S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/31/2018 - 06:02

అమరావతి, జూలై 30: జలయజ్ఞం పేరుతో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టి కోట్లాది రూపాయలు దోచేసిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

07/31/2018 - 06:01

విజయవాడ, జూలై 30: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బురదలో దొర్లాడుతూ తన కంటిన బురదను ఎదుటి వారికి రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, పైగా గాలి పోగేసుకుంటూ మాట్లాడుతుంటే వాటన్నింటికీ ఎవరు సమాధానం చెబుతారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. పచ్చి అబద్ధాల కోరు బాబుకు సమాధానం చెప్పడానికి ప్రధాని మోదీ అవసరంలేదని తానే తేల్చుకోగలనని ప్రతి సవాల్ విసిరారు.

07/31/2018 - 06:00

విజయనగరం, జూలై 30: మరో రెండు రోజుల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుండటంతో సర్పంచ్‌ల స్థానంలో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమిస్తుందా? లేదా సర్పంచ్‌లనే పర్సన్ ఇన్‌ఛార్జీలుగా కొనసాగిస్తుందా? అన్న అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. వచ్చే నెల 2తో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుండటంతో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

07/31/2018 - 05:59

భీమవరం, జూలై 30: రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న నదుల అనుసంధాన ప్రక్రియ ఎంత గొప్పదైనా, గోదావరి జలాలను ఇతర నదులతో అనుసంధానం చేస్తుండటంవల్ల గోదావరి డెల్టా ఎడారిగా మారిపోతోందని వివిధ రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తంచేశారు.

07/31/2018 - 05:57

నగరి, జూలై 30: నగరి ఎమ్మెల్యే రోజాపైన ఆమె అనుచరులపైన పోలీసులు ఐపీసీ 143, 146, 341, 353, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను అసభ్య పదజాలంతో దూషించి అవమానించడం, విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారన్న కారణాలతో ఆమెపై ఈ కేసులు నమోదు చేశారు. గత శుక్రవారం నగరి మండపం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందిన విషయం విదితమే.

07/31/2018 - 05:56

అమరావతి, జూలై 30: కాపు రిజర్వేషన్లపై హామీ ఇవ్వలేమని చేతులెత్తేసిన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యవహారశైలితో మైనారిటీల్లో భయాందోళన నెలకొందని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొ రేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ ఆరోపించారు.

07/30/2018 - 04:23

విజయవాడ, జూలై 29: హైందవ ధర్మాన్ని పరిరక్షించాలని, రాజకీయ జోక్యం లేకుండా హిందూ ధార్మిక మండలి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిర్వహించాలనే డిమాండ్లతో విశ్వధర్మ పరిరక్షణ వేదిక ఆధ్వర్యాన పలువురు స్వామీజీలు ఆదివారం విజయవాడ నుంచి తిరుపతి వరకు తలపెట్టిన మహాపాదయాత్రను పోలీసులు ఆరంభంలోనే భగ్నం చేశారు.

07/30/2018 - 04:09

విజయవాడ, జూలై 29: రాజధాని అమరావతిని భ్రమరావతి అంటున్న జగన్మోహన్‌రెడ్డి కళ్లున్న కబోది అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఇరిగేషన్ విధానం పట్ల అవగాహన లేని జగన్ పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్ట్‌లను చూసి ఓర్వలేక కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు.

07/30/2018 - 04:08

విజయవాడ (బెంజిసర్కిల్), జూలై 29: రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుండి చంద్రబాబు, లోకేష్ కలిసి నిలువునా దోచుకుంటున్నారని, దేన్నీ వదలకుండా రాష్ట్రంలోని పంచభూతాలను సైతం ఆరగిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇద్దరి అవినీతికి సంబంధించి తమవద్ద ఆధారాలున్నాయని, వారు విచారణకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.

07/30/2018 - 04:07

మదనపల్లె, జూలై 29: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేనేత కార్మికుడు సుధాకర్ యాదవ్ ఆత్మబలిదానంతోనైనా కేం ద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్ర భుత్వాలు స్పందించాలని వైకాపా, సీపీఐ, సీపీఎం, ఎఐఎస్‌ఎఫ్, ఎమ్మార్పీఎస్, భారతీయ అంబేద్కర్‌సేన, మాలమహానాడు నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో బంద్ ప్రశాంతంగా జరిగింది.

Pages