S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/11/2018 - 02:52

విజయవాడ, ఆగస్టు 10: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా విశాఖపట్టణానికి చెందిన సాగి కాశీవిశ్వనాథరాజును నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

08/11/2018 - 02:51

విజయవాడ, ఆగస్టు 10: చిత్తూరు జిల్లాలో డాక్టర్ శిల్పను వేధింపులకు గురిచేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసు విచారణలో పారదర్శకంగా వ్యవహరించాలని, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.

08/11/2018 - 02:51

విజయవాడ, ఆగస్టు 10: హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేసి, కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధి పనులపై చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సహా ఇతర ఉన్నతాధికారులతో శుక్రవారం సీఎం సమీక్షించారు. కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

08/11/2018 - 02:50

విజయవాడ, ఆగస్టు 10: రాష్ట్రంలో ఆరుగురు ఐఎఫ్‌ఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం ప్రాజెక్టు టైగర్ సర్కిల్ సీసీఎఫ్ ఎస్.శ్రీశరవణన్‌ను తిరుపతి డబ్ల్యుఎల్‌ఎం సర్కిల్‌కు బదిలీ చేసింది.

08/11/2018 - 01:47

విజయవాడ, ఆగస్టు 10: రాష్ట్ర విభజన తదుపరి ఏపీఎస్ ఆర్టీసీలో కార్మిక సంఘం గుర్తింపు కోసం రెండోదఫాగా ఎంతో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఎంప్లారుూస్ యూనియన్ అనూహ్యరీతిలో 2వేల 399 ఓట్లు తిరుగులేని ఆధిక్యతతో గుర్తింపు సాధించుకుంది. ఆర్టీసీ చరిత్రలో ఇప్పటివరకు 15సార్లు ఎన్నికలు జరుగ్గా పదిసార్లు ఎన్‌ఎంయూ, ఐదుసార్లు ఈయూ గుర్తింపు పొందినట్లయింది.

08/11/2018 - 01:46

తిరుపతి, ఆగస్టు 10: టీటీడీలో పనిచేస్తున్న అన్ని ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించి తగు న్యాయం చేస్తామని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, బోర్డు సభ్యుడు చల్లారామచంద్రారెడ్డి ఉద్యోగ సంఘ నేతలకు హామీ ఇచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం టీటీడీలోని వివిధ విభాగాలకు సంబంధించిన ఉద్యోగ సంఘాలు సమ్మె బాట పట్టాలని నిర్ణయించుకున్న విషయం విదితమే.

08/10/2018 - 04:55

అనంతపురం, ఆగస్టు 9: వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో కరవు పరిస్థితులు నెలకొన్న అనంతపురం జిల్లాను ఆదుకుంటామని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు.

08/10/2018 - 04:54

విశాఖ (జగదాంబ), ఆగస్టు 9: విద్యార్థి దశ నుంచే రక్తదానం, అవయవదానంపై అవగాహన కల్పించి, ఎనిమిదో తరగతి నుంచి పాఠ్యాంశాల్లో చేర్చాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. విశాఖలోని ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆల్ ఇండియా బాడీ, ఆర్గాన్ డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ అవయవదాన వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు.

08/10/2018 - 04:54

పాడేరు, ఆగస్టు 9: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆదివాసీలంతా అందిపుచ్చుకుని ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పాడేరు సమీపాన అడారిమెట్టలో గురువారం నిర్వహించిన గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గిరిజన మహిళలతో ముఖాముఖి చర్చించిన సీఎం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లబ్ధిదారులకు ఏమేరకు ఉపయోగపడతున్నాయన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు.

08/10/2018 - 04:50

కాకినాడ, ఆగస్టు 9: బీహార్‌లో లాలూప్రసాద్ యాదవ్ పాల్పడిన కుంభకోణాల కంటే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కువ కుంభ కోణాలు జరిగాయని, అవినీతిలో లాలూను బాబు మించిపోయారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుమ్మల పద్మజ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న అనేక ప్రజా సంక్షేమ పథకాలను తాము అమలుచేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చిత్రీకరిస్తోందని విమర్శించారు.

Pages