S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/28/2018 - 23:07

అమరావతి, డిసెంబర్ 28: విభజన తరువాత రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధికి లక్షా 31 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రభుత్వంపై మానవ వనరుల అభివృద్ధి తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక స్థాయి నుంచి నాలెడ్జి ఎకానమీకి దోహదపడే విధంగా కార్యక్రమాలు చేపట్టాం.

12/28/2018 - 03:21

విజయవాడ: రాష్ట్రాలను డబ్బులు సంపాదించే యంత్రాలుగానే కేంద్రం భావిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ లేకుండా ఏ ఫ్రంట్ కొత్తగా ఏర్పడినా మనుగడ ఉండదని స్పష్టం చేశారు. హైకోర్టు తరలింపులో కేంద్రం పద్ధతి లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్రానికి బానిసలం కాదని హెచ్చరించారు.

12/28/2018 - 02:59

విజయవాడ(సిటీ), డిసెంబర్ 27: ప్రపంచంతో పోటీ పడుతూ 2050 నాటికి నెంబర్ వన్‌గా నిలవాలనే అంతిమ లక్ష్యంతో నిరంతరాయంగా పని చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విభజన కష్టాలు, సమస్యలను అధిగమిస్తూ, మరోవైపు అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. టెక్నాలజీని వినియోగించుకుంటూ అతి తక్కువ సమయంలో అభివృద్ధి సాధిస్తున్నామన్నారు.

12/28/2018 - 02:57

విజయవాడ: ప్రజలకు నీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులను చేపట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇప్పటి వరకూ సాగునీటి ప్రాజెక్టులపై 63,657 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 32 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించి స్థిరీకరించినట్లు తెలిపారు. సహజ వనరులు- జలవనరులపై ఉండవల్లిలోని ప్రజావేదికలో 5వ శే్వతపత్రంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

12/28/2018 - 02:56

విజయవాడ, డిసెంబర్ 27: ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4600 మంది వెలుగు ఉద్యోగులు చేస్తున్న సమ్మె గురువారం 23వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు ఆయా జిల్లాల్లో ధర్నాలకే పరిమితమైన వీరు ఇక తమ ఆందోళనను ఉద్ధృతం చేయాలని గురువారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి ఉద్యోగుల సంక్షేమ సంఘాల జేఏసీ సమావేశం నిర్ణయం తీసుకుంది.

12/28/2018 - 02:55

విజయవాడ (క్రైం), డిసెంబర్ 27: రాష్ట్రంలో ఎనిమిది మంది సూపర్ న్యూమరరీ డీఎస్పీలకు స్థానచలనం కలిగింది. ప్రస్తుతం పని చేస్తున్న చోటు నుంచి బదిలీ చేస్తూ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు ట్రాఫిక్ డిఎస్పీ సిఎం గంగయ్యను తిరుపతి స్పెషల్ బ్రాంచి డిఎస్పీగా, ఇక్కడ పని చేస్తున్న టి రవి మోహనారిని అదనంతపురం ఎస్సీ, ఎస్టీ సెల్ డిఎస్పీగా బదిలీ చేశారు.

12/28/2018 - 02:55

విజయవాడ (క్రైం), డిసెంబర్ 27: ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రతి ఏడాది పోలీసు స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయాలని డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ స్పష్టం చేశారు. డిసెంబర్‌లోగా క్రీడా వారోత్సవాలు నిర్వహించకుంటే, కనీసం జనవరిలోనైనా పూర్తి చేయాలని సూచించారు. నిరంతరం వృత్తిపరమైన ఒత్తిడితో కూడుకున్న పోలీసుల దైనందిన జీవితంలో ఆటలు ఆరోగ్యంతోపాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు.

12/28/2018 - 02:54

విజయవాడ, డిసెంబర్ 27: దశాబ్దాల తరబడి నెలకొన్న గుంటూరు జిల్లా లింగంగుట్ల అగ్రహారం భూముల వ్యవహారం పరిష్కారం కానుంది. ఈ సమస్య పరిష్కారానికి పుష్పగిరి మఠం ప్రతినిధులు, రైతులు అంగీకరించడంతో ఒక ముందుడగు పడింది. ప్రభుత్వం ఈ దిశగా తీసుకున్న చొరవతో 1684 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. 1784 ఎకరాలకు సంబంధించి రైతులకు హక్కులు రానున్నాయి.

12/28/2018 - 02:54

విజయవాడ, డిసెంబర్ 27: రాష్ట్రంలోని చమురు, సహజ వాయువులను రాష్ట్భ్రావృద్ధికి ఉపయోగపడే విధంగా ఎలా చేయాలన్న అంశంపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

12/28/2018 - 02:38

గుంటూరు, డిసెంబర్ 27: రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆంధ్రుల్లా కాకుండా గుజరాతీయుల్లా ప్రవర్తిస్తున్నారని, వారికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమో, పార్టీ ప్రయోజనాలు ముఖ్యమో చెప్పాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ప్రశ్నించారు. గుంటూరులోని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పలు అంశాలపై బహిరంగ లేఖను గురువారం విడుదల చేశారు.

Pages