S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/29/2018 - 04:25

అమరావతి, జూలై 28: ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వశాఖలు, ఉద్యోగ సంఘాల అభిప్రాయ సేకరణకు 11వ వేతన సవరణ సంఘం సన్నాహాలు చేస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ సారి ప్రశ్నావళి ద్వారా సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమైంది. వేతన సవరణకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, విధివిధానాల రూపకల్పనకు కసరత్తు జరుపుతోంది.

07/29/2018 - 04:24

కర్నూలు, జూలై 28: చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు తోడుగా ఉంటుందని ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శల నుంచి ఆయనను ఈ ఏడాది కృష్ణమ్మ కాపాడింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీశైలం జలాశయానికి నాలుగు సంవత్సరాలు నీరు పూర్తిస్థాయిలో చేరగా ఒక ఏడాది మాత్రం అరకొరగా చేరినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది.

07/29/2018 - 04:23

పెద్దదోర్నాల, జూలై 28: సంక్రాంతి పండుగలోపు పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు మొదటి టనె్నల్ పనులు పూర్తి చేసి తాగు, సాగునీరు అందిస్తామని రాష్ట్ర భారీజలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం పెద్దదోర్నాల మండలంలోని కొత్తూరు గ్రామం వద్ద నిర్మిస్తున్న పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు టనె్నల్ పనులను ఆయన పరిశీలించారు.

07/29/2018 - 04:23

కాకినాడ, జూలై 28: హెపటైటిస్ వ్యాధిని ప్రాధమిక దశలో గుర్తించిన పక్షంలో వ్యాధి నియంత్రణ సాధ్యమేనని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజపప్ప పేర్కొన్నారు. హెపటైటిస్ బీ, సీ వ్యాధుల పట్ల ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

07/28/2018 - 04:10

కర్నూలు, జూలై 27: రాష్ట్ర రాజకీయాల్లో మరో మూడు నెలలు శాంతియుత రాజకీయాలు ఉంటాయని ఆ తరువాతే భారీ మార్పులు చోటు చేసుకుంటాయని రాజకీయ నాయకులు వెల్లడిస్తున్నారు. నేతల పార్టీ ఫిరాయింపులు, రాజకీయ పార్టీల కొత్త స్నేహాలు కూడా అక్టోబర్ తరువాతే చిగురిస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు.

07/28/2018 - 04:09

విజయవాడ (ఎడ్యుకేషన్), జూలై 27: విద్యార్థుల్లో సృజనాత్మకత ఆలోచనలను పెంచడంతో పాటు వినూత్నమైన ఆలోచనల సంస్కృతిని వ్యాప్తి చేసేందుకు ఇస్తున్న ఇన్‌స్పైర్ అవార్డుల నామినేషన్‌లను జూలై 31వ తేదీ లోపు అందజేయాలని రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణా మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) డైరెక్టర్ డి మధుసూధన్‌రావుపేర్కొన్నారు.

07/28/2018 - 04:08

కర్నూలు, జూలై 27: రానున్న సాధారణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమానికి విరుగుడుగా వైకాపా కూడా గ్రామాల్లో ప్రచారానికి ముహూర్తం ఖరారు చేసింది. పార్టీ ఆధ్వర్యంలో వైకాపా నాయకులు పల్లెలు, పట్టణాల్లో వార్డుల్లో పర్యటించనున్నారు.

07/28/2018 - 04:07

విజయవాడ, జూలై 27: పార్లమెంట్‌లో జాతీయ మెడికల్ కమిషన్ బిల్లును ప్రవేశపెట్టబోతున్న సందర్భంగా దానిని నిరసిస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులన్నీ ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బంద్‌ను పాటించబోతున్నాయని ఐఎంఏ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ నగరాల్లో నిరసన ర్యాలీలు జరగనున్నాయని తెలిపారు.

07/28/2018 - 04:07

అమరావతి, జూలై 27: తమిళనాడు మాజీముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు. శుక్రవారం ఈ మేరకు కరుణానిధి తనయుడు స్టాలిన్‌కు ఫోన్‌చేసి వివరాలడిగి తెలుసుకున్నారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షను వెలిబుచ్చారు.

07/28/2018 - 04:06

గుంటూరు, జూలై 27: సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల వసతి గృహాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరు కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, ఇదే పరిస్థితి కొనసాగితే బాధ్యులపై చర్యలు తప్పవని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు హెచ్చరించారు.

Pages