S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/10/2018 - 02:20

విజయవాడ (క్రైం), ఆగస్టు 9: రాష్ట్రంలో తొలి సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ ఏర్పాటైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో మాత్రమే సైబర్ క్రైం స్టేషన్ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీకి సంబంధించి సైబర్ కేసులకు హైదరాబాద్‌లోని సైబర్ క్రైం స్టేషన్‌ను వినియోగిస్తూ వచ్చారు.

08/10/2018 - 02:14

విజయవాడ, ఆగస్టు 9: రాష్ట్ర విభజన తదుపరి రెండవ విడతగా ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో గురువారం హోరాహోరీగా జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ (బస్సు) విజయదుందుబి మోగించింది. మొత్తం 53,533 ఓట్లకుగాను 774 పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ 12వ తేదీన జరగనుంది. గురువారం జరిగిన పోలింగ్‌లో మొత్తం 49,217 ఓట్లు పోలింగ్ కాగా క్లాస్ త్రీలో 124, క్లాస్ 6లో 142 ఓట్లు చెల్లలేదు.

08/10/2018 - 02:12

విజయవాడ, ఆగస్టు 9: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన కార్యవర్గంలో ఇటీవల కార్యదర్శిగా నియమితులైన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి తనయుడు రాంకుమార్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

08/10/2018 - 02:11

విజయవాడ, ఆగస్టు 9: రాజ్యసభ ఉపాధ్యక్షుని ఎన్నికల్లో వైకాపా, బీజేపీల మధ్య లాలూచీ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయని రాష్ట్ర శాసనమండలి విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీ అభ్యర్థి విజయానికి వైకాపా పరోక్షంగా సాయపడిందని మండిపడ్డారు.

08/10/2018 - 02:11

విజయవాడ, ఆగస్టు 9: రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికలో ఎన్డీఏ పార్టీలను బెదిరించి బీజేపీ గెలిచిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బీజేపీ ఆధిక్యతతో గెలువలేదని, విధి లేని పరిస్థితుల్లో ఎన్డీఏ అభ్యర్థికి ఇతర పార్టీలు ఓటు వేశాయని, మనఃస్ఫూర్తిగా వేయలేదని ఎద్దేవా చేశారు. పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నిక 2019 ఎన్నిక బీజేపీ పునాదులు కదులుతాయనే విషయాన్ని స్పష్టం చేసిందని తెలిపారు.

08/10/2018 - 02:10

విజయవాడ (రైల్వేస్టేషన్), ఆగస్టు 9: విజయవాడ డివిజన్ పరిధిలో రైల్వే ప్రాజెక్ట్‌ల పూర్తికి ఆంధ్ర రాష్ట్రం పూర్తి స్థాయిలో సహకారం అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అన్నారు. డివిజనల్ రైల్వే ఆసుపత్రి విభాగంలో అవుట్ పేషంట్ విభాగానికి చెందిన ఓపీ బ్లాక్‌కు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు.

08/10/2018 - 02:09

విజయవాడ (క్రైం), ఆగస్టు 9: రాష్ట్రంలో ఆరుగురు నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో నలుగురు అధికారులు గత కొద్దికాలంగా వెయిటింగ్‌లో కొనసాగుతుండగా ఎట్టకేలకు పోస్టింగ్ దక్కింది. మరో ఇద్దరిలో ఒకరు విజయవాడ ట్రాఫిక్ డీసీపీగా ప్రస్తుతం పని చేస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం..

08/10/2018 - 02:08

విజయవాడ ( ఇంద్రకీలాద్రి) ఆగస్టు 9: చీర అపహరణ వివాదానికి సంబంధించి దుర్గగుడి ట్రస్ట్‌బోర్డు నుండి కె సూర్యలతకుమారిని తొలగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఆదివారం దుర్గగుడిలో ఆషాఢ మాస సారెను అమ్మవారి సమర్పించిన సందర్భంలో భక్త మండలి సమర్పించిన 18వేల రూపాయల చీరను ఆమె తీసుకువెళ్ళినట్లు దుర్గగుడి ఈవో నివేదిక సమర్పించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

08/10/2018 - 02:07

విజయవాడ, ఆగస్టు 9: పిల్లల్లో చిత్రలేఖనం పట్ల ఆసక్తి పెంపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఉండవల్లిలోని గ్రీవెన్సు హాల్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన జీవన శైలిపై జి.నిర్మల తేజశ్రీ గీసిన చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను గురువారం రాత్రి ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్రలేఖనాన్ని ప్రోత్సహించాలన్నారు.

08/08/2018 - 03:48

అమరావతి, ఆగస్టు 7: రాష్ట్ర పాలనలో పీడీ ఖాతాల నిర్వహణ గురించి అవగాహన లేని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ధ్వజమెత్తారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు చేసి సీజ్ చేసిన సొమ్మును పీడీ అకౌంట్‌లో ఉంచుతారని వివరించారు.

Pages