S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/26/2018 - 02:41

విశాఖపట్నం (స్పోర్ట్స్), డిసెంబర్ 25: ఆంధ్రా, బెంగాల్ జట్ల మధ్య విశాఖ ఏసీఏ, విడీసీఏ స్టేడియంలో జరిగిన రంజీ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆధి క్యం కనబరచిన ఆంధ్రా మూడు పాయింట్లు సాధించగా, బెంగాల్ జట్టుకు ఒక పాయిం ట్ లభించింది.

12/26/2018 - 00:41

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు పోలవరానికి నిధులివ్వని ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తన పదవికి రాజీనామా చేస్తే బాగుండేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఫ్రభుత్వం తన నియోజకవర్గ అభివృద్ధికి సహకరించనందునే రాజీనామా చేస్తున్నట్లు మాణిక్యాలరావు చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు.

12/25/2018 - 23:50

తిరుపతి, డిసెంబర్ 25: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరుని పాదాల చెంత ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ద్రోహం చేశారని, ఈక్రమంలో ప్రజలకు క్షమాపణలు చెప్పి జనవరి 6న గుంటూరు సభలో పాల్గొనాలని రాష్ట్ర విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

12/25/2018 - 23:49

విజయవాడ, డిసెంబర్ 25: తెల్ల రేషన్ కార్డులను జారీ చేసేందుకు అర్హత ఆదాయ పరిమితిని పెంచే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసే వీలు ఉందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు జారీకి గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం 60 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం 75 వేల రూపాయలు కలిగి ఉండాలి.

12/25/2018 - 23:48

విజయవాడ, డిసెంబర్ 25: ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేవనెత్తిన అభ్యంతరాలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మద్దతు పలికారు. ఈ విషయాన్ని ఒడిశా ఎంపీ సౌమ్య రంజన్ పట్నాయక్ వెల్లడించారు. ఉండవల్లిలో ప్రజావేదిక వద్ద చంద్రబాబుతో ఎంపీ రంజన్ మంగళవారం రాత్రి భేటీ అయ్యారు.

12/25/2018 - 23:48

ముత్తుకూరు, డిసెంబర్ 25: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నేలటూరు గ్రామం సమీపంలోని ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థ శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలోని కనే్వరు బెల్ట్ గొలుసుకు సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. కృష్ణపట్నం బకింగ్ హామ్ కెనాల్ అవతల కృష్ణపట్నం ఓడరేవు నుండి ఏపీ జెన్‌కో ప్రాజెక్టుకు పై బెల్ట్ ద్వారా బొగ్గు రవాణా జరుగుతుంది.

12/25/2018 - 03:32

విజయవాడ(సిటీ), డిసెంబర్ 24: మార్పు కోరుకుంటున్న రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా జనసేనకు అధికారం అప్పగిస్తారని జనసేన పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. జనసేనకు గాజు గ్లాసు గుర్తుగా రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దేశంలోని సాధారణ పౌరుడు సైతం గ్లాసును గుర్తిస్తాడన్నారు.

12/25/2018 - 03:26

విజయనగరం, డిసెంబర్ 24: ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం స్థానిక జెడ్పీ ఆవరణలోఏర్పాటు చేసిన బీసీ చైతన్య సదస్సుకు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ కాకి గోవిందరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో బలహీనవర్గాలకు పెద్దపీట వేసింది టీడీపీ పార్టీయేనని అన్నారు.

12/25/2018 - 03:24

విజయవాడ, డిసెంబర్ 24: డీఎస్సీ-2018 తొలిరోజు పరీక్ష రాష్ట్రంలో సోమవారం ప్రశాంతంగా జరిగింది. తొలిరోజు 40,066 మంది పరీక్షకు హాజరయ్యారు. స్కూల్ అసిస్టెంట్స్ (గణితం, బయోలాజికల్ సైన్సు)కి సంబంధించి ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. మొత్తం 44,842 మందికి హాల్ టిక్కెట్లు జారీ చేయగా, 89.35 శాతం మంది పరీక్ష రాశారు.

12/25/2018 - 03:23

విజయవాడ, డిసెంబర్ 24: పార్లమెంట్‌లో ఈ నెల 27న తీసుకువస్తున్న ముస్లిం ఉమెన్ బిల్ -2018ను వ్యతిరేకించి కోట్లాది ముస్లింల హక్కులను కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు కోరారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రిని సోమవారం సంస్థ ప్రతినిధులు కలిశారు. ముస్లింలకు మొదటి నుంచి టీడీపీ అండగా ఉందని, ఈ విషయంలో కూడా తమకు సహకరించాలని కోరారు.

Pages