S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/26/2018 - 23:14

న్యూఢిల్లీ, ఆగస్టు 26: బంగారం దిగుమతుల అంశంలో బ్యాంకులదే కీలక పాత్ర అని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం నామమాత్రంగా చాలా కొన్ని బ్యాంకులు మాత్రమే ఈ అంశంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయని, మరిన్ని బ్యాంకులు ముందుకు రావాలని ఒక ప్రకటలో కోరింది.

08/25/2018 - 23:22

ముంబయి, ఆగస్టు 25: పుత్తడి ధర బాగా పుంజుకుంది. స్థానిక నగల వ్యాపారుల నుంచి జోరుగా కొనుగోళ్లు జరగడంతో పాటు ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధర పెరగడం వల్ల బులియన్ మార్కెట్‌లో శనివారం పది గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి, రూ. 30,900కు చేరుకుంది. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ మేకర్ల నుంచి కొనుగోళ్లు పెరగడంతో కిలో వెండి ధర రూ. 400 పెరిగి, రూ. 38,250కి చేరుకుంది.

08/25/2018 - 23:21

ముంబయి, ఆగస్టు 25: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా అయిదో వారం బలపడ్డాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 303.92 పాయింట్లు పుంజుకొని, 38,251.80 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 86.35 పాయింట్లు పెరిగి, 11,557.10 పాయింట్ల వద్ద స్థిరపడింది.

08/25/2018 - 23:19

హైదరాబాద్, ఆగస్టు 25: కీర్తిలాల్స్ వజ్రాభరణాల మేళాను ప్రారంభించింది. ఈ మేళాను వచ్చే నెల 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కీర్తిలాల్స్ బిజినెస్ స్ట్రాటజీ డైరెక్టర్ సూరజ్ శాంత కుమార్ తెలిపారు. వివాహాల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వజ్రాల నెక్లెస్ మేళాను నిర్వహించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.

08/25/2018 - 23:18

విశాఖపట్నం, ఆగస్టు 25: ప్రభుత్వ రంగ బ్యాంకులకు రోజు రోజుకూ భారం పెరుగుతోంది. మొండి బకాయిలు పేరుకుపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ఈ బ్యాంకుల్లో రూ.9.5 లక్షల కోట్ల మేర బకాయిలు వసూలు కావాల్సి ఉందని ఆలిండియా బ్యాంకు ఎంప్లారుూస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీఎస్ రాంబాబు పేర్కొన్నారు.

08/25/2018 - 23:16

ముంబయి, ఆగస్టు 25: రూపాయి మార కం విలువ కోలుకుంది. అమెరికా మార్కెట్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకోవడంతో రూపా యి విలువ 24పైసల మేర పెరిగింది. ప్రస్తుతం ఒక డాలర్ విలువ భారత కరెన్సీలో రూ. 69.91 పైసలు. గత వారం నుంచి అమెరికా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఇటీవల కాలంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బాగా పడిపోయింది. గత వారం డాలర్ విలువ భారత కరెన్సీలో రూ.70.40 పైసలకు చేరింది.

08/25/2018 - 23:15

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఇనోవస్ ఎంటర్‌ప్రైజెస్ ఈజీఫోన్ సిరీస్‌లో ఇప్పుడు కేవలం చిన్నపిల్లలకు కోసం ప్రత్యేక ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఈ స్టార్ ఫోన్‌లో కేవలం కొన్ని నంబర్లు మాత్రమే సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే, తల్లిదండ్రులు, ఉపాధ్యయులు వంటి కొద్ది మంది నంబర్లకు పిల్లలు ఫోన్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా జీపీఎస్‌ను సెట్ చేసుకునే అవకాశం ఉంది.

08/25/2018 - 04:48

ముంబయి: వరుసగా మూడు సెషన్లలో సరికొత్త గరిష్ఠ స్థాయి రికార్డులు సృష్టించిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టపోయాయి. ప్రపంచ మార్కెట్లలో ఇనె్వస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడటం వల్ల మార్కెట్ కీలక సూచీలు పడిపోయాయి.

08/25/2018 - 00:38

న్యూఢిల్లీ, ఆగస్టు 24: రూ. 17వేల కోట్ల విలువ గల ఏడెనిమిది విద్యుత్ రంగ ప్రాజెక్టుల బ్యాంకు రుణాల సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్ డైరెక్టర్ అర్జిత్ బసు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. సుమారు 34 స్రెస్డ్ పవర్ ప్రాజెక్టులు ఉండగా, అవి చెల్లించాల్సిన మొత్తం రుణం రూ.

08/25/2018 - 00:36

న్యూఢిల్లీ, ఆగస్టు 24: మూడు వందల మిలియన్ డాలర్ల విలువ కలిగిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) బాండ్లు కలిగి ఉన్నవారికి నగదుతో పాటు తన విదేశీ అనుబంధ సంస్థ గ్లోబల్ క్లౌడ్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ (జీసీఎక్స్) బాండ్లను తిరిగి చెల్లించనున్నట్టు ఆర్‌కామ్ శుక్రవారం తెలిపింది.

Pages