S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/08/2016 - 05:47

ముంబయి, డిసెంబర్ 7: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అందరి అంచనాలను తలకిందులు చేసింది. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఇక్కడ నిర్వహించిన ద్రవ్యసమీక్షలో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల జోలికి వెళ్లని ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్.. నగదు నిల్వల నిష్పత్తినీ ముట్టుకోలేదు. సెప్టెంబర్‌లో రఘురామ్ రాజన్ నుంచి ఆర్‌బిఐ పగ్గాలు అందుకున్న పటేల్..

12/08/2016 - 05:43

ముంబయి, డిసెంబర్ 7: పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తొందరపాటుగా తీసుకున్నది కాదని, అన్నివిధాల ఆలోచించి, సమగ్ర సంప్రదింపుల తర్వాతే తీసుకున్నదని ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులు, ఎటిఎమ్‌ల వద్ద ప్రజలు పడుతున్న కష్టాలు, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల మధ్య పటేల్ పైవిధంగా వివరణ ఇచ్చారు.

12/08/2016 - 05:42

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: పశ్చిమ తీరంలో 30 బిలియన్ డాలర్ల వ్యయంతో దేశంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్)లు బుధవారం ఓ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

12/08/2016 - 05:41

ముంబయి, డిసెంబర్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉన్న నేపథ్యంలో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. నిజానికి ఉదయం ఆరంభంలో లాభాల్లో కదలాడిన సూచీలు.. ఆర్‌బిఐ సమీక్షలో నిర్ణయాలు వెలువడుతున్నకొద్దీ నష్టాల్లోకి జారుకున్నాయి.

12/08/2016 - 05:41

హైదరాబాద్, డిసెంబర్ 7: స్టార్టప్ సంస్థల ఏర్పాటు ఔత్సాహికులకు జెఎన్‌టియు హైదరాబాద్ ప్రత్యేక శిక్షణ అందిస్తోందని ఇడిసి సమన్వయకర్త డాక్టర్ ఎం ఆషారాణి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు జెఎన్‌టియు హైదరాబాద్ వెబ్‌సైట్‌లో వివరాలు పొందవచ్చని చెప్పారు.

12/07/2016 - 00:39

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో మూడో అతిపెద్ద బ్యాంకైన యాక్సిస్ బ్యాంక్.. అక్రమాలకు పాల్పడిన 19 మంది అధికారులను తొలగించింది. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీకి చెందిన ఇద్దరు యాక్సిస్ బ్యాంక్ మేనేజర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు కూడా చేసింది.

12/07/2016 - 00:37

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో 130 కోట్ల రూపాయల విలువైన నగదు, నగలను స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయ పన్ను శాఖ మంగళవారం తెలిపింది. అలాగే పన్ను చెల్లింపుదారుల ద్వారా దాదాపు 2,000 కోట్ల రూపాయల అప్రకటిత ఆదాయాన్ని అందుకున్నట్లు కూడా చెప్పింది.

12/07/2016 - 00:35

ముంబయి, డిసెంబర్ 6: కీలక వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పావు శాతం తగ్గించవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. బుధవారం ఆర్‌బిఐ ద్రవ్యసమీక్ష నిర్వహించనుండగా, గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎమ్‌పిసి) 0.25 శాతం వడ్డీరేట్ల తగ్గింపునకు సిఫార్సు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

12/07/2016 - 00:33

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి జె జయలలిత మృతిపట్ల భారతీయ వ్యాపార, పారిశ్రామిక రంగం తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ఆమె పాలనలో తమిళనాడు పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టిందని సిఐఐ అధ్యక్షుడు నౌషద్ ఫోర్బ్స్ కొనియాడారు. విజన్ 2023తో ముందుకెళ్తున్న జయలలిత మరణం.. ఆ రాష్ట్ర అభివృద్ధికేగాక, పారిశ్రామిక రంగానికీ తీరనిలోటు అని అన్నారు.

12/07/2016 - 00:31

ముంబయి, డిసెంబర్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 43.66 పాయింట్లు పెరిగి 26,392.76 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 14.40 పాయింట్లు అందుకుని 8,143.15 వద్ద నిలిచింది.

Pages