S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/23/2020 - 05:02

హైదరాబాద్, జనవరి 22: డిజిటల్ సొమ్ము చెల్లింపుల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకెళుతోంది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడైనట్లు పే వరల్డ్ సంస్థ పేర్కొంది. ఈ వ్యవస్థ ద్వారా 200,897 మంది రిటైలర్లు నమోదు చేసుకున్నారు.

01/22/2020 - 23:20

ముంబయిలో బుధవారం ఆల్ట్రా జోన్ ప్రీమియం కార్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న టాటా మోటార్స్ ప్రతినిధులు. 5.29 లక్షల నుంచి ఈ కార్ల ధరలు మొదలవుతాయి.

01/22/2020 - 23:17

ముంబయి, జనవరి 22: నష్ట భయాలు వరుసగా మూడోరోజూ మదుపర్లను వెంటాడాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టాల బెడద కొనసాగింది. అంతర్జాతీయ ఏజెన్సీలు దేశ స్థూల వ్యవసాయోత్తి (జీడీపీ) వృద్ధిరేటును తగ్గించడం, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండడం వంటి అంశాలతోబాటు రాబోయే కేంద్ర బడ్జెట్‌పై అందరి నిశిత దృష్టీ కేంద్రీకృతం కావడమే ఇందుకు కారణాలు.

01/22/2020 - 23:16

న్యూఢిల్లీ, జనవరి 22: కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరిగే ఫిబ్రవరి 1వ తేదీ శనివారం స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయని, సాధారణ వాణిజ్య కార్యకలాపాలు సాగుతాయని బాంబే స్టాక్ ఎక్చేంజీ (బీఎస్‌ఈ) బుధవారం నాడొక ప్రకటనలో తెలిపింది. స్టాక్ మార్కెట్ల వాణిజ్య వారం సాధారణంగా శుక్రవారంతో ముగుస్తుంది. శని, ఆదివారాలు సెలవు దినాలు.

01/22/2020 - 23:15

ముంబయి, జనవరి 22: బాండ్ల జారీ ద్వారా రూ. 250 కోట్లు సమీకరించేందుకు నిర్ణయించినట్టు ఎడెల్వెయిస్ ఫైనాన్స్ అండ్ ఇనె్వస్ట్‌మెంట్స్ (ఈఎఫ్‌ఐఎల్) బుధవారం నాడిక్కడ తెలిపింది. ఇష్యూ బేస్ సైజు రూ. 125 కోట్లని తెలిపింది.

01/22/2020 - 06:11

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజైన మంగళవారం సైతం నష్టాల పాలయ్యాయి. నిరాశాజనక కార్పొరేట్ కంపెనీల మూడోత్రైమాసిక ఫలితాలతోబాటు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటును తగ్గించడం మదుపర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపాయి.

01/22/2020 - 01:44

హైదరాబాద్, జనవరి 21: పెట్టుబడులకు ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలోనే అద్భుతమైన వ్యాపార అవకాశాలు ఉండగా, ఇండి యా వరకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో అత్యంతమైన ప్రాంతం హైదరాబాద్ నగరమని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తార క రామారావు అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్‌లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.

01/21/2020 - 23:04

ముంబయి, జనవరి 21: ప్రస్తుతం అంతర్జాతీయ, జాతీయ మార్కెట్ల తీరుతోబాటు, దేశీయం గా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా బీమా కంపెనీల ప్రీమియం వసూళ్లు వచ్చే రెండు మూడేళ్ల వరకు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తాజా అధ్యయనం తేల్చింది. ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ ‘మూడీస్’ ఈమేరకు తన నివేదికను మంగళవారం నాడిక్కడ విడుదల చేసింది.

01/21/2020 - 23:03

న్యూఢిల్లీ, జనవరి 21: నివాస యోగ్య ఆస్తుల ధరల్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్ అంతర్జాతీయంగా 14వ ర్యాంకును దక్కించుకుంది. అలాగే ఈ తరహా విలువలో ఆగ్ర భాగాన నిలిచిన తొలి 20 నగరాల జాబితాలో భారత్‌లో కేవలం హైదరాబాద్‌కు మాత్రమే చోటుదక్కింది.

01/21/2020 - 23:02

న్యూఢిల్లీ, జనవరి 21: గడచిన 2019 డిసెంబర్ మాసంలో ప్యాసింజర్ వాహనాల రీటెయిల్ విక్రయాలు 9 శాతం తగ్గాయి. ఆ నెలలో మొత్తం 2,15,716 యూనిట్ల విక్రయాలు జరిగాయని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) మంగళవారం నాడిక్కడ వెల్లడించింది. 2018 డిసెంబర్‌లో 2,36,586 యూనిట్ల విక్రయాలు జరిగాయని, దానితో పోలిస్తే ఈ దఫా గణనీయ తగ్గుదల చోటుచేసుకుందని తెలిపింది.

Pages