S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/29/2018 - 01:06

న్యూఢిల్లీ, ఆగస్టు 28: బంగారానికి దేశంలో డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. విదేశీ మదుపరులతోపాటు, దేశీయ పెట్టుబడిదారులు కూడా బంగారం వైపే మొగ్గుచూపుతున్నారు. దీనికితోడు శ్రావణ మాసం కావడంతో పండుగలు, పెళ్లిళ్లతో దేశం మొత్తం కళకళలాడుతున్నది. మదుపురులు పెరగడం, ఆభరణాలకు డిమాండ్ పెరగడంతో, బంగారం ధర పరుగులు తీస్తున్నది.

08/29/2018 - 01:36

ముంబయి, ఆగస్టు 28: జాతీయ స్టాక్ మార్కెట్‌లో బుల్ దూకుడు కొనసాగుతున్నది. మంగళవారం కూడా లావాదేవీలు లాభాలతో మొదలయ్యాయి. సెనె్సక్స్ 202.52 పాయింట్లు పెరిగి, 38,896.63 పాయింట్ల వద్ద ముగిశాయి. విదేశీ మదుపరులు కూడా వివిధ కంపెనీల షేర్లపై ఆసక్తి ప్రదర్శించడంతో, బుల్ రన్ ఎలాంటి ఆటం కం లేకుండా దూకుడుగా ముందుకు దూసుకెళ్లింది.

08/29/2018 - 01:03

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ముడి ఇనుము ఉత్పత్తిలో భారత్ రెండో స్థానానికి చేరింది. ఈ మాసంలో ఉత్పత్తి 90 లక్షల టన్నులకు చేరుకుంది. చైనా 8 కోట్లా 12 లక్షల టన్నులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్‌కు రెండో స్థానం దక్కింది. టాప్-10లో చైనా, భారత్ తర్వాత మూడో స్థానంలో జపాన్ ఉంది. 84.20 లక్షల టన్నుల ఉక్కును జపాన్ ఉత్పత్తి చేస్తున్నది.

08/29/2018 - 01:38

ఢిల్లీ, ఆగస్టు 28: సులభంగా డబ్బులు పంపేందుకు వీలుగా గూగుల్ ప్రవేశపెట్టిన గూగుల్ పేమెంట్ సర్వీస్ తేజ్ పేరు మారింది. ఢిల్లీలో జరిగిన ‘గూగుల్ ఫర్ ఇండియా 2018’ కార్యక్రమంలో ‘గూగుల్ పే’ మార్చినట్లు గూగుల్ ప్రకటించింది. ఈ యాప్‌లో ఆన్‌లైన్ పేమెంట్లు చేసేందుకు వీలుగా ఆన్‌లైన్, ఇన్‌స్టోర్స్ ఆప్షన్లను కొత్తగా ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది.

08/29/2018 - 01:01

న్యూఢిల్లీ, ఆగస్టు 28: చత్తీస్‌గఢ్‌లోని జీఎంఆర్ ఇన్‌ఫ్రా పవర్ ప్లాంటును గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్ లిమిటెడ్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. చాలారోజులుగా ప్రతిపాదన దశలో ఉండగా, ఇది కొలిక్కి వచ్చినట్లు సమాచారం. చత్తీస్‌గఢ్‌లోని జీఎంఆర్ ఇన్‌ఫ్రాకు చెందిన 1,370 మెగావాట్ల పవర్‌ప్లాంటుపై భారీగా రుణభారం ఉండడంతో అప్పును ఈక్విటీ మూలధనంగా మార్చారు.

08/28/2018 - 13:47

ముంబయ: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 174, నిఫ్టీ 49 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 70.16గా ఉంది.

08/28/2018 - 18:29

న్యూఢిల్లీ: ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయ. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం నుంచి పెట్రోల్ ధర లీటర్‌పై 14 పైసలు, డీజిల్ ధర లీటర్‌పై 15 పైసలు పెరిగింది. విదేశాల నుంచి ముడిచమురు సరఫరా తగ్గటంతో ఈ ధరల పెంపు అనివార్యమైంది.

08/28/2018 - 18:26

ముంబయి, ఆగస్టు 27: అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల పవనాలు, కొనుగోలుదారుల మద్దతు లభించడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం దూసుకుపోయాయి. బుల్ పరుగులతో సెనె్సక్స్, నిఫ్టీ కొత్త శిఖరాలకు చేరాయ. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లో సెనె్సక్స్ 442 పాయింట్లు లాభపడి, 38,694.11 పాయింట్ల వద్ద, నిఫ్టీకి 134.85 పాయింట్ల లాభంతో 11,691.95 పాయింట్ల వద్ద ముగిసింది.

08/28/2018 - 00:38

న్యూఢిల్లీ: కెన్యాతో వాణిజ్యపరమైన స్నేహ సంబంధాలను మెరుగుపరచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. కెన్యాలో ప్రాధాన్యతా రంగాలను గుర్తించాలని, తద్వారా ఆ దేశంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలకు మార్గం సుగమమవుతుందని తెలిపారు.

08/28/2018 - 00:06

న్యూఢిల్లీ, ఆగస్టు 27: గత ఏడాది డిసెంబర్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలియన్స్ జియో లేఫోకామ్ (ఆర్‌జియో)కు 3,000 కోట్ల రూపాయల విలువైన ఫైబర్ వౌలిక సదుపాయాలు, ఆస్తుల అమ్మకం ప్రక్రియను పూర్తి చేసినట్టు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) ప్రకటించింది. ఇందులో భాగంగా 1,78,000 కిలోమీటర్ల ఫైబర్ స్టాండ్ ఆర్‌కామ్ నుంచి జియోకు బదిలీ అయింది.

Pages