S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/19/2017 - 01:13

లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి సాధారణ ఎన్నికలు జరిపాలన్న ఆలోచన మంచిదే. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఎన్నికల సంస్కరణలు, చట్టసభలకు సభ్యుల ఎన్నికకు సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకురావలసిన అవసరం ఉంది. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో, తరచూ ఎన్నికల నిర్వహణ వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది. పెద్దఎత్తున ధనవ్యయమూ జరిగిపోతోంది. జమిలి ఎన్నికలవలన సమయం, ధనం ఆదా అవుతాయి.

12/17/2017 - 04:37

రాహుల్‌జీ మొన్న గుజరాత్ ఎన్నికలలోనే, మనకు తెలిసినంత వరకూ, దేవాలయ దర్శనాలు ప్రారంభించారేమో! అమేథీలో వారెప్పుడు దేవాలయాలు దర్శించినట్లు వార్తలు రాలేదు.. సరే మంచిదే, పైగా వారు తాము శివభక్తులమని ప్రకటించారు, సంతోషం. మనం శివకేశవులకు భేదభావం చూపం కాబట్టి, మొత్తానికి వారు భక్తులయ్యారు, చాలు. ఇప్పుడు అసలీ సోమనాథ దేవాలయ పునర్నిర్మాణ కథ ఏమిటో తెలుసుకుందాం.

12/16/2017 - 00:39

తెలంగాణ రాష్ట్ర సమితిలో, వారూ-వీరూ అనే తేడా లేకుండా, ఆ పార్టీ-ఈ పార్టీ అనే భేదం లేకుండా, అను నిత్యం, ఎన్నికైన వివిధ స్థాయి ప్రజాప్రతినిధులతో సహా, వేలాదిమంది రాజకీయ కార్యకర్తలు చేరడం రాజకీయ పునరేకీకరణ ఆవశ్యకత మాత్రమే. ఒక మహోన్నత ఉద్యమ నేపథ్యంలో ఒక పార్టీ టికెట్‌పై గెలిచి, మరో పార్టీలో చేరడం సమంజసమే. ఇది అనైతికమనే వారికి రాజకీయ పునరేకీకరణ ఆవశ్యకత అంతగా అర్థం కాదు.

12/13/2017 - 22:25

ఆధునిక జీవితంలో విద్యుచ్ఛక్తి వినియోగం లేకుండా మనిషి మనుగడ సాధించలేకపోతున్నాడు. మన జీవనశైలిలో వచ్చిన మార్పులు, అందివచ్చిన సౌకర్యాలు దీనికి కారణం. అయితే వాటిని వినియోగించుకునేందుకు విచ్చలవిడిగా విద్యుత్‌ను వాడుకుంటున్నాం. విద్యుత్ ఉత్పాదనకు పెద్దఎత్తున ఖర్చు ప్రజాధనం ఖర్చు అవుతోంది. అయితే మనం వాడుకునే విద్యుత్‌లో ఎక్కువభాగం వృధా అవుతోంది. ఈ శక్తి వినియోగంలో పొదుపు పాటించడం అత్యవసరం.

12/12/2017 - 23:39

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, నరసింహసాగర్ ప్రాజెక్టు సమీప అడవుల్లో చండ్ర పుల్లారెడ్డి వర్గానికి చెందిన ముగ్గురు నక్సలైట్లను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. వారివద్ద ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, విప్లవసాహిత్యం, కిట్‌బ్యాగులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు మహబూబాబాద్ జిల్లాలో న్యూ డెమొక్రసీకి చెందిన నక్సలైట్ సమ్మయ్య అలియాస్ గోపీని పోలీసులు అరెస్టు చేశారు.

12/12/2017 - 01:01

కవాతుల్లో ‘ఆగేముడ్’ అంటే ముందుకు నడవమని, ‘పీచేముడ్’ అంటే వెనక్కి తిరగమని అర్ధం. ఇప్పుడు రాజకీయ పరిభాషలో ‘నీచేముడ్’ అన్న పదం కొత్తగా వచ్చి చేరింది. గుజరాత్ ఎన్నికల ప్రచారం తీరు చూస్తే రాజకీయ విలువలు ‘నీచేముడ్’ ఒరవడిలోనే సాగుతున్నాయని చెప్పాలి. అంటే రాజకీయ విలువలు పాతాళంలోకి జారిపోతున్నాయన్నమాట.

12/10/2017 - 03:39

ఆంధ్రప్రదేశ్‌లో పౌరవిమానయాన రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోనున్నది. రాష్ట్ర విభజన తరువాత ఈ రంగంలో అభివృద్ధికి ప్రాధాన్యం పెరిగింది. ముఖ్యంగా నూతన రాజధాని అమరావతి నిర్మాణ నేపథ్యంలో విమానయాన అవకాశాల మెరుగుపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయం స్థాయి, విస్తరణపై దృష్టి సారించారు. అటు విశాఖ విమానాశ్రయంతోపాటు కొత్తవాటి కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి.

12/09/2017 - 00:54

విను, చదువు మెవరిదైనను;
విని, చదివియు వేగపడక విస్తృతచర్చన్
గని, కల్ల - నిజము తెలిసిన
మనుజుడె జిజ్ఞాసువన్న మరి ధీనిధియున్

12/08/2017 - 00:21

గతంలో నోబెల్ కమిటీ అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ప్రపంచ శాంతి బహుమతి ఇచ్చింది. అంతర్జాతీయ అశాంతి బహుమతిలాంటిదేదైనా ఉంటే అది ఖచ్చితంగా నేటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి వచ్చి తీరుతుంది. ప్రపంచవ్యాప్తంగా వివాదాలు పెరగడానికి ఆయన తనవంతుగా కృషి చేస్తున్నారు. తాజాగా జెరూసలెం నగరాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం ఆ కోవలోనిదే.

12/06/2017 - 21:50

మొన్న ఒకాయన చమత్కారంగా ఇలా అన్నాడు. ‘‘మన ఎన్నికలు అభివృద్ధి మంత్రంతో మొదలై అయోధ్యతో ముగుస్తాయి’’...అంటే ఏమిటి? డెవలప్‌మెంట్ అనే మాటతో ప్రచారం మొదలుపెట్టి కులం-మతం వంటి అంశాలను తెరపైకి తెస్తారని తాత్పర్యం. రాహుల్‌గాంధీ హిందువుకాదు - అని వాదించేసరికి ‘‘అమిత్ షా హిందువు కాదు - అంటూ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. ఇంతకూ ఈ దేశంలో ఎవడు హిందువో ఎవడు కాదో తేల్చుకోవలసిన సమయం వచ్చింది.

Pages