S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/28/2017 - 00:35

హైదరాబాద్, నవంబర్ 27: పారిశ్రామికవాడల ప్రాంతాల్లో లోకల్ అథారిటీ (ఐఏఎల్‌ఏ) పరిథిలోని కీలక సమస్యల పరిష్కారానికి నాలుగు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, వౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టిఎస్-ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు.

11/28/2017 - 00:35

న్యూఢిల్లీ, నవంబర్ 27: దేశంలో రిజిస్టర్ అయిన కంపెనీల్లో దాదాపు మూడో వంతు కంపెనీలు పనిచేయడం లేదు. తాజాగా విడుదలైన అధికారిక గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. డొల్ల కంపెనీలపై గత కొంత కాలం నుంచి కఠినమైన చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ మాసాంతం వరకు ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ గణాంకాలను వెల్లడించింది.

11/28/2017 - 00:34

న్యూఢిల్లీ, నవంబర్ 27: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ స్కోడా ఆటో ఇండియా జనవరి 1వ తేదీ నుంచి తమ కార్ల ధరలను 2 నుంచి 3 శాతం మేరకు పెంచనున్నట్లు శుక్రవారం వెల్లడించింది. మార్కెట్లో మారుతున్న పరిస్థితులతో పాటు వివిధ ఆర్థిక అంశాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయని, దీంతో తమ అన్ని మోడల్ కార్ల ధరలను 2 నుంచి 3 శాతం మేరకు పెంచబోతున్నామని ఆ సంస్థ స్పష్టం చేసింది.

11/28/2017 - 00:34

న్యూఢిల్లీ, నవంబర్ 27: దేశంలోని కొన్ని యూరియా కర్మాగారాల్లో ప్రస్తుతం ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యూరియా ఉత్పత్తి 3 లక్షల టన్నుల మేరకు తగ్గి 24.1 మిలియన్ టన్నులకు పడిపోయే అవకాశం ఉంది. ఎరువుల శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం దేశంలో 24.4 మిలియన్ టన్నుల యూరియా ఉత్పత్తి జరిగింది.

11/27/2017 - 01:39

న్యూఢిల్లీ, నవంబర్ 26: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించవచ్చని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దేశంలోని దాదాపు 4.5 కోట్ల మంది పీఎఫ్ చందాదారుల డిపాజిట్లకు ఈపీఎఫ్‌ఓ గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 8.65 శాతం వడ్డీ చెల్లించిన విషయం తెలిసిందే.

11/27/2017 - 01:38

ముంబయి, నవంబర్ 26: ఈ వారమంతా బుల్ రన్‌తో సాగిన స్టాక్ మార్కెట్లు వచ్చే వారం ఏ మలుపును తీసుకోబోతున్నాయన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంది. మూడీస్ రేటింగ్ భారత జిడిపి వృద్ధిరేటుకు ఊతాన్నిస్తే, ఎస్‌అండ్‌పీ రేటింగ్ మాత్రం యథాతథంగానే ఉన్న నేపథ్యంలో వచ్చే వారం ఇనె్వస్టర్లు వేయబోయే అడుగులు ఎలా ఉంటాయన్నది ఆసక్తిని కలిగిస్తోంది.

11/27/2017 - 01:37

యైటింక్లయిన్‌కాలనీ, నవంబర్ 26: బొగ్గు ఉత్పత్తికై నిర్విరామంగా ఓబీ (మట్టి) పనులు చేపడుతూ సింగరేణి చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలుస్తున్న పృథ్వీభంజన్ డ్రాగ్‌లైన్ 31 వసంతాలు పూర్తి చేసుకొని నేటితో 32వ యేట అడుగెడుతోంది. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఈ డ్రాగ్‌లైన్‌ను 1986 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రారంభించారు.

11/27/2017 - 01:35

న్యూఢిల్లీ, నవంబర్ 26: దేశంలో పాల ఉత్పత్తి గత మూడేళ్లలో దాదాపు 19 శాతం పెరిగి 163.6 మిలియన్ టన్నులకు చేరుకుందని, దీంతో పాడి రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ ఆదివారం వెల్లడించారు.

11/25/2017 - 00:55

సూర్యాపేట, నవంబర్ 24: పేదలు మొదలు అన్ని వర్గాల ప్రజలు ప్రతినిత్యం వంటలకు ఉపయోగించే వంటనూనెల ధరలు మండిపోతున్నాయి. పదిరోజుల క్రితం వరకు నిలకడగా ఉన్న వంటనూనెల ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అన్నిరకాల మంచినూనెల ధరలు లీటర్‌కు పది రూపాయ నుండి పదిహేను రూపాయల వరకు పెరిగిపోయాయి.

11/25/2017 - 00:53

న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక, సంస్థాగత సంస్కరణలను కొనియాడుతూ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ కొద్ది రోజుల క్రితం భారత క్రెడిట్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయగా, ఇప్పుడు మరో రేటింగ్ సంస్థ ఎస్‌అండ్‌పీ మోదీ సర్కారుకు షాక్ ఇచ్చింది. భారత సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను ఎస్‌అండ్‌పీ అప్‌గ్రేడ్ చేయలేదు.

Pages