S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిన తెలంగాణ

12/18/2016 - 22:17

కరీంనగర్ సాహితీ గౌతమి ఆధ్వర్యంలో డిసెంబర్ 25న ఉ. 10 గంటలకు స్థానిక భగవతి హైస్కూల్‌లో డా. పల్లా దుర్గయ్య సాహితీ సమాలోచనం నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ఎస్.అనంతాచార్య, దాస్యం సేనాధిపతి ఒక ప్రకటనలో తెలిపారు. సాహితీవేత్తలు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, ఆచార్య వెల్దండ నిత్యానందరావు, డా. సంగనభట్ల నర్సయ్య, ఆచార్య ఎస్.వి.రామారావు, డా. పల్లా శ్యాంసుందర్, గిరిజా మనోహర్‌బాబు.

12/11/2016 - 03:44

ఆకాశపు నీలం
పసిదాని పట్టుపావడా అయ్యింది
విరబోసుకున్న నల్లని కురుల అంతరిక్షంలో
మిలమిలా మెరిసే కన్నుల నక్షత్రాల వెలుగులో
చిరునవ్వుల జాబిలి మెరిసిపోతోంది..
దాని చిన్న లోకంలో అల్లిబిల్లిగా పెరిగిన
ఆశల మొలకలు.. ఎంత లేతవో!
ఎరుపు చివుళ్లతో నునులేత మెత్తని పరిమళం..
ఎవర్నైనా ఇట్టే నవ్వుతూ చూసే కన్నుల్లో
ఎంతో అమాయకత్వం..

12/11/2016 - 03:39

డాక్టర్ బండ సరోజన
విజేత లక్ష్మినివాస్
ఫ్లాట్ నం. 404
సలీంనగర్ కాలనీ
మలక్‌పేట, హైదరాబాద్-36
సెల్.నం.040-24548440
**

12/11/2016 - 03:34

‘విశ్వా ఒక గులాబి మొక్క కొనివ్వవా’ అని అడిగింది స్నేహితురాలు వాసంతి. సరేనంటూ ‘ఏ గులాబి మొక్క? తెల్లదా, ఎర్రదా?’ అని అడిగాడు. ‘నాకు తెల్ల గులాబి చెట్టు కావాలంది. ఆ తరువాత కొన్ని రోజులకు విశ్వ ఒక ఎర్ర గులాబి మొక్కను తీసుకువచ్చి ప్రేమగా పెంచాడు. అభిమానాన్ని వర్షంగా కురిపించి అందమైన గులాబి పువ్వును పూయించాడు. ఎర్ర గులాబీ తీసుకువచ్చి వాసంతికి ఇవ్వబోయాడు. వాసంతి వద్దని అంది.

12/11/2016 - 03:31

పేజీలు: 79 - వెల: 70/-
ప్రతులకు:
సాహితీ బంజారానిలయం
ఇం.నెం.5-5-244
సంభాని నగర్, పార్శీబంధం
ఖమ్మం జిల్లా
సెల్.నం.9395130719
**

12/04/2016 - 05:57

గేటు తీయగానే కుడిపక్కన నాకు స్వాగతమిస్తూ, చిరుగాలికి తలలూపుతూ అందంగా నవ్వుతుంది మల్లెపొద. రోజు దాన్ని చూస్తూ ఎన్ని కొమ్మలు, రెమ్మలు మొలిచాయి. ఎన్ని పూమొగ్గలయ్యాయి. మరిన్ని రేపటికి విరియబోతున్నాయోనని మదినిండిన భావనతో లెక్కేసుకుంటూ లోనకు అడుగుపెడతాను. సంధ్యా చీకట్లు ముసురుకోగానే ధవళవర్ణపు వెండి మొగ్గలు, మరింతగా మిసమిసను సంతరించుకుంటాయి.

12/04/2016 - 05:54

తెలంగాణ సాహిత్య చరిత్రను రాగద్వేషాలకు అతీతంగా పునర్నిర్మించి సత్యావిష్కరణ తోడ్పడాలని భావించే ప్రముఖ కవి, రంగస్థల నటులు గన్నమరాజు గిరిజా మనోహర బాబు మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపురంలో జన్మించినా ఆయన వృత్తిరీత్యా వరంగల్‌లో స్థిరపడి పోయారు. ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. ఆయన సమర్థమైన కవి.. మంచి వక్త.. గొప్ప రంగస్థల నటులు..

12/04/2016 - 05:50

పేజీలు: 60; వెల : 40/-
ప్రతులకు:
దాట్ల దేవదానం రాజు
8-1-048
జక్రియా నగర్
యానాం - 533464
సెల్.నం.9440105987
**

12/04/2016 - 05:45

తూనీగల గుంపులాంటి
మిత్ర బృందంలో
పెబ్బ తూనీగ వాడు
స్కూలు మైదానంలో
అన్ని ఆటలూ వానియే అన్నట్టు
ఆడినవాడు
ఊరంతా జింకపిల్లలా తిరిగినవాడు
ఇంట్లో
క్షణం కూడా కాలునిలుపని వాడు
కదలలేని కష్టం మీదపడి
మంచానికి అతుక్కుపోయి
ఎలా ఉంటున్నాడో..
వాడికెంత ఆశగా వున్నదో
అప్పటిలా పరుగెత్తాలని
ఆ వీధి పొడవంతా నడువాలని

11/28/2016 - 22:58

బస్ వేగంగా వెళుతూ ఒక్కసారిగా బ్రేక్ పడడంతో ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచాడు సుమిత్. రాత్రి వారి బావమరిది పెళ్లికి హాజరవడంతో నిద్రపోలేదు. హాయిగా నిద్రపోదామంటే ఈ బ్రేకులు ఒకటి అంటూ చిరాకుపడ్డాడు.
సుమిత్ పక్కన ఓ యువతి కూర్చుని ఉంది. తను ఏడుస్తూ ఉండటం గమనించి ‘అరే ఏమైందమ్మా ఏడుస్తున్నావు’ అని అడిగాడు ఆ యువతి ఏడుపు కనబడకుండా తన చున్నీ అడ్డంగా పెట్టుకుంది.

Pages