S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/17/2018 - 16:56

విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా దంపతులపై చర్య తీసుకోవాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్ల తయారీ, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు రామిరెడ్డి కోటేశ్వరరావు అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఉమా దంపతులతో పాటు తొమ్మిది మందిపై చర్య తీసుకోవాలని ఆదేశించింది.

10/17/2018 - 16:55

గుంటూరు: పోలీసు అమర వీరుల కుటుంబాలను ఏపీ డీఐజీ ఆర్పీ ఠాకూర్ పరామర్శించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అమర వీరుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో కొత్తగా ఏర్పాటుచేసిన జిమ్‌ను ప్రారంభించారు.

10/17/2018 - 13:46

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఎనిమిదో రోజున అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో అష్టమి రోజుని దుర్గాష్టమిగా వ్యవహరిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రిపై రద్దీ పెరిగింది. అదే సమయంలో దీక్ష విరమణ కోసం భవానీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున 3గంటల నుంచి భక్తులను దుర్గమ్మ దర్శనానికి అనుమతించారు.

10/17/2018 - 12:25

తిరుమల: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజు స్వామి స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామి వారిని దర్శించుకుని భక్తులు పులకించిపోతున్నారు. రాత్రికి అశ్వవాహనంపై శ్రీనివాసుడు దర్శనమివ్వనున్నారు.

10/17/2018 - 06:30

విజయనగరం, అక్టోబర్ 16: జిల్లాను నిన్న మొన్నటి వరకు డెంగ్యూ పట్టిపీడించగా, తాజాగా స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రజలను కలవరపెడుతోంది. ఇప్పటికే స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడి ఇద్దరు మృతి చెందడంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని సాలూరు పట్టణానికి చెందిన బోనుమంతి వౌనిక (24) అలియాస్ సంతోషి స్వైన్‌ఫ్లూ వ్యాధితో విశాఖలోని చెస్ట్ ఆసుపత్రిలో మృతి చెందింది.

10/17/2018 - 06:28

విజయవాడ, అక్టోబర్ 16: విజయవాడ కనకదుర్గ ఆలయ పాలకమండలి చైర్మన్ గౌరంగబాబుకు మరోసారి అవమానం ఎదురైంది. దీంతో కొంతసేపు ఆయన పాత ఆశీర్వాద మండపం వద్ద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే మూలా నక్షత్రం, సరస్వతీ దేవి అవతారం రోజు ఆయనను దర్శనానికి, కార్యాలయంలోకి అనుమతించకపోవడం వివాదాస్పదంగా మారడం తెలిసిందే.

10/17/2018 - 04:00

విజయవాడ, అక్టోబర్ 16: తిత్లీ తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో 3435 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అదే విధంగా విభజన హామీలు అమలు చేయాలని కూడా కోరారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కూడిన బృందం గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం రాత్రి కేంద్ర మంత్రిని కలిసి ముఖ్యమంత్రి రాసిన లేఖలను అందచేశారు.

10/17/2018 - 03:57

విజయవాడ, అక్టోబర్ 16: రాష్ట్ర ప్రభుత్వంతో మున్సిపల్ కార్మికుల సమ్మె డిమాండ్లపై మంగళవారం జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. 13 రోజులుగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె విరమించారు. బుధవారం నుంచ విధులకు హాజరుకానున్నారు.

10/17/2018 - 03:57

జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 16: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని శ్రీ గంగానమ్మ అమ్మవారికి మంగళవారం రూ.99 లక్షల కొత్త కరెన్సీ నోట్లతో అలంకారం చేశారు. మహాలక్ష్మీదేవి రూపం కావడంతో ప్రత్యేకంగా కరెన్సీ నోట్లతో అలంకారం చేపట్టారు. కరెన్సీ నోట్లతో పాటు వెండి, బంగారు ఆభరణాలతో అమ్మవారికి అలంకరణ చేశారు.

10/17/2018 - 03:54

విజయవాడ, అక్టోబర్ 16: రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు ఒక్క సీటు కూడా రాదని వక్ఫ్‌బోర్డు చైర్మన్ జలీల్‌ఖాన్ అన్నారు.

Pages