S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/24/2018 - 03:42

కాకినాడ, అక్టోబర్ 23: దళిత, కాపుల ఐక్యవేదిక పేరుతో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో బుధవారం బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాకినాడ నగరంలోని అంబేద్కర్ భవన్‌లో జరిగే దళిత, కాపు ఐక్యవేదిక సభకు అధిక సంఖ్యలో దళిత, కాపు సామాజిక వర్గాలు హాజరయ్యేలా ఏర్పాట్లుచేశారు.

10/23/2018 - 16:51

విశాఖపట్నం: రాబోయే కాలంలో విశాఖపట్నం అద్భుత ప్రగతి సాధిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన విశాఖపట్నంలో నిర్వహించిన ఫిన్‌టెక్ ఉత్సవంలో పాల్గొన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుంటూ ముందుకు సాగుతున్నామని అన్నారు. ప్రజల సంతృప్తిని ఎప్పటికప్పుడు అంచనావేస్తున్నామని చెప్పారు.

10/23/2018 - 16:50

తిరుమల: టీటీడీ ఆర్జిత సేవ, దర్శనం టిక్కెట్ల కేటాయింపులో భారీ అవినీతి జరిగిందని టీటీడీ పాలకమండలి మాజీ శాసనసభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టిక్కెట్ల వ్యవహారంలో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.

10/23/2018 - 16:49

విజయవాడ: అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ ఏ ప్రాతిపదికన తగ్గించారని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు విమర్శించారు. ఒకప్పుడు వీటి ఆస్తుల విలువ 25వేల కోట్ల రూపాయలు ఉంటే ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఈనెల 27న విశాఖపట్నంలో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

10/23/2018 - 16:47

విజయనగరం: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీపైడితల్లి సిరిమానోత్సవం వైభవంగా ఆరంభమైంది. మధ్యాహ్నాం మూడు గంటల నుంచి మూడు లాంతర్ల నుంచి కోట వరకు జరిగింది. లక్షలాది మంది భక్తులు వేకువ జాము నుంచే ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చారు. ఉత్సవం సాఫీగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

10/23/2018 - 13:57

విజయనగరం: జనసేన, వైకాపా పార్టీలకు ప్రజల ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు పార్టీల నేతలు అయోమయంతో వ్యవహరిస్తున్నారని అన్నారు.

10/23/2018 - 13:53

గుంటూరు:ఓటు కోసం కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు వచ్చి నమోదు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 560 కళాశాలల విద్యార్థులు ఓటు కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారని జిల్లా కలెక్టర్ శశిధర్ వెల్లడించారు. ఓటు నమోదుపై మరింత అవగాహన కల్పించేందుకు పోలీసు పరేడ్ మైదానంలో హాట్ ఎయిర్ బెలూన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

10/23/2018 - 03:30

అమరావతి, అక్టోబర్ 22: విభజన సమయంలోనే ఏపీలో విపత్తుల గురించి హెచ్చరించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తుచేశారు. నీరు-ప్రగతి పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్‌చంద్ర పునేఠా సోమవారం జిల్లా కలెక్టర్లు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాన్లు, వర్షాభావం, కరవు పరిస్థితులు ఉత్పన్నమవుతాయని విభజన సందర్భంగా గుర్తుచేసినట్లు చెప్పారు.

10/23/2018 - 03:30

విశాఖపట్నం, అక్టోబర్ 22: తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారని జనసేన అథినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుపానులో నష్టపోయిన వారు ఇంకా కోలుకోకముందే, తుపాను ప్రాంతాల్లో పరిస్థితి అంతా మెరుగుపడిందని ముఖ్యమంత్రి ప్రచార విన్యాసాలు చేయడం వలన, సాయం అందించడానికి కేంద్రం ముందుకు రావడం లేదన్నారు.

10/23/2018 - 03:14

విజయవాడ, అక్టోబర్ 22: తిత్లీ తుపాను సహాయక చర్యల్లో అందరూ బాగా పని చేశారని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కితాబిచ్చారు. సహాయక చర్యలపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగిందన్నారు. తుపాను సహాయక చర్యలపై మంత్రులు, కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులతో వెలగపూడి సచివాలయం నుంచి సోమవారం ఆయన టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు.

Pages