S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

02/17/2016 - 21:02

శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు సమృద్ధిగా ఉండాలి. పోషకాల్లో ఇవి ఎక్కువగా ఉండేలా తగిన ఆహారాన్ని ఎంచుకోవాలి. విటమిన్ మాత్రలను వేసుకోవడానికి అలవాటు పడడం కన్నా, అవి పుష్కలంగా లభించే ఆహారాన్ని విధిగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ముందుగా రోగనిరోధక వ్యవస్థ బలోపేతం కావాలి. ఇందుకు విటమిన్లతో కూడిన సమతుల ఆహారం అనునిత్యం తీసుకోవాలి.

02/17/2016 - 05:37

‘చీరకట్టులో నేను నా అసలు వయసుకన్నా పెద్దదానిలా కన్పిస్తానంటారు చాలామంది. కానీ నాకు చీరలంటే చాలా ఇష్టం. మన సంప్రదాయే అని కాదుగానీ...అవి కట్టుకోవడం నాకు సరదా’ అంటోంది జాతీయనటి అవార్డు గ్రహీత విద్యాబాలన్. చీరకట్టుకోవడం మాననే మానని తెగేసి చెబుతోంది. ‘మనం ఏం కట్టుకున్నామో, ఏం కట్టుకోవాలో ఎవరో చెప్పడం, మన వేషభాషలపై వేరెవరో వ్యాఖ్యానాలు చేయడం మన సమాజంలో లోపం.

02/13/2016 - 21:20

ఘాట్‌రోడ్డుపై ప్రయాణించడం ఎంత కష్టమో, గాట్లున్న మొహాన్ని చూడటం కూడా అంతే కష్టం. ఆ గాట్లున్న మొహం మనదైతే అది- భరించడం మహా కష్టం..
అది ప్రత్యక్ష నరకం. ఇరవై ఏళ్ళ తరువాత కలుసుకున్న
ఓ స్నేహితుడు తన మిత్రుడి మొహం చూడగానే-

02/11/2016 - 22:22

శాకాహారం తీసుకునేవారు ఆకుకూరలు, కూరగాయలపైనే పూర్తిగా ఆధార పడకుండా శరీరానికి పోషకాలు అందించే గింజలు, పాల ఉత్పత్తులు, తాజా పండ్లను విరివిగా వాడుతుండాలి. బాదం, వేరుశనగ, బటానీలు వంటివి తీసుకుంటే శరీరానికి కావల్సిన పీచు పదార్థాలు, విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలు అందుతాయి. గుడ్లు, పాల ఉత్పత్తులను తరచూ తీసుకుంటే కాల్షియం, విటమిన్-డి సమృద్ధిగా శరీరానికి లభిస్తాయి.

02/11/2016 - 07:31

దగ్గు, ఇన్‌ఫెక్షన్ల సమస్య నుంచి ఉపశమనం పొందేందుకే కాదు.. శరీరంలో అదనపు బరువును తగ్గించుకునేందుకు తేనె దివ్యౌషధంలా పనిచేస్తుంది. తేనెలో తీపిదనం (సుగర్) ఉన్నప్పటికీ కొన్ని పద్ధతుల్లో దాన్ని వినియోగించుకుంటే బరువు సమస్యను అధిగమించే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది. కాచి చల్లార్చిన నీటిలో లేదా నిమ్మరసంలో తేనె వేసుకుని తాగితే సుగర్ ప్రభావం ఉండదు.

02/10/2016 - 08:39

సుమారు ఆరు దశాబ్దాలుగా విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ప్లాస్టిక్ బొమ్మ ‘బార్బీ’ ఇపుడు కొత్త రూపంలో దర్శనం ఇస్తోంది. సహజమైన తెలుపురంగులో అమెరికా బాలికను గుర్తుచేసే ఈ బొమ్మ ఇపుడు తలపై బురఖాతో వినూత్న అందాలను సంతరించుకుంది. బురఖా (హిజబ్) ధరించిన దీన్ని ఇపుడు సామాజిక మీడియాలో ‘హిజార్బీ’గా వ్యవహరిస్తున్నారు.

02/06/2016 - 23:07

కాలంతో సంబంధం లేకుండా కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగినా ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు మేలు చేస్తుందని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు.
* రక్తప్రసరణ తీరు సక్రమంగా ఉండాలంటే తరచూ కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అధిక రక్తపోటును అరికడుతూ, గుండెపోటును నివారించేందుకు కొబ్బరి బొండం దోహద పడుతుంది. గుండె సంబంధ రక్తనాళాల్లో సమస్యలు లేకుండా, బ్లడ్ సుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

02/05/2016 - 00:08

మంచి శరీరాకృతితో నాజూగ్గా ఉండాలని మగువలు తపన పడడం సహజమే. పొట్ట్భాగం పెరగకుండా ఉండాలంటే వనితలు సరైన ఆహార పద్ధతులను పాటిస్తూ రోజూ తగినంత వ్యాయామం చేస్తుండాలి. జీర్ణక్రియ సవ్యంగా ఉండేందుకు, ఎముకల దృఢత్వానికి, కొవ్వు పెరగకుండా ఉండేందుకు దోహదపడే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. బచ్చలికూరను తరచూ తింటే శరీరం బరువు తగ్గి పొట్ట్భాగం పెరగకుండా ఉంటుంది.

02/04/2016 - 03:34

వెల్డర్‌గా పనిచేసే తండ్రి సంపాదన అంతంత మాత్రమే.. కటిక దారిద్య్రం.. గ్రామీణ నేపథ్యం.. ఇన్ని సమస్యల నడుమ చదువుపైనే దృష్టి సారించిన ఆ కుర్రాడు ఇపుడు ఒక్కసారి వార్తల్లో వ్యక్తిగా మారాడు. బిహార్‌లో అత్యంత వెనుకబడిన ఖగారియా ప్రాంతంలోని సాన్‌హౌలి గ్రామానికి చెందిన వాత్సల్యసింగ్ చౌహాన్‌కు ఐటి దిగ్గజమైన ‘మైక్రోసాఫ్ట్’లో 1.02 కోట్ల రూపాయల జీతానికి మంచి ఉద్యోగం దక్కింది.

02/03/2016 - 03:56

చర్మం ఎర్రగా మారిపోవడం, మంట పుట్టడం, దద్దుర్లు, పొలుసులు దేరడం, తేమను కోల్పోవడం వంటి సమస్యలు ఎదురైతే వెంటనే తగిన నివారణ చర్యలు తీసుకోవాలి. ఈ సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తే ఎగ్జిమా, సొరియాసిస్ వంటి వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. ఇంట్లోనే కొద్దిపాటి చిట్కాలను పాటిస్తే చర్మసంబంధ సమస్యల నుంచి ఆదిలోనే గట్టెక్కే అవకాశం ఉంది.

Pages