S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/04/2017 - 00:59

నిజామాబాద్, డిసెంబర్ 3: బీడీ కట్టలపై 80 శాతం వరకు క్యాన్సర్ గుర్తు బొమ్మలను ముద్రించాలనే ఆంక్షలు...నెలల తరబడి వెంటాడిన పెద్ద నోట్ల రద్దు ప్రభావం...జీఎస్‌టీ పరిధి నుండి అసలేమాత్రం మినహాయింపు ఇవ్వకపోవడం వంటి కారణాలతో బీడీ పరిశ్రమ అంతకంతకూ కుచించుకుపోయి కార్మికులకు ఉపాధి సన్నగిల్లుతోంది. ఇప్పటికే పై కారణాలతో అనేక చిన్న కంపెనీలు మూతబడగా, పెద్ద కంపెనీలు సైతం పని దినాలను తగ్గించివేశాయి.

12/04/2017 - 00:59

ఆదిలాబాద్,డిసెంబర్ 3: ఈ ఏడాది పత్తి వ్యాపారంలో భారత కాటన్ కార్పొరేషన్ (సీసీఐ) వెనకడుగు వేయడంతో వ్యాపారులదే ఆధిపత్యం కొనసాగుతోంది. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.4320 ప్రకటించగా ఆదిలాబాద్, బోథ్, భైంసా మార్కెట్‌లో వ్యాపారులు కనీస మద్దతు ధరకంటే అధికంగా ధర చెల్లించి కొనుగోళ్ళు చేపట్టడంతో వ్యాపార రంగంలో సీసీఐ మొహం చాటేస్తోంది.

12/03/2017 - 00:54

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: భారత్‌లో రెండో అతి పెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ) సంస్థ అయిన ఇన్ఫోసిస్ ప్రధాన కార్యనిర్వహణ అధికారి (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్‌గా సలీల్ ఎస్ పరేఖ్ నియమితులయ్యారు. పరేఖ్ వచ్చే సంవత్సరం జనవరి 2వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారని ఇన్ఫోసిస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘పరేఖ్‌కు ఐటీ సేవల పరిశ్రమలో సుమారు మూడు దశాబ్దాల గ్లోబల్ ఎక్స్‌పీరియెన్స్ ఉంది.

12/03/2017 - 00:53

సూరత్, డిసెంబర్ 2: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 6.3 శాతానికి పెరగడాన్ని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్వాగతించారు. అయితే క్రితం అయిదు త్రైమాసికాలలో దిగజారిన జీడీపీ తిరిగి పురోగమన పథం పట్టిందని చెప్పడం తొందరపాటే అవుతుందని ఆయన పేర్కొన్నారు.

12/03/2017 - 00:51

విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 2: ప్రోడక్ట్ మీది...మార్కెటింగ్ నాది..యువత తలచుకుంటే ఏదైనా సాధ్యమే అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. నగరంలోని ఏ కనె్వన్షన్‌లో వారంరోజులుగా జరుగుతున్న మెగా జాబ్ ఫెయిర్ వీక్ ముగింపు కార్యక్రమంలో శనివారం ముఖ్యఅతిధిగా పాల్గొన్న చంద్రబాబునాయుడు మాట్లాడుతూ విద్యార్థుల ఆలోచనలు ప్రపంచాన్ని మార్చే విధంగా ఉండాలన్నారు ఐటీ ద్వారా ఏదైనా సాధ్యమేనన్నారు.

12/03/2017 - 00:48

ముంబయి, డిసెంబర్ 2: దేశీయ మార్కెట్లు ఈ వారంలో పతనమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 846.30 పాయింట్లు పడిపోయి, 32,832.94 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 10, 200 పాయింట్ల మైలురాయికన్నా దిగువకు దిగజారి, 10,121.80 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ వారమంతా మార్కెట్లు ఒడిదుడుకుల్లోనే సాగాయి.

12/03/2017 - 00:45

విశాఖపట్నం, డిసెంబర్ 2: వాణిజ్య బ్యాంకులకు దీటుగా వ్యాపార లక్ష్యాలు సాధించడం కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) వ్యూహాత్మక ప్రణాళికలు రచిస్తోంది. ఇందులోభాగంగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూనే వార్షిక లక్ష్యాల సాధన కోసం సరికొత్త తరహాలో ‘మొబైల్ వ్యాన్’తో ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.

12/02/2017 - 00:10

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వచ్చే అయిదేళ్లలో రెండింతలు పెరిగి అయిదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, 2030 నాటికి పది ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. 21వ శతాబ్దం మధ్య నాటికి జీడీపీలో భారత్ చైనాను మించిపోతుందని ఆయన అన్నారు.

12/02/2017 - 00:09

ముంబయి, డిసెంబర్ 1: భారీగా పెరుగుతున్న ద్రవ్య లోటుపై మదుపరులలో నెలకొన్న భయాందోళనలను తొలగించడంలో రెండో త్రైమాసికంలో పుంజుకున్న స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు విఫలమయ్యాయి. దీంతో దేశీయ మార్కెట్లలో వరుసగా నాలుగో రోజు శుక్రవారం ప్రధాన సూచీలు పడిపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 316 పాయింట్లు పతనమయి, 33వేల మైలురాయికి దిగువన ముగిసింది.

12/02/2017 - 00:06

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ఆసియాలోని అత్యంత సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ జేబులో నగదు లేదా క్రెడిట్ కార్డులు ఉంటాయా? ఈ ప్రశ్న ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. కాని, తాను జేబులో ఎప్పుడూ నగదు కాని, క్రెడిట్ కార్డులు కాని పెట్టుకోనని ఆయన స్వయంగా వెల్లడించారు.

Pages