S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/24/2017 - 00:48

విశాఖపట్నం, నవంబర్ 23: వౌలిక వసతులు, పరిశోధనలను అభివృద్ధి చేస్తూ బయో మాన్యూఫ్యాక్చరింగ్ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దుతున్నామని కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్ జోషి అన్నారు.

11/24/2017 - 00:46

దేవరపల్లి, నవంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం వౌలిక సదుపాయాలు కల్పిస్తే వంద కోట్ల రూపాయల వ్యయంతో టైల్స్ పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని గుజరాత్‌కు చెందిన స్వస్తిక్ సిలికాన్ లిమిటెడ్ సీఈవో యు రామ్మోహనరావు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో గురువారం టైల్స్ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశంలోని ఐదు ప్రముఖ టైల్స్ ఫ్యాక్టరీల్లో తమది ఒకటన్నారు.

11/24/2017 - 00:45

హైదరాబాద్, నవంబర్ 23: శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ జీనియస్ అస్యూర్డ్ బెనిఫిట్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. చిన్నారుల విద్యావసరాలు తీర్చేరీతిలో ఈ కొత్త ప్లాన్‌ను అమల్లోకి తెచ్చినట్లు ఆ సంస్థ ఎండి కాస్పారస్ క్రోమ్‌హౌట్ తెలిపారు.

11/24/2017 - 00:44

విజయవాడ, నవంబర్ 23: కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక విధానాలు దేశంలో సహకార రంగంలోని అర్బన్ బ్యాంక్‌ల మనుగడకే సవాళ్లు విసురుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటున్న సహకార బ్యాంక్‌లను ఏదోవిధంగా దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

11/23/2017 - 00:42

ముంబయి, నవంబర్ 22: దేశీయ మార్కెట్లు వరుసగా అయిదో రోజు బుధవారమూ పుంజుకున్నాయి. ఆసియా మార్కెట్లలో వచ్చిన ర్యాలీకి తోడు అమెరికా మార్కెట్లు రికార్డు స్థాయిలో ముగియడంతో దేశీయ మార్కెట్లలో మదుపరులు బుధవారం ఉత్సాహంతో కొనుగోళ్లకు ఎగబడ్డారు. దీంతో కీలక సూచీలు పైకి ఎగబాకాయి.

11/23/2017 - 00:40

రాజమహేంద్రవరం, నవంబర్ 22: గత ప్రభుత్వం ఏవైతే తప్పిదాలు చేసిందో అవే తప్పిదాలు పునరావృతమైనట్టుగా తాజాగా గృహ నిర్మాణంలో జారీ అయిన జీవోలను బట్టి తెలుస్తోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, దాదాపు రూ.4500 కోట్ల మేర కుంభకోణం చోటుచేసుకుందని అధికార టిడిపి ఆరోపిస్తూ థర్డ్ పార్టీ ఎంక్వైరీలో తప్పులను బయటపెట్టింది.

11/23/2017 - 00:39

గుంటూరు, నవంబర్ 22: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, విదేశీ టెక్నాలజీతో చేపట్టామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంపై ఎమ్మెల్యేల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. బుధవారం పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ కాఫర్‌డాంకు అనుమతి మంజూరుకాలేదని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు.

11/23/2017 - 00:39

ముంబయి, నవంబర్ 22: ఈ సంవత్సరం ఏప్రిల్- అక్టోబర్ మధ్య కాలంలో దేశ వాణిజ్య లోటు భారీగా పెరిగిపోయింది. నిరుడు ఇదే కాలంతో పోలిస్తే వాణిజ్య లోటు సుమారు 60 శాతం పెరిగి, 88 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఎగుమతుల వృద్ధి రేటు బలహీనపడి, దిగుమతులు భారీగా పెరగడం వల్లనే వాణిజ్య లోటు ఇంత భారీగా పెరిగిందని ఒక నివేదిక తెలిపింది. ‘్భరత వాణిజ్య లోటు విపరీతంగా పెరిగి పోవడానికి రెండు కారణాలు ఉన్నాయి.

11/23/2017 - 00:38

విజయవాడ, నవంబర్ 22: వ్యవసాయం, ఆహార శుద్ధి, పరికరాల లీజింగ్, విమానాశ్రయాల అభివృద్ధి, విద్యుత్ వాహనాలు, వాహనాల బ్యాటరీ ఉత్పత్త తదితర రంగాలపై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని మిత్సుబిషి కార్పొరేషన్ ఇండియా సీఎండీ ఇషుకే సుజుకి చెప్పారు.

11/23/2017 - 00:35

విజయవాడ, నవంబర్ 22: రాష్ట్రంలో 50 ఏళ్లు దాటిన చేనేత కార్మికులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని, అందుకు వారు తక్షణం దరఖాస్తులు పెట్టుకోవచ్చునని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. ఖాళీ స్థలం అందుబాటులో లేనివారికోసం మూడు లక్షలు అంచనా వ్యయంతో హౌస్‌కం వర్క్‌షెడ్ నిర్మించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనగా తెలిపారు.

Pages