S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/10/2018 - 04:50

విజయనగరం, ఆగస్టు 9: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న రైతు రుణమాఫీ కార్యక్రమం సాహసోపేతమైన చర్య అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. కేంద్రం సహకరించకున్నా రాష్ట్రంలో రైతులకు అండగా నిలిచామన్నారు. గురువారం ఇక్కడి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ‘రైతు ఉపశమన అర్హత పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

08/10/2018 - 04:49

విజయవాడ, ఆగస్టు 9: రాష్ట్రానికి మంజూరైన వివిధ రైల్వే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్‌కుమార్ ఆదేశించారు. రాష్ట్రానికి మంజూరైన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై వెలగపూడి సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్, ఇతర రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో గురువారం సీఎస్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

08/10/2018 - 04:47

శ్రీకాకుళం, ఆగస్టు 9 : రిమ్స్ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించిన ఘటనలో మరో మహిళ మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. గురువారం సరుబుజ్జిలి మండలం రొట్టవలసకు చెందిన తుమ్మ గరికమ్మ (60) అనే వృద్ధురాలు ప్రాణాలు విడిచింది. సెప్ట్రియాక్సిన్ ఇంజక్షన్ ఐపి 1జి అనే సూదిమందు నలుగురి ప్రాణాలను పొట్టన పెట్టుకోవడంతో ప్రభుత్వ ఆసుపత్రి అంటే సిక్కోలు జనాలు హడలెత్తిపోతున్నారు.

08/10/2018 - 04:10

గుంటూరు, ఆగస్టు 9: ఐదు కాదు, పది కాదు ఏకంగా పదిహేనేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు విభజన హామీలను సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. గురువారం గుంటూరు రూరల్ రెడ్డిపాలెంలో వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్న నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఎండగట్టారు.

08/10/2018 - 04:07

విజయవాడ, ఆగస్టు 9: యూటర్న్‌లు తీసుకోవడంలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధహస్తుడని, యూటర్న్ బోర్డులున్న చోట జగన్ ఫొటోలు పెట్టాలంటూ శాసన మండలిలో ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. గురువారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక వ్యవహారంలో జగన్ ఎవరి ఒత్తిడికి తలొగ్గారో ప్రజలకు చెప్పాలన్నారు.

08/10/2018 - 04:04

విజయవాడ, ఆగస్టు 9: రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) పార్కులను, క్లస్టర్లను ఎక్కువగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

08/10/2018 - 04:02

విజయవాడ, ఆగస్టు 9: మాతృభూమి విముక్తి పోరాటంలో అపూర్వ త్యాగాలు, అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆంగ్లేయులతో పోరాడిన ముస్లిం స్వాతంత్య్ర సమరయోధులను ప్రస్తుత తరానికి తన పరిశోధనాత్మక గ్రంథాలు, ఇతర కార్యక్రమాల ద్వారా పరిచయం చేస్తున్న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన ప్రముఖ చరిత్రకారుడు, బహు గ్రంథ రచయిత సయ్యద్ నసీర్ అహమ్మద్ కృషికి గుర్తింపుగా జాతీయ స్థాయి ‘మహారాష్ట్ర బుక్ ఆఫ్

08/10/2018 - 02:38

కదిరి రూరల్, ఆగస్టు 9: గురుకులంలో విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. కింది తరగతుల విద్యార్థులపై కొంతమంది పదో తరగతి విద్యార్థులు లైంగిక దాడులకు పాల్పడ్డారు. చీకటి పడగానే వారు ఉంటున్న గదుల్లోకి వెళ్లి లైట్లు ఆర్పివేసి అసహజ పద్దతిలో లైంగికదాడికి పాల్పడేవారు. సహకరించని వారిని బెల్టుతో చితకబాదేవారు.

08/10/2018 - 02:35

కాళ్ల, ఆగస్టు 9: బీసీల అభివృద్ధి పేరుతో కొన్ని కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నాయి మినహా ఆయా కులాలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నాయని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఐక్యతా లోపం కారణంగానే బీసీలు రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నారన్నారు. అయితే ఇందుకు ఇతర కులాల నేతలను నిందించాల్సిన పనిలేదని, మోసపోవడానికి అవకాశమిస్తే ఎప్పటికీ ఇలా మోసం చేస్తూనే ఉంటారన్నారు.

08/10/2018 - 02:29

గుంటూరు, ఆగస్టు 9: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ గిరిజన సంఘాలు, నేతలు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని బహిష్కరించి, గురువారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట సామూహిక శిరోముండనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 25 మంది గిరిజనులు శిరోముండనం చేయించుకుని నిరసన వ్యక్తం చేశారు.

Pages