S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/04/2018 - 06:28

గుంటూరు, ఆగస్టు 3: రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి ఒక దొంగల నాయకుడైతే, కొత్తగా శృతి కలిపిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చిల్లర నాయకుడని ఆర్టీసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.

08/03/2018 - 06:05

తిరుపతి, ఆగస్టు 2: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాల్సిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాలకోసం హోదా అంశాన్ని కేంద్రం ముందు తాకట్టుపెట్టి సమాధికట్టిన ఘనుడని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

08/03/2018 - 06:04

భీమవరం, ఆగస్టు 2: రాష్ట్రంలోని పురపాలక సంఘాల కమిషనర్లు ఆందోళనబాట పట్టారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కమిషనర్ రామ్మోహన్‌రావు సస్పెన్షన్‌ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లు గురువారం నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరువుతున్నారు. కమిషనర్ల ఆందోళనకు మున్సిపల్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం మద్దతు తెలిపింది.

08/03/2018 - 06:03

గూడూరు/రాపూరు, ఆగస్టు 2: నెల్లూరు జిల్లా రాపూరు పోలీసు స్టేషన్‌పై బుధవారం జరిగిన దాడిపై గుంటూరు జోన్ ఐజీ గోపాలరావు గురువారం విచారణ వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఆయన గాయపడిన ఎస్సై, సిబ్బందితో పాటు బాధితులను కూడా ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై దాడులను ఉపేక్షించబోమన్నారు.

08/03/2018 - 06:02

విజయవాడ, ఆగస్టు 2: రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ రోగులు ఇబ్బంది పడుతున్నారని, తమిళనాడు నుంచి ఆంధ్రరాష్ట్రం విభజన తరువాత నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప్రజలకు 30 సంవత్సరాల పాటు మద్రాసులో ఉచితంగా వైద్యాన్ని అందించిన సంగతిని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి శైలజానాథ్ గుర్తు చేశారు.

08/03/2018 - 06:01

విజయవాడ (ఎడ్యుకేషన్), ఆగస్టు 2: పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, వ్యర్థపదార్థాల నిర్వహణ, సామాజిక సేవ తదితర అంశాల్లో కృషి చేసిన పాఠశాలలు, ఉపాధ్యాయులకు అవార్డులు అందించేందుకు రెడ్‌క్రాస్ సొసైటీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ కె సంధ్యారాణి తెలిపారు. ఈ అవార్డులకు పెద్ద సంఖ్యలో పాఠశాలలు, నోడల్ ఆఫీసర్లు, రెడ్‌క్రాస్ వాలంటీర్లు దరఖాస్తు చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

08/03/2018 - 06:01

విజయవాడ, ఆగస్టు 2: ఒకే సంవత్సరంలో 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్రామీణ రోడ్లను మెరుగుపరచాలని, రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. పంచాయతీరాజ్ విభాగం ద్వారా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ రోడ్ల వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

08/03/2018 - 05:59

గొల్లప్రోలు, ఆగష్టు 2: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లా గొల్లుప్రోలు మండలంలో గురువారం రెండు కిలోమీటర్ల మేర సాగింది. అనంతరం పాదయాత్ర ముగించిన జగన్ హైదరాబాద్ వెళ్లిపోయారు. మండలంలోని తాటిపర్తి జంక్షన్ సమీపంలో బుధవారం రాత్రి బసచేసిన ప్రాంతం నుండి గురువారం ఉదయం 8.40 గంటలకు జగన్ పాదయాత్ర ప్రారంభించారు.

08/03/2018 - 05:43

విజయవాడ, ఆగస్టు 2: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకి చేసిన అన్యాయం, ప్రతిపక్షాలతో కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలపై ముస్లింల్లో చైతన్యం తేవాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. వెలగపూడి సచివాలయంలో సీఎంను ముస్లిం మైనారిటీ నేతలు గురువారం కలిసి గుంటూరులో ఈ నెల 28న నిర్వహించనున్న ముస్లింల బహిరంగ సభ వివరాలను వివరించారు.

07/31/2018 - 06:03

జగ్గంపేట, జూలై 30: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహాన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 224వ రోజైన సోమవారం తూర్పు గోదావరి జిల్లాలోని మూడు నియోజకవర్గాల మీదుగా సాగింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కిర్లంపూడి మండలం వీరవరం నుండి ప్రారంభమైన యాత్ర పెద్దాపురం నియోజకవర్గంలోని చంద్రమాంపల్లి, దివిలి మీదుగా, పిఠాపురం నియోజకవర్గంలోని విరవ వరకు కొనసాగింది.

Pages