S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

12/10/2015 - 03:51

చాలామందికి పెరుగన్నం తినకపోతే భోజనం చేసినట్లే అనిపించదు. రోజుకి రెండుసార్లయినా పెరుగు తినాల్సిందే అంటున్నారు పోషకాహార నిపుణులు. బరువుతగ్గాలనో, నిద్ర వస్తుందనో ఈమధ్య చాలామంది దీన్ని తీసుకోవడం మానేస్తున్నారు. కానీ, నిత్యం పెరుగు తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పలు పరిశోధనల్లో తేలింది. పెరుగు ద్వారా ఫాస్పరస్, విటమిన్-డి శరీరానికి అందుతాయి.

12/08/2015 - 21:33

చలిగాలుల తీవ్రత పెరిగిందంటే చాలు చాలామంది చుండ్రు, శిరోజాలు రాలడం వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. జుట్టు పొడిబారడం, శిరోజాలు చిట్లిపోవడం వంటి ఇబ్బందుల్ని సైతం కొందరు ఎదుర్కొంటారు. ఇంట్లోనే కొన్ని సులువైన చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే ఈ సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. ఖరీదైన క్రీమ్‌లు, లోషన్లకు బదులు సహజసిద్ధంగా లభించే ఆకులను ఉపయోగించి చుండ్రు, జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు.

12/07/2015 - 22:27

మూత్రపిండాల వ్యవస్థ సక్రమంగా పనిచేయకుంటే వొంట్లో నీరు ఉండిపోయి పొట్ట భాగం ఉబ్బి పోవడం, జ్వరం రావడం, మోకాళ్ల వాపులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే కడుపు ఉబ్బరం సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు.
* నీటిలో జీలకర్ర నానబెట్టి, ఆ రసాన్ని మూడు పూటలా చెంచాడు చొప్పున తీసుకోవాలి.
* మారేడు ఆకుల రసంలో కాస్త మిరియాల పొడి కలిపి తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

12/05/2015 - 05:42

* సులువుగా జీర్ణమయ్యే పదార్థాల్లో బార్లీ ఒకటి. దాహాన్ని తీర్చడంలో బాగా ఉపయోగపడుతుంది.
* జ్వరంతో బాధపడేవారికి బార్లీ జావ మంచి ఆహారం. వీటిలో పోషకాలు అధికంగా వుండి త్వరగా జీర్ణమవుతాయి.
* మూత్ర పిండ సమస్యలు వున్నవారు బార్లీ జావను క్రమం తప్పకుండా కొన్నాళ్లు తీసుకొంటే యూరినరీ ఇన్‌ఫెక్షన్ల నుండి ఉపశమనం పొందవచ్చు. మూత్రపిండాలలోని రాళ్ళు కరిగిపోయేందుకు బార్లీ సహకరిస్తుంది.

12/02/2015 - 21:30

మనదేశంలో అరటిపండును ‘పేదవాడి ఆపిల్’ అంటారు. ఈ రెండు పండ్లూ మంచి పోషక విలువలను కలిగి ఉంటాయి. ధర పరంగా చూస్తే ఆపిల్ ఖరీదైనది, అరటి పండు చవకైనది. ఏడాది పొడవునా పుష్కలంగా లభించే అరటి పండ్లలో పోషక పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది త్వరగా జీర్ణమైపోయి శక్తిని ఇస్తుంది. సంపూర్ణాహారమైనందున ఎదుగుతున్న పిల్లలకు ఇది చాలా మంచిది. చాలామంది భోజనం చేశాక అరటి పండును విధిగా తింటారు.

12/02/2015 - 01:53

ఆకుకూరలన్నింటిలోనూ మహిళల పాలిట వరం మెంతికూర అని చెప్పొచ్చు. ముఖ్యంగా గర్భిణులు దీన్ని వారంలో మూడు, నాలుగు సార్లు తీసుకున్నా మంచిదే. గర్భస్థ శిశువు ఎదుగుదలకు మెంతిలోని విలువైన పోషకాలు దోహదపడతాయి. బాలింతలు మెంతికూర తింటే శిశువులకు తల్లిపాలు తగినంతగా లభిస్తాయి. నెలసరికి ముందు, తర్వాత కడుపునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే మహిళలు తరచూ ఆహారంలో మెంతికూర తింటే ఉపశమనం కలుగుతుంది.

11/28/2015 - 23:24

శారీరక శుభ్రత, మానసిక ఉత్తేజం కోసం రోజూ స్నానం చేయడం అందరికీ తెలిసిందే. అయితే, ఉప్పు కలిపిన నీటితో తరచూ స్నానం చేస్తుంటే ఆరోగ్యరీత్యా ఎంతో మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. వంటకాల్లో రుచి కోసమే కాదు, స్నానం చేసే నీళ్లలో కాస్త ఉప్పు కలిపితే పలు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయంటున్నారు. ఉప్పు నీటితో స్నానం చేస్తే చర్మంపై మచ్చలు తొలగిపోతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

11/28/2015 - 23:31

వంటల్లో రుచి కోసం వాడే జీలకర్ర మన ఆరోగ్యానికి దివ్యౌషధంలా పనిచేస్తుంది. అజీర్తి, ఆస్తమా, వాంతి లక్షణాలు, కడుపునొప్పి, కొన్నిరకాల క్యాన్సర్లను నివారించడంలో ఇది ఎంతగానో దోహదపడుతుంది. మసాలా దినుసుగానే కాదు, ఆరోగ్యరీత్యా జీలకర్రను వాడడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ గ్లాసుడు నీటిలో కాస్త జీలకర్ర వేసుకుని తాగితే జీర్ణ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

Pages