S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/13/2018 - 01:07

దేశంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళ కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌లోని మహారాజ్‌గంజ్ ప్రాంతంలో రాజాసింగ్ అనే ఎంఎల్‌ఏ ఉన్నాడు. బిజెపికి చెందిన ఆయన ఒక ప్రకటన విడుదల చేశాడు. ‘‘డ్రగ్స్ కేసులోని నిందితులు తప్పించుకోవటం కోసం 1500 కోట్ల డీల్ కుదుర్చుకున్నారు’’ అని. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. దీనిని రాజాసింగ్ నిరూపించవలసి ఉంది. లోగడ నరుూం అనే దుర్మార్ముడు చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి.

01/12/2018 - 06:49

భారతజాతికి నిత్యస్ఫూర్తిని కలిగిస్తున్న స్వామి వివేకానంద మాటలు నవజీవన పాఠాలు. జీవన సత్యాలను చెప్పిన మంత్రాలు. దేశభవితకు యువత ఎంత కీలకమో, సమర్థులైన వందమంది యువకులతో దేశం రూపురేఖలనే మార్చేస్తానన్న ఆయన మాటల్లో, పలుకుల్లో కనబడిన శక్తి ఇప్పటికీ స్ఫూర్తినిస్తోంది. మార్గదర్శనం చేస్తోంది.

01/10/2018 - 21:52

మనకు స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా 1947కు ముందు, ఆ తరువాతి కాలాన్ని సమీక్షించుకోవాలి. 1947 వరకు ఉన్న విదేశీయుల పాలనలో దేశం ముస్లిం-క్రైస్తవ పరిపాలకుల నుండి అత్యధిక క్షోభను ఎదుర్కొన్నది. దేశ ప్రజలు పడిన కష్టాలు, బలిదానాలు, దోపిడీ, మానభంగాలు, అవినీతి, అక్రమాలు, అన్యాయం - ప్రాంతీయభేదం లేకుండా అన్ని ప్రాంతాల్లోను బాధలు అనుభవించారు.

01/10/2018 - 01:01

మార్క్సిజం ఒక మాధ్యమం మాత్రమే! కాని గత ఎనిమిది దశాబ్దాలుగా భారతదేశంలో దీన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేయడం వల్ల జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఈ సూక్ష్మమైన అంశాన్ని పట్టించుకోకుండా ఎందరో ఈ తప్పులో కాలేశారు. తమతోపాటు మరెందరినో ఆ తప్పులోకి లాగారు. ఇంకా లాగుతూ ఉన్నారు. ప్రపంచంలో రెండు వర్గాలు ఎప్పుడూ కనిపించవు.

01/08/2018 - 23:59

కేంద్రప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఆదాయపన్ను పరిమితిని, స్లాబులను సవరించి ఆదాయజీవులకు ఊరట కల్పించవలసిన అవసరం ఉంది. చాలాకాలంగా ఆదాయపన్ను స్లాబులను ఈ విధంగా లెక్కిస్తున్నారు. సీనియర్ సిటిజన్ (60-80 ఏళ్లలోపు ఉన్నవారు, చాలా సీనియర్ సిటిజన్స్ (80 ఏళ్లకు పైబడినవారు)కు పన్ను రాయితీలలోను స్లాబ్స్‌లోను మార్పులు చేస్తున్నారు. ఈ పద్ధతికి స్వస్తి చెప్పాలి.

01/08/2018 - 02:38

అది మహారాష్ట్ర ప్రాంతం, బీజేపీ పాలిత రాష్ట్రం. పూనా నగరం సమీపంలో కోరేగావ్, గత మూడు రోజులుగా విద్వేషాలతో రగిలిపోతున్నది. 1818 జనవరి 1వ తేదీ బ్రిటిషు సేనలపై మరాఠావీరులు దాడి చేశారు. ఇది కోరేగావ్ వద్ద జరిగింది. పీష్వాలకు గైక్వాడ్‌లకు ఆదాయ పంపకం విషయంలో విభజించి పాలించు నీతితో చిచ్చు రగిల్చింది నాటి బ్రిటీషు ప్రభుత్వం. దీని పర్యవసానమే కోరోగావ్ వద్ద జరిగిన యుద్ధం.

01/06/2018 - 01:31

కొత్త సంవత్సరం వేడుకలు బొంబాయి ఐఐటిలో ఒకరోజు ముందే వినూత్నంగా ప్రారంభమయ్యాయి. డిసెంబరు 30న సౌదీ అరేబియా పౌరసత్వంగల మరమనిషి (రోబో) సోఫియా ఆ ప్రాంగణంలో మొదటిసారి అడుగిడింది. ‘టెక్‌ఫెస్ట్ 2017’ పేర నిర్వహించిన కార్యక్రమంలో సోఫియా చీరకట్టులో కనిపించి ఎందరినో ముగ్ధుల్ని చేసింది. తన మాటలతో పరిణతిని ప్రదర్శించి కృత్రిమ మేధ కొంగొత్త మెరుపులను వేలమంది ఐఐటి విద్యార్థుల మెదళ్లలో మెరిపించింది.

01/05/2018 - 00:59

ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగు భాషకి ప్రాచీన హోదా కోసం పోరాడాం. అదీ పొరుగువారు సంపాదించేసుకున్నారు, మనకి లేదే! అనే ఆవేదనతో! ఆ హోదా వచ్చాక మనం పొరుగు రాష్ట్రాలు భాష కోసం చేపడుతున్న విధానాలు ఆనుసరిస్తున్నామా? నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకుంటున్నాం. భాషా దినోత్సవం అంటూ ఏడాదికి ఒక రోజు వేదికలెక్కి మొక్కుబడిగా ఉపన్యాసాలిస్తే అక్కడితో అయిపోయిందా?

01/03/2018 - 21:44

ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈసారి కలకత్తాలో ఇండియన్ హిస్టరీ కాంగ్రెసు సమావేశాలు నిర్వహించారు, 2018 జనవరి 1వ తేదీనాడు జరిగిన ప్రారంభోపన్యాసంలో సంస్థ ప్రధాన అధ్యక్షుడు కె.ఎం.పరిమలీ మాట్లాడుతూ ‘‘చరిత్రను వక్రీకరించడం తప్పు’ అని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ హిస్టరీ ప్రొఫెసర్‌గా పనిచేసిన కెఎం పరిమలీ తన ప్రసంగంలో కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశఆరు.

01/03/2018 - 00:32

ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం అందుతున్న సమయమిది. ప్రపంచానికి కిటికీలు తెరవడమే ఇంటర్నెట్. ఈ కీలకమైన, విలువైన సాంకేతిక ఆవిష్కరణ ఇప్పుడు ఇంటింటికి చేరడం గొప్ప విప్లవం. అద్భుతం. విప్లవమంటే రక్తం కళ్లచూడ్డం, తుపాకులకు పని కల్పించడం, విధ్వంసం సృష్టించడం, అభివృద్ధిని అడ్డుకోవడం, ఆశలను తుంచేయడం కాదు. కాలానుగుణమైన మార్పును మెజార్టీ ప్రజల ముంగిళ్లలోకి తేవడమే నిజమైన విప్లవ సారాంశం.

Pages