S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

11/09/2017 - 22:41

మానవ మనుగడ సాఫీగా సాగిపోవడానికి సైన్స్ ఎంతో దోహదపడుతోంది. విజ్ఞానశాస్త్రం సాధించిన అద్భుతాలవలన తగ్గని రోగం నుండి రోగరహిత సమాజ దిశగా, అనంత అంతరిక్షానికి వెళ్లే దిశగా మానవ ప్రయత్నాలు జరిగి మంచి ఫలితాలిస్తున్నాయి. సైన్స్ సాధించిన విజయాలకు గుర్తుగా ఏటా నవంబర్ 10న ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని ఐ.రా.స (యునెస్కో) నిర్వహిస్తోంది. ఒక్కో సంవత్సరం ఒక్కో నినాదంతో విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

11/08/2017 - 21:30

‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అనే నానుడి అందరికీ తెలిసిందే. ‘దైవములు లేరు తన కన్నతల్లికంటె, భాగ్యములు లేవు తనతల్లి భాషకంటె, స్వర్గములు లేవు దల్లిదేశంబుకంటె, నరులకీ సూత్రములు జీవనాడులండ్రు’ అంటూ తల్లి, పుట్టిన దేశం, తల్లి భాషను గురించి ఒక కవి మహోన్నతంగా తన హృదయావిష్కరణ చేశాడు. ఈ మూడింటిని జీవనాడులుగా పేర్కొన్నాడు.

11/07/2017 - 23:53

మావోయిస్టు సిద్ధాంతానికి కాలం చెల్లిందని శాంతిని కాంక్షించే శ్రీశ్రీ రవిశంకర్ కొట్టి పారేశారు. ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, బిహార్ మావోయిస్టు ప్రాంతాల్లో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని, యోగా శిబిరాల్ని ఆయన నిర్వహిస్తున్నారు. ప్రేమ, కరుణ, ఆధ్యాత్మికత ద్వారా మనసుల్ని గెలుచుకోవాలని సూచిస్తున్నారు. ఆ దిశగా కృషి చేస్తున్నారు.

11/06/2017 - 23:13

రుతుపవనాల ప్రభావం వల్ల దాదాపు సాధారణ సగటు వర్షపాతం నమోదైంది. రైతులకు ఇది ఆశాజనక పరిణామమే. వ్యవసాయానికి అనుకూలమైన పరిస్థితి. వ్యవసాయాధారిత ఆదాయం ఒక మాదిరిగా సాధించేందుకు ఇది ఉపకరిస్తుంది. అయితే నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను విధింపు వంటి చర్యల కారణంగా వ్యవసాయ వస్తువుల ధరలు బాగా తగ్గడం గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయంపై గణనీయ ప్రభావం చూపనుందని తాజా అధ్యయనం చెబుతోంది.

11/05/2017 - 00:15

2017 సెప్టెంబర్ 25 నాటికి దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా లేని ఇళ్లకు విద్యుత్ సరఫరాను అందించాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన కొత్త పథకం ప్రధానమంత్రి సహజ్ బిజ్‌లీ హర్ ఘర్ యోజన (సౌభాగ్య) దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లన్నింటికీ విద్యుత్ సదుపాయం అందుబాటులో ఉంచడం కోసం వరుసలోని చివరి ఇంటికి కూడా విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడం ఈ ‘సౌభాగ్య’ పథకం లక్

11/03/2017 - 23:11

ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదు, అందుకే ఏమున్నా లేకున్నా ఆరోగ్యంగా ఉంటే చాలు, జీవితం సాఫీగా సుఖంగా ఎలాంటి సమస్యలూ లేకుండా సాగుతుందనేది నానుడి. అయితే ఈ ఆరోగ్యమే మహాభాగ్యమనే సూత్రాన్ని పాలకులు ఎంత మేరకు పట్టించుకుంటున్నారు? ఒక పక్క ఆరోగ్య భారతాన్ని ఆవిష్కరిస్తున్నామంటూ కేంద్ర స్థాయిలోనూ రాష్ట్రాల్లోనూ చెప్పుకుంటున్న పాలకులు ఆ సూత్రాన్ని ఎంత మేరకు పాటిస్తున్నారనేది అనుమానంగానే కనిపిస్తోంది.

11/03/2017 - 00:50

ఎక్కడ చూసినా ఈ మధ్య డ్రగ్స్ గురించిన చర్చ జరుగుతోంది. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? అంతర్జాతీయ విశే్లషకుల అంచనాల ప్రకారం తూర్పు ఐరోపా దేశాలు ఆఫ్రికా నుండి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. ఇవన్నీ నేపాల్, బంగ్లాదేశ్‌ల మీదుగా ఇండియాకు వస్తున్నాయి.

11/01/2017 - 21:47

ప్రమాణాలను గుర్తించేందుకు విద్యాత్మక పరీక్షలు, అర్హులను గుర్తించేందుకు ఎంపిక పరీక్షలు జరుగుతుంటాయి.

11/01/2017 - 00:51

మన పొరుగునవున్న చిన్న హిమాలయ దేశం భూటాన్ ఇప్పుడు కొన్ని విషయాల్లో ప్రపంచానికి పాఠాలు చెబుతోంది. మానవాళికి ఉపయుక్తమైన అంశం ఎవరు చెప్పినా చెవి యొగ్గి వినాల్సిందే! భూటాన్ రాచరిక పాలనలో వున్న దేశం. అయినా ప్రజాస్వామ్యాన్ని పాటిస్తోంది. రాజదర్పం గాక ప్రజాదర్పం మాత్రమే అక్కడ దర్శనమిస్తోంది. ఆ దేశ రాజ్యాంగాన్ని గౌరవించడమేకాక కఠినంగా అమలు జరపాలని ఆజ్ఞాపించే అభ్యుదయవాది అక్కడి రాజు.

10/30/2017 - 22:15

భూ వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు పరిమాణం అమాంతం పెరిగిపోతోంది. లక్షలాది సంవత్సరాల తరువాత ఈ మార్పు కనిపించింది. గడచిన ఏడాది గణాంకాల ప్రకారం భూ ఆవరణంలో లక్షలాది సంవత్సరాలలో పెరిగిన కాలుష్యం కారణంగా 20 మీటర్ల మేర సముద్ర మట్టాలు, మూడు డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు పెరిగాయని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.

Pages