S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

09/30/2018 - 23:23

సహజ సౌందర్యం పెరగాలంటే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉండాలి. దానికోసం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు..
* సాధ్యమైనంతవరకూ హెయిర్ స్టయిలింగ్ చికిత్సలూ, ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వాటిలో గాఢత ఎక్కువగా ఉండే రసాయనాలు తాత్కాలికంగా మెరిపించినా భవిష్యత్తులో జుట్టు ఎదుగుదలను నియంత్రిస్తాయి. కాబట్టి అలాంటి వాటిని వాడకపోవడమే మంచిది.

09/28/2018 - 19:33

పెదవులు అందంగా కనిపించాలని అందరూ ఆరాటపడతారు. కానీ దంతాలపై అంత దృష్టి పెట్టం. మనం నవ్వినా, మాట్లాడినా దంతాలు తెల్లగా, అందంగా కనిపిస్తే ముఖ సౌందర్యం మరింత ఇనుమడిస్తుంది. అందుకని దంతాలను ఎప్పుడూ తెల్లగా, ఎటువంటి మచ్చలు లేకుండా చూసుకోవాలి. దంతాలను తెల్లగా, ముత్యాల్లా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు..

09/27/2018 - 19:04

వర్షాకాలంలో ఆరోగ్యానికి అల్లం చాలా మంచిది.
* వర్షాకాలంలో ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీళ్లలో తులసి ఆకులు, కొద్దిగా అల్లం ముక్కలు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే గొంతు ఇనె్ఫక్షన్స్ తగ్గుతాయి.
* క్యారెట్, టొమాటో, కొద్దిగా అల్లం ముక్కని కలిపి జ్యూస్ చేయాలి. ఇందులో తేనె, కొద్దిగా నీళ్లు కలుపుకుని తాగాలి. ఇలా వీలైనప్పుడల్లా తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది.

09/26/2018 - 19:08

వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు అంటే.. జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహార విషయంలో అనేక జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఈ కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అందువల్ల ఏది పడితే అది తింటే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం తినాలో తెలుసుకుందాం..

09/25/2018 - 18:51

ఆస్తమా వ్యాధి వచ్చినవారికి ఊపిరితిత్తుల్లో గాలిప్రవాహంలో అడ్డంకులు ఏర్పడుతుంటాయి. దీంతో దగ్గు, గురక వంటి సమస్యలు వస్తుంటాయి. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ చిట్కాలను పాటిస్తే ఆస్తమా వ్యాధి నుండి సమర్థవంతంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

09/23/2018 - 23:34

ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. నేటి ఆధునిక, యాంత్రిక జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆహార విషయంలో శ్రద్ధ తక్కువైంది. సరైన పోషకాహారం తీసుకోకపోవడంతో అనారోగ్యం, ఊబకాయం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొన్ని రకాల కూరగాయలను తీసుకోవడం వల్ల అధిక బరువు నుంచి ఉపశమనం లభిస్తుంది.

09/21/2018 - 20:18

వాతావరణంలో మార్పులు కారణంగా చర్మంలో పిగ్మెంటేషన్ మొదలవుతుంది. అలాకాకుండా ముఖం ఎప్పుడూ తాజాగా ఉండాలంటే ఈ వానాకాలంలో అప్పడప్పుడూ ఇంట్లో తయారుచేసుకునే ఫేస్ ప్యాక్‌లను వాడాలి. అప్పుడే చర్మం బిగుతుగా మారి అందంగా కాంతులీనుతూ ఉంటుంది.

09/20/2018 - 18:47

వర్షాకాలంలో బట్టలు తొందరగా ఆరవు. ఎక్కువ రోజులు ఆరబెట్టడం వల్ల కూడా బట్టలు అదో రకమైన మగ్గు వాసన వస్తూంటాయి. వర్షాకాలంలో తడి వల్ల ఒక్కోసారి ఇల్లంతా దుర్వాసన వస్తూంటుంది. ఇలాంటి సమయంలో..

09/18/2018 - 19:14

* మిగిలిన పచ్చిమిరిపను నీడలో ఆరబెట్టితే పోపులోకి వాడుకోవచ్చు.
* మిగిలిన అన్నాన్ని నీడలో ఆరబెట్టి సన్నని సెగమీద వేయించుకుని దానిలోకి పుట్నాలపప్పు, పల్లీలు, ఉప్పుకారం కలుపుకుంటే మంచి స్నాక్‌గా తయారు అవుతుంది.

09/17/2018 - 19:49

ఆయా కాలాల్లో లభించే పలురకాల పండ్లను తింటే ఎన్నో వ్యాధులను నివారించుకోవచ్చని పోషకాహర నిపుణులు చెబుతుంటారు. అలాంటి పండ్లలో ఎంతో విశిష్టమైనది నేరేడు. వీటిలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంలా పనిచేస్తాయని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. అధిక బరువు, మధుమేహం ఉన్నవారు రోజుకు ఎనిమిది నేరేడు పండ్లు తింటే ఉపశమనం పొందవచ్చు.

Pages