S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/28/2018 - 00:13

న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు, నష్టాలకు ఫుట్‌స్టాప్ పెట్టాలని చాలాకాలంగా యోచిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆ దిశగా చర్యలు మొదలుపెట్టాయి. నష్టాల్లో నడుస్తున్న కొన్ని విదేశీ శాఖలను మూసివేయాలని సోమవారం తీర్మానించాయి. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన శాఖలు విదేశాల్లో ఉండగా, వాటిలో గత ఆర్థిక సంవత్సరంలో 41 శాఖలు భారీ నష్టాలను చవిచూశాయి.

08/28/2018 - 00:04

ముంబయి, ఆగస్టు 27: డాలర్ మారకపు విలువతో పోలిస్తే దారుణంగా పడిపోతున్న రూపాయి ఊపిరి పీల్చుకుంది. మూడు పైసల మేర బలపడింది. 69.91 రూపాయలుగా ఉన్న మారకపు విలువ సోమవారం 69.88 రూపాయలకు చేరింది. దేశీయ ద్రవ్యం తీవ్ర ఒత్తిళ్ల మధ్య 69.65 నుంచి 70.00 మధ్య ఊగిసలాడి, 69.88 వద్ద స్థిరపడింది. సెనె్సక్స్, నిఫ్టీ పరుగులు పెడుతున్న నేపథ్యంలో రూపాయి క్రమంగా కోలుకుంటున్నది.

08/28/2018 - 00:03

న్యూఢిల్లీ, ఆగస్టు 27: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయ ఉత్పత్తులు (జీడీపీ) లోటు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భార త బ్యాంకింగ్ దిగ్గజయం ఎస్‌బీఐ ఒక నివేదికలో తెలిపింది. దిగుమ తుల్లో తగ్గుదల, ఎగుమతుల పెరుగుదల వంటి కారణాలతో జీడీపీ లోటు 2.8 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. ఇదే సమయంలో వాణిజ్యపరమైన అస్థిరత కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఎస్‌బీఐ తన నివేదికలో పేర్కొంది.

08/27/2018 - 13:34

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 343 పాయింట్ల లాభంతో 38,686 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 125 పాయింట్ల లాభంతో 11,681వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.70.04గా ఉంది.

08/27/2018 - 13:29

ముంబయి: అమరావతి బాండ్లు ఈరోజు బీఎస్‌ఈ సెన్సెక్స్ లో నమోదయ్యాయి. సీఎం చంద్రబాబు గంట కొట్టి వాటి లిస్టింగ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌ఈ సీఈవో, ఎండీ ఆశిష్‌కుమార్‌, ఏపీ మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తదిరులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచంలో ఐదో అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం అని అన్నారు.

08/27/2018 - 05:07

ముంబయి: భారీ మొత్తాల్లో రుణాలు తీసుకొని, సకాలంలో చెల్లించకుండా ఎగవేస్తున్న సుమారు 70 అతిపెద్ద కంపెనీలపై తుది నిర్ణయం తీసుకోవడానికి గడువు ముగింపు దశకు చేరుకుంది. దీనితో తుది నిర్ణయం కోసం బ్యాంకులు మల్లగుల్లాలు పడుతున్నాయి. రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన గడువు సోమవారం నాటితో ముగియనుండడంతో, రాత్రికిరాత్రి చర్చలు పూర్తి చేసి, తెల్లవారిన తర్వాత నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది.

08/27/2018 - 01:02

విజయవాడ: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో సోమవారం నిర్వహించే అమరావతి బాండ్ల లిస్టింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. ఆదివారం రాత్రి ఆయన ముంబై బయలుదేరి వెళ్లారు. ఉ. 9.05 గంటలకు జరిగే బాండ్ల లిస్టింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముంబై నగరంలో చంద్రబాబు పర్యటించనున్నారు.

08/26/2018 - 23:18

న్యూఢిల్లీ, ఆగస్టు 26: దేశీయ క్యాపిటల్ మార్కెట్లలోకి విదేశీ ఇనె్వస్టర్ల పెట్టుబడుల రాక ఈ నెలలో ఆశాజనకంగా ఉంది. విదేశీ మదుపరులు ఈ నెలలో ఇప్పటి వరకు రూ. 6,700 కోట్లకు పైగా నిధులను భారత క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టారు.

08/26/2018 - 23:17

న్యూఢిల్లీ, ఆగస్టు 26: ఏప్రిల్-జూన్ త్రైమాసిక కాలంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా. అమెరికా-చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌పై తమ ప్రభావాన్ని కొనసాగిస్తాయని నిపుణులు పేర్కొన్నారు.

08/26/2018 - 23:16

న్యూఢిల్లీ, ఆగస్టు 26: పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పరస్పరం విబేధించారు. ఈ కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ చైర్మన్‌గా సీనియర్ ఎంపీ వీరప్ప మొయి లీ వ్యవహరించారు. ఈ కమిటీలో 31 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు.

Pages