S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/08/2018 - 03:46

విజయవాడ, ఆగస్టు 7: రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో రాష్ట్రంలో ఇంటర్నేషనల్ సబ్‌మైరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ (సీఎల్‌ఎస్) ఏర్పాటు కీలకం కానుంది. ఈ స్టేషన్‌ను విశాఖలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై ఏళ్లు గడుస్తున్నా స్పష్టత రాకపోవడంపై ఇది ఐటీ రంగంపై ప్రభావం చూపుతోంది.

08/08/2018 - 03:45

విశాఖపట్నం, ఆగస్టు 7: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంచాలకులు మోహన్ భగవత్ దక్షిణ మధ్యక్షేత్ర (ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల) పర్యటనలో భాగంగా మంగళవారం విశాఖకు చేరుకున్నారు. ప్రతీ ఏడాది ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ క్షేత్ర పర్యటన ఉంటుంది. ఈనెల 8 నుంచి 11 వరకూ విశాఖ కేంద్రంగా భగవత్ పర్యటన కొనసాగుతుంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల కార్యవర్గ సభ్యులతో భవగత్ సమావేశం కానున్నారు.

08/08/2018 - 03:45

అమరావతి, ఆగస్టు 7: కృష్ణా, గోదావరి నదుల్లో పడవ ప్రమాదాల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించింది. బోట్లలో ప్రయాణికుల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దినేష్‌కుమార్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదుల్లో ఎన్ని పడవలు తిరుగుతున్నాయి, వాటిలో ఎన్ని అధికారికం..అనధికారికం అనే అంశాలపై అధికారులు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

08/08/2018 - 03:44

విజయవాడ, ఆగస్టు 7: ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి నోటి దురదతో, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు చేతి దురదతో జాతీయ ప్రాజెక్టు పోలవరంను అడ్డుకుంటూ చరిత్ర హీనులుగా మారొద్దని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

08/08/2018 - 03:43

విజయవాడ, ఆగస్టు 7: విభజన అనంతరం విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో ముఖ్యమంత్రి తన పరిపాలనా అనుభవంతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడుపుతుంటే రాష్ట్భ్రావృద్ధిని అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు త్రయం శనిగ్రహాల్లా బయలుదేరారని ధ్వజమెత్తారు.

08/08/2018 - 03:11

విజయవాడ, ఆగస్టు 7: రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటునప్పటికీ రాజకీయ అనుభవ శాలి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి, పారదర్శకతతో కూడిన జవాబుదారీతనంతో అటు సంక్షేమం ఇటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారని, దీని వల్ల రాష్ట్రం శరవేగంతో అభివృద్ధి చెందుతుండటమే కాకుండా టీడీపీ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ

08/08/2018 - 03:09

గుంటూరు, ఆగస్టు 7: రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టపడి పనిచేస్తుంటే ప్రతిపక్ష నేత, అవినీతి పుత్రుడైన జగన్మోహనరెడ్డి మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. 2014లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు.

08/08/2018 - 03:08

అమరావతి, ఆగస్టు 7: రాజధాని అమరావతిలో కేటాయించిన స్థలాల్లో నిర్దేశిత గడువులోగా నిర్మాణాలు చేపట్టాలని కేంద్రప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో సీఆర్డీఎ భూములు కేటాయించిన కేంద్రప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధులు, బ్యాంక్‌ల అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

08/08/2018 - 02:58

చీరాల, ఆగస్టు 7: జనాభా దామాషా ప్రకారం ఆధునిక పరికరాలు, అధికంగా నిధులు కేటాయించి చేనేతలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో చేనేతలతో గ్రామదర్శిని కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంగళవారం ఆయన పాల్గొన్నారు.

08/08/2018 - 02:57

రౌతులపూడి, ఆగస్టు 7: దేవుడు ఆశీర్వదించి, ప్రజల అండతో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే చేనేత కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి, వారి సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

Pages