S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/06/2017 - 00:58

హైదరాబాద్‌లో గతవారం రెండు ఘనమైన కార్యక్రమాలు జరిగాయి. ఒకటి ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు, రెండవది ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవం. ప్రపంచం ఎటువైపు పయనిస్తున్నదో చూపే సూచికలివి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

12/03/2017 - 01:07

సుమారు ఒక నెలరోజులుగా ఇంగ్లీషు పత్రికలలో, తెలుగు పత్రికలలో ఆచార్య ఐలయ్య షెప్పర్డ్‌గారి ‘సామాజిక స్మగ్లర్లు కోమట్లు’ అనే కరపత్రం వంటి చిన్న పుస్తకంపై విమర్శలు, ప్రతి విమర్శలు, దూషణ భూషణలు చూస్తూ ఉన్నాం. ఒక సంస్కారం, సామాజిక బాధ్యత ఉన్న పెద్ద మనుషులు(?) అటువంటి రాతలు రాయకూడదు. ఇందువల్ల సమాజంలో కలిగే కనువిప్పు, జ్ఞానలబ్ధి ఏమిటి? వికాస ప్రోద్బలం ఎటువంటిది?

12/01/2017 - 01:09

ప్రపంచంలో అతివేగంగా విస్తరిస్తూ కబళిస్తున్న వ్యాధుల్లో ఎయిడ్స్ ఒకటి. వ్యాధి ఎలా విస్తరిస్తున్నదో, దానిని నిరోధించడం ఎలాగో, ప్రజల్లో చైతన్యం ఎంత అవసరమో ఈ ఏడాది జులైలో పారిస్‌లో విడుదలైన యుఎన్‌ఎయిడ్స్ - ఎండింగ్ ఎయిడ్స్ నివేదిక పరిశీలిస్తే అర్థమవుతుంది. ప్రపంచ జనాభాలో 2016 నాటికి 3.6 కోట్ల మంది హెచ్‌ఐవితో జీవిస్తున్నారు.

11/29/2017 - 23:25

మహాత్మాగాంధి ఖిలాఫత్ ఉద్యమాన్ని ఎందుకు బలపరిచాడు? దీనికి చరిత్రకారులు చాలా వ్యాఖ్యానాలు చెప్పారు. ఇంతకూ ఖిలాఫత్ ఉద్యమం అంటే ఏమిటి? పాశ్చాత్య ప్రపంచాల్లో రాజుకు మత గురువులకు తరచూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. రాజుకు ఉన్నట్లే మతాధిపతులకుకూడా సైన్యం ఉండేది. మతాధిపతులు తమకునచ్చినవారినే రాజుగా నియమించేవారు. ఇక అరబ్బు ప్రపంచంలో ఖలీఫా అనే వ్యక్తి ఏకకాలంలో రాజుగాను మతాధిపతిగానూ ఉండేవాడు.

11/28/2017 - 23:11

ఇన్‌ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని తన సంపదలో సగభాగం విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎయిర్‌టెల్ సంస్థ చైర్మన్ సునీల్ మిట్టల్ రూ. 7వేల కొట్లు దాతృత్వ కార్యక్రమాలకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ రూ. 77 వేల కోట్లు విరాళం ప్రకటించాడు. గతంలోనూ ఆయన తన కూతురు పుట్టిన సందర్భంగా భారీ విరాళం ప్రకటించారు.

11/27/2017 - 23:55

దేశంలో కులం, మతం మనుషుల మధ్య అంతరాన్ని పెంచిన సమయంలో ప్రేమ, కరుణ, స్నేహం అనేవాటితో ప్రజలను సంఘటితం చేయడానికి, జాగృతం చేయడానికి కృషి చేసిన ఘనుడు జ్యోతిబా పూలే. మహారాష్టల్రో 1827లో పుట్టిన ఆయన ఎన్నోకష్టాలు అనుభవించాడు. అతడికి ఏడాది వయస్సున్నప్పుడే తల్లి మరణించడంతో ఓ దాదీ ఆమెను తల్లిలా పెంచింది. స్కూల్‌లో చేరినా ఒకరి సలహాతో తండ్రి అతడిని మాన్పించాడు.

11/26/2017 - 23:57

రోసగుల్లా అనాలా? రసగుల్లా అనాలా? గోలు గోలుగా వుంటుంది కనుక రోశ్గుల్లా అనే అంటాడు బెంగాలీవాడు- గుల్ల గుల్లగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది కనుక రసగుల్లా అందామంటాడు తెలుగువాడు- ఒడిశావాడు మాత్రం రసగోల అనే అంటాడు, అదో గోల అయిపోయింది ఇపుడు- బెంగాలీవాడు మామూలుగానే అందరికన్నా మేం గొప్పోళ్లం- అంటాడు. ‘వ’ని బ అంటాము వంగదేశాన్ని ‘బంగదేశ్’ అంటాము- జనగణమన పాట మా గురుడే రాశాడు.

11/25/2017 - 22:41

గోదావరిపై భారీ తాగు, సాగునీటి ప్రాజెక్టు పోలవరం 1942 నాటి ఆలోచన. ఇప్పటికీ అది ఆశలు రేపుతున్న ప్రాజెక్టుగానే ఉంది. శొంటి వెంకట రామమూర్తి, వావిలాల గోపాలకృష్ణయ్య, కె.ఎల్.రావు వంటి పెద్దలు, ఇంజనీరింగ్ మేధావులు ఎందరో పోలవరం ప్రాజెక్టు కోసం కలలుకన్నారు. నాటి బ్రిటిష్ పాలననుంచి నేడు కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం వరకు పోలవరం ఒక ఎన్నికల వాగ్దానంగానే మిగిలిపోయింది.

11/25/2017 - 00:13

సుమారు 140 సంవత్సరాల కిందట ప్రపంచ మత మహాసభ ముగింపు సందేశంలో స్వామి వివేకానంద ఇట్లా ఉద్బోధించాడు సర్వమానవాళిని. ‘సహాయం కావాలి, విరోధం వద్దు, సౌజన్యంతో మెలగాలి, వినాశం కోరవద్దు, శాంతి సామరస్యం పెరగాలి, వైషమ్యం తొలగాలి’ అని. స్వామి వివేకానంద కావి బట్టలు ధరించేవాడు కాబట్టి ఐలయ్యగారికి ఎర్ర వస్త్రం చూచి ఎద్దు బెదిరినట్లు వివేకానంద రచనలు అంగీకారం కావేమో!

11/24/2017 - 02:06

ప్రస్తుతం 132 సంత్సరాల సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి, ఐరిష్ జాతీయుడైన ఎ.ఒ. హ్యూమ్ స్థాపించిన నూరేళ్ల తరువాత ఒక విదేశీయ మహిళ సారథ్యం వహించడం కాకతాళీయం కావచ్చు. తొలుత ఎన్నో విమర్శలకు గురైనా తరువాత క్రమేపీ రాజకీయ అంతర్వాహినిలో మమేకమై, 1983 ఏప్రిల్ 30న భారత పౌరసత్వ చట్టం ప్రకారం సోనియా భారత పౌరసత్వం పొందారు.

Pages