S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

12/05/2016 - 23:27

‘గనుల సామ్రాజ్యం’ అధిపతి గాలి జనార్దనరెడ్డి తన కుమార్తె పెళ్లికోసం ఖర్చుచేసిన డబ్బు అక్షరాలా ఆరువందల యాభై కోట్లు. కర్నాటక సిఎం సిద్ధరామయ్య చేతి గడియారం ఖరీదు ఎనభై లక్షలు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ నాలుగు కోట్ల విలువైన కారులో వచ్చి నాలుగువేల రూపాయల కోసం పార్లమెంటు స్ట్రీట్‌లోని బ్యాంక్‌వద్ద ‘క్యూ’లో నిలబడ్డాడు... ఈ సన్నివేశాలన్నీ దేనిని తెలియజేస్తున్నాయి?

12/04/2016 - 22:43

తమ దుర్మార్గాల్ని కప్పిపుచ్చుకోవాలంటే, ఎదుటివారిపై బురదజల్లి నిరంకుశుడని, నియంతని, నరహంతకుడని ప్రచారం చేస్తే చాలు- ఉన్న ఫళంగా మానవీయతగల మంచివారుగా మారిపోవచ్చు! ఇలాంటి విష ప్రచారంతోనే సద్దాంను, గఢాఫీని చంపిన అమెరికా హ్యూగ్ చావెజ్‌ను రోగగ్రస్తుడిగా మార్చి చంపింది. ఆరు దశాబ్దాలుగా క్యూబా పాలకులపై ఇలాంటి ప్రచారమే సాగిస్తున్నది కూడా! అమెరికాకు క్యూబా 90 కి.మీ.

12/03/2016 - 23:59

‘నన్ను అన్యాయం చేశావు కదూ? పైన దేవుడున్నాడు.. అన్నీ చూస్తుంటాడు’- స్కూల్లో చదువుకునే రోజుల్లో ఎవరైనా మోసం చేస్తే వెంటనే బాధిత బాలుడి నుంచి వచ్చే మాట ఇది! అప్పుడు లోకజ్ఞానం లేక, అమాయకంగా బతికే చిన్నతనపు ఊహల్లో చెప్పే మాటలవి. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా దాదాపు ఊహతెలియని పిల్లాడి మాటల మాదిరిగానే కనిపిస్తున్నాయి. ‘దేవుడు కరుణిస్తే వచ్చే ఏడాది మనం అధికారంలోకి వస్తాం.

12/02/2016 - 22:54

కాంగ్రెస్ హయాంలో విశృంఖలంగా పెరిగిన అవినీతికి వ్యతిరేకంగా 2011లో ఓ వైపు అన్నాహజారే నేతృత్వంలో, మరోవైపు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో భారీగా జరిగిన ఉద్యమాలతో ప్రజలు ఎంతగానో మమేకం అయ్యారు. ప్రజలు ఎవరికి తోచిన రీతిలో వారు అవినీతికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు, సదస్సులు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు.

12/01/2016 - 23:08

ఇటీవల రోమ్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ స్టడీస్’కు చెందిన ఇవాప్ఫోస్టల్ అనే గాంధేయవాది ‘బిట్వీన్ ఎథిక్స్ అండ్ పాలిటిక్స్: గాంధీ టుడే’ (రాజకీయాలకు, నైతికతకు మధ్య: ఈనాడు గాంధీ) అనే వ్యాస సంకలనాన్ని ప్రచురించారు. ప్రపంచంలోని ప్రఖ్యాత మేధావుల వ్యాసాలు ఇందులో వున్నాయి.

12/01/2016 - 05:57

‘ఆ ర్గనైజ్డ్ లూట్, లీగలైజ్డ్ ప్లండర్’ అన్న ఆంగ్ల పదజాలాన్ని మాజీ ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్ నవంబర్ ఇరవై నాలుగవ తేదీన రాజ్యసభలో ప్రయోగించాడు! ఈ పదజాలాన్ని ఇలా మరోసారి ఆయన ప్రయోగించడానికి అవకాశం కల్పించిన పరిణామం కేంద్ర ప్రభుత్వం పెద్ద కరెన్సీ నోట్లను రద్దుచేయడం.. ‘ఆర్గనైజ్డ్ లూట్’అని అంటే గత్యం వ్యవస్థీకృతతం కావడం ‘లీగలైజ్డ్ ప్లండర్’ అని అంటే శాసనబద్ధంగా కొల్లగొట్టడం!

11/29/2016 - 23:32

తిరుపతి నారాయణుని వద్దకు సిపిఐ నారాయణుడు వెళ్లటం ఒకింత విమర్శకు, అంతకుమించి ఒక సీరియస్ చర్చకు దారితీయవచ్చుననే ఆశాభావం కొద్దిరోజులపాటు కలిగింది. అయితే, ఎలాంటి చర్చ జరగకపోవటం ఆశ్చర్యకరంగా ఉంది. మరికొంత ఆలోచించిన మీదట ఇందులో ఆశ్చర్యపడాల్సింది బహుశా ఏమీ లేదనేమోననిపిస్తోంది. ఇవన్నీ ఒక విధంగా ఈ దశకు సంబంధించిన సహజ స్థితులు కావచ్చు.

11/29/2016 - 06:59

‘కలలు కనండి’ అని దివంగత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం విద్యార్థులకు సలహా ఇచ్చినట్టు, ఇపుడు ప్రధాని నరేంద్ర మోదీ ‘డిజిటల్ కలలు కనండి’ అంటూ జాతికి సందేశం ఇస్తున్నారు. డిజిటల్ వ్యవస్థ ప్రపంచ దేశాలకు కొత్తేమీ కాదు. అమెరికా, ఐరోపా దేశాల్లో జేబులో డబ్బు పెట్టుకోకుండానే మొత్తం లావాదేవీలు ఆన్‌లైన్ మీదనే సాగిపోతాయి.

11/28/2016 - 08:14

రెండు వేల రూపాయల కొత్త నోటు కూడా చెలామణి కాని అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. పది, ఇరవై, ఏభై, వంద నోట్లను అధిక సంఖ్యలో ముద్రించినా చిల్లర కొరత లేకుండా పోయేది. రోజువారి కొనుగోళ్లు సజావుగా సాగేవి. పౌరజీవనం స్తంభించేది కాదు. చేతిలో డబ్బుండి కూడా వస్తువుల్ని కొనలేక, ప్రయాణాలు చేయలేక, చెల్లింపులు జరక్క జనం పడుతున్న ఇబ్బంది యుద్ధ కాలాన్ని తలపిస్తున్నాయి.

11/27/2016 - 07:23

పాలకుల ఆలోచనలు, వారి అంచనాలు ఎప్పుడూ అతిగానే ఉంటాయి. తమకు నచ్చింది అందరికీ నచ్చితీరుతుందన్నది వారి భావన. కానీ, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వారి నిర్ణయాలు జనాలకు అప్రియంగా కనిపిస్తుంటాయి. అయినా తమ ధోరణి మార్చుకోవడానికి సిద్ధపడని పాలకులు- ‘సర్వత్రా తమకు సానుకూలత వ్యక్తమవుతోందం’టూ చేతిలో ఉన్న మీడియా భజంత్రీలతో డప్పులు కొట్టిస్తుంటారు. ఆ డప్పుల మోత మర్మమేమిటో సామాన్యుడికి ఎరుకే.

Pages