S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిన తెలంగాణ

04/03/2016 - 23:04

‘నిన్న నీతో పాటు కనిపించిన అమ్మాయెవర్రా...’
‘నాన్నా..నేనా అమ్మాయిని ప్రేమిస్తున్నా...’
‘ప్రేమించి ఏం జెస్తవ్ బిడ్డా...’
‘పెళ్లి జేసుకుంటా...’
‘నువ్వు సదివేది ఏం తరగతి బిడ్డా...’
‘ఇంటర్...’
‘మరి సదువు పూర్తికాకుండా ఏం జేసి సాదుతావ్ రా...’
‘......’

03/05/2016 - 23:48

గోదావరికి పుష్కరాలొస్తున్నాయి. ఎక్కడికి వెళ్తే బాగుంటుందని ఆలోచిస్తున్న తరుణంలో, ‘కాళేశ్వరమంటే మరో కాశీ క్షేత్రమే’, ఓ మిత్రుడు చెప్పిన మాటలు గర్తుకువచ్చాయి. దూర దూరంలో ఉన్న క్షేత్రాల సంగతి సరే. దగ్గరలోనే ఉన్న కాళేశ్వరం వెళ్లాలని అనుకుంటున్నా ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వచ్చింది. అందరం ప్రభుత్వోద్యోగులం కావడంతో ఒకరికి సెలవు దొరికితే మరొకరికి దొరుకదు.

02/28/2016 - 19:56

రాజారామ్-సత్యవతిలకు ప్రవీణ్ ఒక్కగానొక్క కొడుకు. చిన్నాచితక వ్యాపారం చేసుకుంటూ కొడుకును ఉన్నత చదువులు చదివించి అమెరికాలో స్థిరపడే స్థాయికి చేర్చాడు. ప్రవీణ్‌కు అక్షయతో పెళ్లైన రెండేళ్లకే కొడుకు అరుణ్ పుట్టాడు. వాడికిప్పుడు నాలుగేళ్లు. ప్రవీణ్ ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నాడు. ఎప్పటినుంచో తల్లిదండ్రులను ఒకసారి అమెరికాకు వచ్చి వెళ్లమని అడుగుతున్నాడు. రాజారామ్‌కు ఇప్పటికి గానీ వీలుపడలేదు.

02/23/2016 - 20:46

‘రాణి.. నీకోసం గంట నుండి చూస్తున్నా..అర్ధ రాత్రయింది, మరో అరగంటలో రైలు వచ్చేస్తుంది. ఇక ఆ తరువాత మన జీవితమే వేరు. నాకు నువ్వు, నీకు నేను..ఇక ఈ లోకం మనల్నేం చేయలేదు.. మనల్నెవ్వరూ వేరు చేయలేరు. ఐ లవ్ యు రాణీ..

02/16/2016 - 21:04

చల్లని వెనె్నల కాంతి ఒకవైపు! బయట మల్లెల గుబాళింపు మరోవైపు! కొలీగ్ లాసిని తాలూకు మధుర భావాలు మదిని కవ్విస్తున్నాయి. ఫోన్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న శ్రీకాంత్ బెడ్‌పై బోర్లా పడుకుని.. ఊహాలోకాల్లో విహరిస్తున్నాడు! జిలుగు వెలుగులో ఏదో దోబూచులాడినట్లు.. ఆయన అంతరంగ తరంగాలు ఆయనను గిలిగింతలు పెడుతున్నాయి.

02/08/2016 - 23:42

‘అరె రాజిగా నా కళ్లముందు నికింత లగ్గమయితే సూత్తరా, నాకా శాతనైతలేదు. వూరుదూరంగావట్టే కాడుదగ్గరగావట్టే. మునపట్లెక్క లేదు పానం. నీకా పోరడేంపని జేత్తలేడని ఒక్కరన్నా పిల్లనిత్తలేకపోయిరి. నీకా యవుసప్పని రాకపాయే పెద్ద సదువుకు నాకాడ పైసల్లేకపాయె. పట్నంల నాలుగొద్దులు పనిచేసి నేను కలల కనిపిత్తన్నని అచ్చేత్తివి. పక్కింటి కొమురన్న కొడుకు నాలుగేండ్లు దుబాయ్ వొయ్యి మత్తు సంపాయించే.

01/30/2016 - 23:07

నవంబర్ పదిహేనవ తేదీ... సాయంత్రం ఆరు కావస్తోంది. చిరుచీకటి దుప్పటి కప్పుకుని చలి తన పంజా విసిరేందుకు సిద్ధపడుతున్న సంధ్యా సమయమది. సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ మాత్రం కాలంతో పనిలేకుండా ఎప్పటిలాగే గోలాహలంగా ఉంది. ప్రాణాలు కాపాడుకునేందుకు వచ్చేవాళ్లు... ఆయుష్షు తీరిపోయేవాళ్లు.. ఈ వచ్చిపోయేవాళ్ల వెంట ఉన్న మనుషుల్లో సందర్భాన్ని బట్టి హర్షాతిరేకాలు లేదా అంతులేని శోకాలు.. అన్ని ఒక్కచోటే.

01/30/2016 - 22:52

కార్తీకమాసం... ఆదివారం ఉదయం నాలుగు గంటల సమయం.. చీకట్లు ఇంకా తొలగిపోలేదు. అపుడే నిద్రలేచిన నేను నిద్రమత్తును విడిచి మెల్లగా పనులు మొదలుబెట్టాను. మధ్యలో ఎందుకో నా చూపు మా పక్కింటిపై పడింది. వాళ్లు ఇంకా రాలేదు. వారింటికి ఇంకా తాళం వేసే ఉంది.
మా పక్కింట్లో ఒక ముస్లిం కుటుంబం ఉంటుంది. తల్లితో బాటు ఇద్దరు కొడుకులు ఉంటారందులో.

01/17/2016 - 22:34

నిన్ను వదిలి వెళ్లడం తప్పదా మమీ కన్నీళ్లతో అడిగాడు వరుణ్. ‘ఈ ఒక్క సంవత్సరమే నాన్నా, వచ్చే సంవత్సరం నుంచి మనిద్దరం కలిసే ఉంటాం, సరేనా? అంటూ అనునయించింది సీత.
‘అయితే ఈ రోజంతా నువ్వు నాతో ఉండు. రేపే నేను స్కూళ్లో జాయిన అవుతా’
‘సరే’నంటూ ఇద్దరూ కలిసి గుడి, పార్కు, రెస్టారెంటూ తిరిగి రాత్రికి ఇంటికి చేరారు.

01/11/2016 - 00:21

నిశబ్దం తాండవనృత్యం చేస్తున్న ఆ గదిలో పదవ తరగతి పరీక్ష రాస్తున్నారు విద్యార్థులు. ఇన్విజిలేటర్‌గా పార్థసారథి మాస్టారు, ఆయనకు సహాయంగా గోపాలకృష్ణ మాస్టారు విధులు నిర్వహిస్తున్నారు.

Pages