S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/31/2017 - 22:43

భారతీయులమైన మనం ఉగాది పండగ చేసుకుంటున్నా, జనవరి ఒకటిన కొత్త గ్రేగోరియన్ క్యాలెండర్ ప్రారంభంరోజు ‘హ్యాపీ న్యూ ఇయర్’ జరుపుకోవడం దశాబ్దాలుగా పాటిస్తూనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో కోట్లాది మంది ప్రజలు జనవరి 1 వ తేదీని కొత్తసంవత్సరంగా జరుపుకుంటున్నారు. సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, ఇరాన్‌తో సహా. సౌదీ అరేబియాలో కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధం విధించారు.

12/31/2017 - 00:30

భారత రాజ్యాంగం ప్రియాంబుల్‌లో ఇండియా దటీస్ భారత్ అని ఉంది. మరి ఈ ‘హిందూ’ శబ్దం ఎక్కడిది? భారతదేశానికి మొదట ‘అజనాభము’ అనే పేరు ఉండేది. దీనికి మేక - బ్రహ్మ దేవుడు అని సామాన్యార్థాలు. భూగోళానికి కేంద్ర నాభి అని విశేషార్థం. భూమి తనకు తెలియని కన్పడని ఒక ఇరుసు మీద తిరుగుతున్నది దానికి నాభి (నేమి) కేంద్ర బిందువు ఏది?

12/30/2017 - 00:59

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మిలటరీ కార్యక్రమాల్లో దిట్టగా పేరొందిన జినుగు నరసింహారెడ్డి అలియాస్ జంపన్న తెలంగాణ పోలీసుల ముందు తన భార్య రజితతో లొంగిపోయారు. ఇది పెద్ద పరిణామం. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఏదో మేర మావోయిస్టు ఉద్యమాన్ని పునర్‌నిర్మించేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో ఈ లొంగుబాటు ఆ పార్టీకి పెద్దదెబ్బ, కోలుకోలేని శరాఘాతం.

12/29/2017 - 01:46

ప్రపంచ తెలుగు మహాసభలకు తెలుగునేల మరోసారి వేదికగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నాలుగేళ్ల కిందట తిరుపతిలో ఈ మహాసభలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈసారి హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను అద్భుతంగా నిర్వహించింది. తెలుగుభాష పునరుజ్జీవనానికి ఇది ఊతమిస్తుంది. హస్తినలో తెలుగు భాషపట్ల తెలుగు ప్రముఖుల పట్ల చిన్నచూపు కొనసాగుతూనే వ్నుది.

12/27/2017 - 21:26

తెలంగాణ రాష్ట్రం కొత్త చరిత్రను బహుజనాక్షరాలతో లిఖించుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇప్పటివరకు గత పాలకులంతా వెనుకబడిన వర్గాలను, కులాలను పధకాలుగా మాత్రమే చూశారు. కానీ నూతన తెలంగాణ రాష్ట్రం మాత్రం ఈ వర్గీయులను అభివృద్ధి పథకాలుగా కాకుండా గొప్ప మానవ వనరుగా తీర్చిదిద్దుకుని దేశ సంపదగా తయారు చేయాలని అందుకు బీసీ కమిషన్ అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దిశానిర్దేశం చేశారు.

12/27/2017 - 00:59

బిహార్‌లోని ముంగేర్ జిల్లా మసుదన్ రైల్వేస్టేషన్‌పై మావోయిస్టులు ఇటీవల దాడి చేసి బీభత్సం సృష్టించారు. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్‌ను, మరో రైల్వే ఉద్యోగిని కిడ్నాప్ చేసి కియుల్ - జమాల్‌పూర్ సెక్షన్లమధ్య రైళ్లు తిరగరాదని హుకుం జారీ చేశారు. దీంతో అనేక రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోయాయి.

12/22/2017 - 23:54

ఆధునిక భారతదేశ చరిత్రలో బహుముఖీనమైన ప్రజ్ఞాశీలతతో మన దేశం కోసం ఉజ్జ్వలమైన భవిష్యత్తుకు పునాదులు వేసిన మహావ్యక్తి పి.వి.నరసింహారావు. ఆయనకు పూర్వ భారతదేశాన్ని పాలించిన ప్రధానమంత్రులకూ ఆయనకూ కుందేలుకూ గున్నఏనుగుకూ ఉండే అంతరాన్ని పోలికగా తేవచ్చు.

12/22/2017 - 02:51

దేశంలో అన్ని విధాలా అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికోసం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగంలో అందుకు తగిన నిబంధనలు రూపొందించారు. అయితే కొద్దికాలం పాటు అవి అమలు చేస్తే సరిపోతుందని అప్పట్లో భావించారు. డెబ్బయి ఏళ్లుగా అవి కొనసాగుతూనే ఉన్నాయి. అప్పటి విధానమే ఇప్పటికీ కొనసాగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అణగారిన వర్గాలకు వీటివల్ల పెద్దగా ఒరిగింది లేదు. ఇతర వర్గాలకు నష్టమూ తప్పడం లేదు.

12/20/2017 - 21:38

దుబాయ్ విమానాశ్రయంలో దిగగానే నా వద్ద వున్న సామాన్లను సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేశారు. పెట్టెలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారిమీద నేను వ్రాసిన పుస్తకాలు కొన్ని కాపీలు ఉన్నాయి.
ఇవేమిటి? అని ప్రశ్నించారు.
‘కథల పుస్తకం’ అని చెప్పాను.
‘ఇందులో హిందూ మత ప్రచారం ఉందా?’
‘లేదు’ అన్నాను.
‘సరే’నని వదిలిపెట్టారు.

12/20/2017 - 01:15

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలంలో తూటాపేలింది. తొమ్మిదిమంది చండ్ర పుల్లారెడ్డి బాట నక్సలైట్లు హతమయ్యారు. వీరిని సైతం మావోయిస్టులుగా మీడియా పేర్కొంటున్నది. ఎవరు మావోలు? ఎవరు నక్సలైట్లు?
మీ మరణం వృధా కాదు, మీ నెత్తురు వృధా పోదు.. ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు.. అన్న అందమైన మాటల గారడీని కొందరు వినిపించారు. మార్క్సిజమంతా దగాపూరిత మాటలు తప్ప వాస్తవం మాత్రం కాదు.

Pages