరమైతే చట్టంలో మార్పులు చేసైనా రైతుల రుణం తీర్చుకుంటామని తెలిపారు.

01/04/2019 - 04:12

విజయవాడ(సిటీ), జనవరి 3: అభివృద్ది చెందుతున్న కులాలకు ఒక వైపు అండగా ఉంటూనే...మరోవైపు వెనుకబడిన కులాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం పార్టీ శ్రేణులపై ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

01/04/2019 - 04:10

విజయవాడ, జనవరి 3: శబరిమలపై ఆందోళనల పేరుతో కేరళలో అరాచకాలకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్ ప్రయత్నిస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నారు. ఇందుకు ప్రధాని మోదీనే ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ దాసరిభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అయ్యప్పస్వామి ఆలయంలో మహిళల ప్రవేశించడాన్ని వ్యతిరేకిస్తూ వీధి యుద్దాలకు దిగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

01/04/2019 - 04:09

గుంటూరు (లీగల్), జనవరి 3: ప్రత్యేక హైకోర్టు ప్రారంభమైన నేపథ్యంలో 13 జిల్లాలకు పరిపాలనా న్యాయమూర్తులను నియమిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగారి ప్రవీణ్‌కుమార్ కృష్ణా పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తారు.

01/04/2019 - 02:19

నెల్లూరు, జనవరి 3: బీసీ కులాలన్ని ఏకతాటిపై తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి వైకాపాను బంగాళాఖాతంలో కలపాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరులో గురువారం రూ.4.5కోట్లతో నిర్మిస్తున్న బీసీ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవన్‌ను నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.

01/03/2019 - 17:08

విజయవాడ: పోలవరంపై ప్రధాని మోదీ మాటలు విడ్డూరంగా ఉన్నాయని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన గురువారంనాడు విలేకర్లతో మాట్లాడుతూ ప్రధాని నిన్న బీజేపీ నేతలతో మాట్లాడుతూ పోలవరానికి ఏడువేల కోట్ల రూపాయలను కేంద్ర విడుదల చేసిందని, ఈ ప్రాజెక్టును ఏపీ సక్రమంగా నిర్వహించటం లేదని కాగ్ సైతం పేర్కొందని అనటం పట్ల ఆయన నిరసన వ్యక్తంచేశారు.

01/03/2019 - 04:28

అమరావతి, జనవరి 2: జన్మభూమి- మా వూరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. మతసంబంధమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకుని లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందన్నారు. టీడీపీకి సంబంధించి ఇదే కీలకమైన సమయం.. ఈ పదిరోజులు గ్రామాలు, వార్డులలోనే ఉండాలని నిర్దేశించారు. భావితరాల భవిష్యత్తు వచ్చే ఎన్నికలపై ఆధారపడి ఉందన్నారు.

01/03/2019 - 04:26

శ్రీకాకుళం, జనవరి 2: ఎవరూ చేయనంతగా ఏపీకి ఎన్నో అభివృద్ధి-సంక్షేమ పథకాలు అందించామంటున్న ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ప్రసంగంపై చర్చకు రావాలన్న ముఖ్యమంత్రి సవాల్‌ను స్వీకరించాలంటూ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు. ఐదు కోట్ల ఆంధ్రుల హక్కుల కోసం బాబు చేస్తున్న ధర్మపోరాటానికి విజ్ఞతతో ఆలోచించి ప్రజలంతా సహకరించాలని కోరారు.

01/03/2019 - 04:24

విజయవాడ, జనవరి 2: రాష్ట్రంలోని గృహ నిర్మాణ ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఏపీటిడ్కో (ఏపీ టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఏపీటిడ్కోకు సంబంధించి రాష్ట్ర స్థాయి మంజూరు, పర్యవేక్షణ కమిటీ సమావేశం బుధవారం జరిగింది.

Pages