S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

03/08/2018 - 03:56

రోజురోజుకీ మరింత ఎండ.. ఈ సమ్మర్ ‘డింగ్ డాంగ్ హెల్’.. గత ఆదివారమే మచ్చు చూపెట్టింది విరోధకృతి తన వికారాకృతి. ఈ ఏడాది ఎండలు మెండుగా కాయును.. అని మన వాతావరణ పరిశోధన సంస్థ అనగా ఇండియన్ మెటిరియలాజికల్ డిపార్టుమెంటు చెప్పేసింది. దానికి తగ్గట్టు గత ఆదివారమే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో ఐ మీన్- ఇండియాలో పాదరసం నలభై డిగ్రీలకి నిచ్చెన ఎక్కేసింది.

02/22/2018 - 07:13

‘అందంలో పందెం వేస్తా.. అందాల మకరందాలు అందెల్లో చిందిస్తా’ నంటూ- ఈ అందాలరాశి చిందులు వెయ్యలేదు. ఓసారి ‘ఇలా’ కన్నుకొట్టింది అంతే- కటారి చూపుల కనె్నపిల్ల ఇంకా టీనేజరే.. విరిసీ విరియని మొగ్గ- ఈమధ్యే కాలేజీలో బికాంలో చేరింది. కానీ నిన్నటిదాకా ‘ఇసుకూలు’ పిల్లే.. కామ్‌గా వుండే రకం గాదు ‘‘ఓరు ఆడారు లవ్’’ అనే మలయాళ సినిమాలో అరంగేట్రం చేస్తోంది. పేరు ప్రియాప్రకాష్ వారియార్- కురువింద పువ్వు లాంటి పిల్ల.

02/15/2018 - 00:59

శ్రీనగర్ సెంట్రల్ జైలు నుంచి భయంకర లష్కరే తోయిబా టెర్రరిస్టు ఖైదీ అయిన నజీద్ అహమ్మద్ ఝాట్‌ని నాటకీయంగా విడిపించుకుపోయిన దరిమిలా కాశ్మీర్‌లో సైనిక దుస్తుల్లో తెగబడి వచ్చి, సున్జవాన్ సైనిక శిబిరం మీద తెగబడి దాడులు చేశాయి ఉగ్రవాద మూకలు. ఒక జూనియర్ అధికారిని, ఏడుగురు (ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే వుంది) జవాన్లను వీరు పొట్టన బెట్టుకున్నారు. ఇది ధర్మయుద్ధం కాదు- అసలు యుద్ధం కూడా కాదు.

02/08/2018 - 05:53

పళళ్ఘూజ.ష్యఖౄశజఒఆబఘౄజ.ష్యౄ

01/29/2018 - 01:24

అరవై తొమ్మిదో గణతంత్ర దివస్ సంబరాలకి మన ఘనమైన తెలుగుతేజం ఓహోమని అహోమని ఉత్తేజపరచడానికి - ఎన్‌డీఏ గవర్నమెంటు - మొహమాటానికయినా ఛాన్స్ ఇవ్వలేదు. స్వర్గారోహణ చేసిన లెజెండ్స్‌కి ఇవ్వమని ఇస్తారని కోరుకున్నాం - అదీలేదు - కొత్తగా ఝామ్మని రాజకీయంగాను ఇతరత్రా కూడా - తెలంగాణలో ఒక్క తెలుగు వెలుగుకు కూడా - పద్మం, భూషణం మెడలో వేసి సత్కరించడానికి కుదరలేదా? - కేంద్ర ప్రభుత్వానికి మన లిస్టు ఆనలేదా?.

01/22/2018 - 00:55

టెస్టులు, ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీలలో అన్నింటా అత్యుత్తమ నాయకుడు అవార్డులు 2015లో గెల్చి - ‘క్రికెట్ సమ్రాట్ విరాట్’ అంటూ జేజేలు అందుకున్న - విరాట్ కోహ్లీకి ‘గుండెలలో గునపాలే గ్రుచ్చారే నీ వాళ్లు’ అన్నట్లు 2018 సంక్రాంతి కాంతి విహీనమైపోయింది. గ్రహణం పట్టిన సూర్యుడైపోయింది. ‘అరివీర భయంకర్ అర్జున్’లాంటిది మా ఇండియన్ టీము అన్నాం - మొత్తం కవచ కుండలాలు దానం చేసిన కర్ణుడు మాదిరి అయిపోయింది.

01/15/2018 - 00:48

ముక్కు కోస్తూ వుంటే రక్తం తాగే మొండి ఘటాలు మనకి సామెతల్లోనే కానవస్తారు అనుకోకండి- ఇలలో కూడా వుంటారు. శ్రీమాన్ లల్లూ ప్రసాద్ యాదవ్- బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్‌జెడి చీఫ్‌కి మూడున్నర ఏండ్ల జైలుశిక్ష- పది లక్షల జరిమానా పడగానే కథ ముగియలేదు. ఇంకా రెండు కేసులు ఉన్నాయి.. ఎప్పుడో ఇరవై ఏండ్లనాడు తినేసిన పశుగ్రాస నిధుల గురించి ఇవాళ బాధ ఏముంటుంది? అరిగిపోయేయిగా..

01/08/2018 - 02:37

ట్వీట్ అంటే చిలక పలుకు కాదు.. అది అంబ పలుకు అనుకొనేలా చేశాడు ముఖ్యంగా మన నమోజీ- ఆదేశాలు సంతాపాలు శుభాకాంక్షలు అన్నీ ట్వీట్లమీదే ఒగ్గుతున్నారు ఘనాపాటీలనుంచి కుర్రకారు దాకా; ఇవాళ రేపూ జగమంతా ట్వీట్లమయమే- అమెరికా అధ్యక్షుడు అతి ముఖ్యమైన సంగతి ఏదైనా ముందుగా ట్వీట్ ఇస్తాడు. ఆనక ఆలోచిస్తాడు. ఆ తరువాత అధికార ప్రకటన వగైరాలు వెలువడతాయి. భారత ప్రధాని మోదీజీ ట్వీట్ అంటే అది రాజముద్ర పడ్డ తాఖీదే..

01/02/2018 - 00:31

ఏదొ ఒక కొత్త వింతని తీసుకురావాలి. కనీసం చొక్కా తిరగేసి తొడుక్కోవాలి. అసలు చొక్కా తొడుక్కోకపోయినా అదీ ఒక ఆవిష్కరణే..

12/25/2017 - 00:39

గజం మిధ్య.. పలాయనం మిధ్య అన్నట్లుగా వుంది పటియాలా హవుస్ స్పెషల్ కోర్టు తీర్పు - 2011 మార్చిలో ఏర్పాటు చేయబడ్డ స్పెషల్ కోర్టు సుమారు ఏడు సంవత్సరాల విచారణ తరువాత - ప్రధాన నిందితుడు టెలికం శాఖ మాజీమంత్రి రాజా ఏ పాపము ఎరుగడు నిర్దోషి అని, అందుచేత కరుణానిధి తనయ కనిమోళి అమ్మళ్ - నిర్దోషి అని - మిగతా పదిహేడు మంది ముద్దాయిలు - ముద్దుకేమో?

Pages