S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/21/2018 - 02:54

శ్రీకాకుళం, నవంబర్ 20: ప్రత్యక్ష నారాయణుడిగా పూజలందుకుంటున్న శ్రీ అరసవిల్లి సూర్యనారాయణస్వామి తెప్పోత్సవం కనుల పండువుగా సాగింది. పవిత్ర కార్తీక మాసం ద్వాదశి ని పురష్కరించుకొని సాంప్రదాయబద్ధంగా ఆదిత్యునికి మంగళవారం తెప్పోత్సవం ఇంద్ర పుష్కరిణిలో నిర్వహించారు. ఈ తెప్పోత్సవాన్ని తిలకించేందుకు శ్రీకాకుళంతో పాటు వివిధ ప్రాంతాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.

11/21/2018 - 02:50

విజయవాడ, నవంబర్ 20: విశాఖ గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అధికారుల కళ్లు కప్పి, దట్టమైన అటవీ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో సాగుతున్న గంజాయి సాగును అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గంజాయి సాగును గుర్తించేందుకు డ్రోన్ నిఘా కళ్లతో అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతోంది. డ్రోన్లను ఉపయోగించిన ఆర్టీజీఎస్ గంజాయి తోటలను గుర్తించే పనిలో నిమగ్నమైంది.

11/21/2018 - 02:48

పోలవరం, నవంబర్ 20: పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసం ఎత్తిపోతల పథకం మోటార్లకు విద్యుత్ సరఫరా అయ్యే కేబుల్ కాలిపోవటంతో మంగళవారం ఉదయం మోటార్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సంఘటన ఉదయం 8గంటలకు జరగ్గా, తక్షణం స్పందించిన ఇంజినీరింగ్ అధికారులు కాలిపోయిన కేబుళ్లను సరిచేసి ఉదయం 10.30 గంటలకు తిరిగి మోటార్లను ఆన్‌చేసి గోదావరి నీటిని కుడి కాలువ ద్వారా కృష్ణా జిల్లాకు తరలించే ప్రక్రియను ప్రారంభించారు.

11/21/2018 - 02:48

విజయవాడ, నవంబర్ 20: ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు విజయవాడ నగరంలో కృష్ణా నదీ తీరాన అద్భుత విమాన విన్యాసాలు జరుగబోతున్నాయి.

11/21/2018 - 02:47

విజయవాడ, నవంబర్ 20: నవ్యావిష్కరణలకు అద్దం పట్టేలా యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు, స్టార్టప్‌లు, యువ నిపుణులను పారిశ్రామిక, సాంకేతిక వర్గాలతో అనుసంధానం చేయడమే లక్ష్యంగా మేక్ ఇన్ ఏపీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రారంభించనుంది. ఉండవల్లిలోని ప్రజావేదికలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు.

11/21/2018 - 02:46

విజయవాడ, నవంబర్ 20: విశాఖ జిల్లా భీమిలి, అనందపురం, పరవాడ, సబ్బవరం, పెందుర్తి, గాజువాక, చినగదిలి మండలాల్లో ల్యాండ్ పూలింగ్ పేరుతో భూసేకరణ చేయడాన్ని నిలుపుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో కోరారు.

11/21/2018 - 02:46

విజయవాడ, నవంబర్ 20: విశాఖలో భూ కుంభకోణానికి సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన నివేదికపై తదుపరి చర్యలను సిఫారసు చేసేందుకు వీలుగా త్రిసభ్య కమిటీని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఏర్పాటు చేసింది. విశాఖ , పరిసర ప్రాంతాల్లో భూ రికార్డుల దిద్దుబాట్లకు సంబంధించి ఆరోపణల నేపథ్యంలో సిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ప్రభుత్వానికి సిట్ నివేదిక ఇవ్వడం తెలిసిందే.

11/21/2018 - 02:45

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 20: మహిళల ద్వారానే సమాజంలో మార్పు తీసుకురాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచన కాగా, అందుకు సమర్థులు కమ్యూనిటీ రిసోర్స్ పర్సనే్ల(సీఆర్పీ)నని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్ పేర్కొన్నారు.

11/21/2018 - 02:13

విశాఖపట్నం, నవంబర్ 20: రక్షణ రంగ పరిశోధనలు, అభివృద్ధిలో భారత్ సింగపూర్ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. సింగపూర్ ఇండియా మారీటైం బైలేటరల్ ఎక్సర్‌సైజ్ (సింబెక్స్)లో భాగంగా తూర్పు తీరంలో మంగళవారం ఇరు దేశాల రక్షణ మంత్రులు నిర్మలా సీతారామన్, ఎంజీ ఏంజ్ హేన్ మూడవ ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా రక్షణ రంగంలో పరిశోధనలు, విన్యాసాలు విస్తరించేందుకు అవకాశాలు మరింతగా పెరిగాయి.

11/20/2018 - 04:28

కాకినాడ సిటీ, నవంబర్ 19: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా నుండి పోటీచేయడానికి ఆసక్తి చూపుతున్నారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ముత్తా గోపాలకృష్ణ చెప్పారు. కాకినాడ నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఆయన విలేఖరులతో మాట్లాడారు.

Pages