S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/20/2018 - 04:17

అమరావతి, నవంబర్ 19: విద్యుత్ పంపిణీ రంగంలో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ (ఏపీ ఎస్పీడీసీఎల్) అనుసరిస్తున్న విధానాలు ప్రపంచ గుర్తింపు సాధించాయి. ఇటలీలో ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 6వ యూరోపియన్ యూనియన్- ఇండియన్ స్మార్ట్‌గ్రిడ్ వర్క్‌షాప్‌కు హాజరు కావాల్సిందిగా ఎస్పీడీసీఎల్ సీఎండీ ఎంఎం నాయక్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు.

11/20/2018 - 04:15

విజయవాడ, నవంబర్ 19: అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఆర్కా లీజర్ కంపెనీని తెరమీదకు తీసుకువచ్చి కొత్త నాటకానికి బీజేపీ తెరతీసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హయ్ ల్యాండ్ తమదేనని, అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదంటూ హైకోర్టుకు ఆర్కా లీజర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ చైర్మన్ చెప్పడాన్ని ఆయన కొట్టేశారు.

11/20/2018 - 04:13

విజయవాడ, నవంబర్ 19: నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో ఈ నెల 25న ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతక ముందు పవన్ కళ్యాణ్ ఆవిష్కరించిన తాను రాసిన పుస్తకానికి మంచి స్పందన వచ్చిందని అన్నారు. 130, 140 పేజీలు గల ఈ పుస్తకం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుందన్నారు.

11/20/2018 - 04:11

తిరపతి, నవంబర్ 19: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎంతో వేగంగా మలుపు తిరుగుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు.

11/20/2018 - 04:30

విశాఖపట్నం, నవంబర్ 19: జాతి భద్రత, రక్షణకు భారత్, సింగపూర్ నౌకాదళాల సంయుక్త సేవలు ఎంతగానో ఉపకరిస్తాయని ఇరు దేశాలకు చెందిన నౌకాదళ ప్రధానాధికారులు ఉద్ఘాటించారు. సింగపూర్, ఇండియా మారిటైం బైలేటరల్ ఎక్సర్‌సైజ్ 2018 (సింబెక్స్ 18) రజతోత్సవాలను పురస్కరించుకుని తూర్పునౌకాదళ యుద్ధ నౌకలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సింబెక్స్ లోగోను, ఇరు దేశాల పోస్టల్ కవర్, స్టాంప్‌లను విడుదల చేశారు.

11/20/2018 - 04:10

విజయవాడ, నవంబర్ 19: డీఎస్సీ - 2018కి అన్ని కేటగిరీలకు కలిపి 6,08,157 దరఖాస్తులు అందాయని రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి తెలిపారు. దరఖాస్తుల సమర్పణకు గడువు ఆదివారం అర్ధరాత్రితో ముగిసిందని తెలిపారు. 6.26 లక్షల మంది ఫీజు చెల్లించగా, 6.08 లక్షల మంది అభ్యర్థులే దరఖాస్తు చేశారని తెలిపారు.

11/20/2018 - 04:09

అమరావతి, నవంబర్ 19: తెలంగాణ రామిరెడ్డిగా గుర్తింపు పొందిన శాసనమండలి మాజీ సభ్యుడు జీవీ రామిరెడ్డికి సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శతవసంతాల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో ఆయన సేవలు అనిర్వచనీయమన్నారు. ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలనే ఆకాంక్షను వ్యక్తంచేశారు.

11/20/2018 - 04:08

విజయవాడ, నవంబర్ 19: బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, అజేయ్‌కల్లం వంటి వారు స్వప్రయోజనాల కోసం ప్రభుత్వంపై నిందలేస్తున్నారని, ప్రజలకు జరిగే మేలుని తప్పుపట్టడం వారికి భావ్యం కాదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ అన్నారు.

11/20/2018 - 04:08

విజయవాడ, నవంబర్ 19: రాష్ట్రాన్ని దుష్టత్రయమైన బీజేపీ, వైకాపా, జనసేన నుంచి కాపాడాలని ద్వారకా తిరుమల వెంకన్నను కోరుకున్నానని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి జవహర్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా అన్నదేవరపేట నుంచి ద్వారకా తిరుమలకు మూడు రోజుల పాటు 112 కిలోమీటర్ల మేర వేడుకోలు పాదయాత్ర నిర్వహించారు.

11/20/2018 - 04:07

భీమవరం, నవంబర్ 19: ప్రోబయోటిక్స్ పేరుతో ఆక్వా రంగానే్న నమ్ముకున్న రైతాంగాన్ని వ్యాపారులు మోసం చేస్తున్నారని స్లెర్లింగ్ విశ్వవిద్యాలయ ఆక్వా శాస్తవ్రేత్తల బృందం తేల్చింది. దీనివల్ల యావత్తు ఆక్వా పరిశ్రమే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిందని అభిప్రాయపడింది. రాష్ట్రం నుండి ఏటా జరిగే రూ.25వేల కోట్ల ఆక్వా ఎగుమతుల్లో 30 శాతం క్షీణించాయన్నారు.

Pages