S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/21/2020 - 05:09

న్యూఢిల్లీ: కొత్త బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ ప్రక్రియ సోమవారం సాంప్రదాయ హల్వా కార్యక్రమంతో ఢిల్లీలో మొదలైంది. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 1న సీతారామన్ తన బడ్జెట్‌ను ఆవిష్కరిస్తారు. బడ్జెట్‌కు ముందస్తుగా జరిగే కసరత్తులో భాగమే ఈ హల్వా ఉత్సవం.

01/21/2020 - 04:24

న్యూఢిల్లీ, జనవరి 20: అంతర్జాతీయంగా తన ఖ్యాతిని నిలబెట్టుకుంటున్న భారత్ వివిధ సంస్థలకు చెల్లింపుల విషయంలోనూ అదే ఉత్సాహాన్ని కనబరుస్తోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)కు 2020 సంవత్సరానికిగాను విరాళంగా చెల్లించాల్సిన 33 కోట్ల రూపాయలను ముందుగానే ఇచ్చేసిందని ఓ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

01/21/2020 - 04:22

ముంబయి, జనవరి 20: గత రెండురోజులుగా కొత్త రికార్డును నమోదు చేసుకుంటూ పెరుగుతూ వచ్చిన సెనె్సక్స్ సోమవారం ఒక్కసారిగా 416 పాయింట్లు పడిపోయింది. రిలయన్స్, కోటక్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో వీటి షేర్ల అమ్మకాలు విపరీతంగా సాగడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కోటక్ బ్యాంక్ షేరు విలువ ఏకంగా ఐదు శాతానికి పడిపోయింది.

01/20/2020 - 05:59

న్యూఢిల్లీ: కార్పొరేట్ కంపెనీల తాజాత్రైమాసిక ఫలితాలు, వచ్చే కేంద్ర బడ్జెట్‌లోప్రయోజనాలపై అంచనాలు ఈవారం స్టాక్ మార్కెట్ల తీరును ప్రభావితం చేస్తాయని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా కోటక్ మహీంద్రా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఫలితాలు ఈ వారం కీలకం కానున్నాయి. గత వారం బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ 345.65 పాయింట్లు (0.83 శాతం) లాభపడింది.

01/20/2020 - 05:14

ముంబయి, జనవరి 19: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఆదివారం జరిగిన ‘టాటా ముంబయి మారథాన్’ కార్యక్రమంలో వివిధ కార్పొరేట్ కంపెనీలకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు. వార్షికోత్సవంలా మారిన ఈ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. టాటా సన్ చైర్మన్ ఎన్.

01/20/2020 - 05:11

న్యూఢిల్లీ, జనవరి 19: గడచిన 2019లో ఇనె్వస్టర్లు దేశీయ ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో రూ. 75,000 కోట్లు మదుపు చేశారు. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 41 శాతం తక్కువ కావడం గమనార్హం. ప్రధానంగా దేశ ఆర్థికాభివృద్థి మందగమనం క్రమంలో మార్కెట్లు ఊగిసలాటకు గురికాడమే ఇందుకు కారణమని విశే్లషకులు భావిస్తున్నారు.

01/20/2020 - 05:10

న్యూఢిల్లీ, జనవరి 19: గడచిన 2019 డిసెంబర్ మాసంతో ముగిసిన మూడో త్రై మాసికంలో పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో రెం డంకెల వృద్ధితో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అగ్ర స్థానాన్ని ఆక్రమించింది. దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు 1400కు పైగా పెట్రోల్ పంపులున్నాయి.

01/19/2020 - 05:53

ముంబయి: గత వారం మాదిరిగానే ఈవారం కూడా భారత స్టాక్ మార్కెట్లు అస్థిరంగానే కొనసాగాయి. పలుమార్లు సూచీలు రికార్డు స్థాయికి ఎగిసినప్పటికీ, అదే ఒరవడి చివరి వరకూ నిలవలేదు. స్థూలంగా చూస్తే, లాభాల్లోనే ముగిసిన మార్కెట్లపై పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపాయి. ఈవారం మార్కెట్లను శాసించిన అంశాల్లో ప్రధానంగా అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్త కూడా ఒకటి.

01/19/2020 - 05:51

హైదరాబాద్, జనవరి 18: రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్‌లో ఇప్పటి వరకు 44 లక్షల టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాదికాలం గడిచిన సందర్భంగా శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన అధికారిక సమావేశంలో మాట్లాడారు.

01/19/2020 - 05:13

న్యూఢిల్లీ, జనవరి 18: దావోస్‌లో ఈనెల 20 నుంచి 24 వరకు జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనే భారత బృం దానికి కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నాయకత్వం వహిస్తారు. అదే సమయంలో, అక్కడే జరిగే ప్రపంచ వాణిజ్య సమాఖ్య (డబ్ల్యూటీఓ) కార్యవర్గ భేటీలోనూ ఆయన పాల్గొంటారు. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

Pages